YSRCP | ఫ్యాన్ కింద ఉక్కపోత…

ysrcp

 YSRCP | ఫ్యాన్ కింద ఉక్కపోత…

ఏలూరు, డిసెంబర్ 4, (న్యూస్ పల్స్)
వైసీపీ క్రమంగా ఖాళీ అవుతోందా? సీనియర్ నేతలు, మాజీ మంత్రులు ఫ్యాన్‌కు గుడ్ బై చెప్పే పనిలో పడ్డారా? రేపో మాపో మాజీ మంత్రి ఒకరు సైకిల్ ఎక్కుబోతున్నారా? టీడీపీ అధినేత గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.వైఎస్ ఫ్యామిలీకి అత్యంత సన్నిహితులుగా మెలిగిన కీలక నేతలు ఆ పార్టీకి రాం రాం చెప్పేస్తున్నారు. ఇప్పటికే మోపిదేవి, బాలినేని శ్రీనివాసరెడ్డి వంటి నేతలు గుడ్ బై చెప్పే తమ దారి చూసుకుంటున్నారు. మోపిదేవి సైకిల్ ఎక్కేశారు. బాలినేని జనసేన పంచన చేరిపోయారు. మిగతా నేతలు సైతం తలోదారి చూసుకునే పనిలో నిమగ్నమయ్యారు.నేతలు వెళ్లిపోవడాన్ని ముందుగానే గమనించారు మాజీ సీఎం జగన్. ఈ క్రమంలో సంక్రాంతి తర్వాత జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టారు. అందుకు సంబంధించి ముహూర్తం కూడా పెట్టేసుకున్నారు. వారంలో రెండురోజుల పాటు జిల్లాల్లో మకాం వేయనున్నారు. ఇటు కేడర్‌.. అటు నేతలతో భేటీ అవ్వాలని నిర్ణయించుకున్నారు అధినేత.వైసీపీ కదలికలను ముందుగానే పసిగట్టాయి కూటమి పార్టీలు. ఈ క్రమంలో వైసీపీ కీలక నేతలతో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు మంతనాలు మొదలుపెట్టారు. వైఎస్ ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడిగా ఉండే మాజీ మంత్రి ఆళ్ల నాని మరో పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమైంది.మాజీ మంత్రి ఆళ్ల నాని రెండు నెలల కిందట వైసీపీ జిల్లా అధ్యక్ష పదవికి, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆ తర్వాత తన ప్రయత్నాలు మొదలుపెట్టారు. టీడీపీ కీలక నేతలతో ఆయన మంతనాలు సాగించారట. ఇటు ముఖ్యమంత్రితో, అటు నారా లోకేష్‌తో జరిపిన మంతనాలు ఫలించినట్లు సమాచారం.మంత్రి వర్గం సమావేశం తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారట ఆళ్ల నాని.

ఆళ్ల నాని చేరికను కొందరు టీడీపీ నేతలు వ్యతిరేకిస్తున్నారు. వైసీపీ హైకమాండ్ ఆదేశాలతో చంద్రబాబు కుటుంబాన్ని సోషల్ మీడియాలో దారుణంగా కించపరిచారని గుర్తు చేస్తున్నారు. కార్యకర్తలకు క్షమాపణలు చెప్పిన తర్వాతే రావాలన్నది ఆయా నేతల డిమాండ్.మరోవైపు భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాసరావు సైతం టీడీపీతో మంతనాలు సాగించినట్టు వార్తలు వస్తున్నాయి. రీసెంట్ ఐటీ దాడులు జరగడంతో ఆయన సైలెంట్ అయ్యారని, రేపో మాపో ఆయన కూడా సైకిల్ ఎక్కడ ఖాయమనే ప్రచారం బలంగా సాగుతోంది.ఇదేకాకుండా… వైసీపీలోని కొందరు నేతలు కూటమి పార్టీల నేతలతో అంతర్గతంగా చర్చలు జరుపుతున్నారట. ఈ నెలల్లో ఆయా చర్చలు కొలిక్కి వచ్చే అవకాశమున్నట్లు సమాచారం. అదే జరిగితే సంక్రాంతికి ముందే వైసీపీ ఖాళీ అవ్వడం ఖాయమని అంటున్నారు.ఏపీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను ఫ్యాన్ పార్టీ నేతలు క్షుణ్నంగా గమనిస్తున్నారు. మునిగిపోయే నావలో ఉండే బదులు.. ముందుగానే బయటపడితే బెటరనే వాదనలో చాలామంది నేతల్లో వినిపిస్తోంది. ఈ లెక్కన వైసీపీలో ముసలం మొదలైందనే చెప్పవచ్చు.

ysrcp

Read : Pawan Kalyan | కాకినాడ పోర్టు లో పవన్ తనిఖీలు | Eeroju news

Related posts

Leave a Comment