ఎన్నికలకు సిద్ధం అవుతున్న వైసీపీ
గుంటూరు, డిసెంబర్ 14, (న్యూస్ పల్స్)
ఏపీలో పోయిన చోట వెతుక్కోవడంతో పాటు రాబోయే ఎన్నికలకు కార్యకర్తలను ఇప్పటి నుంచే సిద్ధం చేసుకుంటోంది. ఏపీలో ప్రభుత్వాలు ఏవైనా పరిణామాలు ఎలా ఉన్నా విజయం మాత్రం తమదే అంటూ ధీమా వ్యక్తం చేస్తోంది వైసీపీ. అసలు ప్రభుత్వ ఏర్పాటుపై వైసీపీ లెక్క ఏంటి..? ఎన్నికపై జగన్ వ్యూహాలు ఏంటి? ప్రభుత్వం తమదే అంటున్న వైసీపీ నేతల వ్యాఖ్యల వెనక ఉన్న ఆంతర్యం ఏంటి..? అన్నదీ హాట్ టాపిక్‌గా మారింది.సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత వైసీపీకి పునర్వవైభవం తీసుకువచ్చే దిశగా ఆ పార్టీ నేతలు అడుగులు వేస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళీ పర్యటించి, ఏపీలో పట్టు నిలుపుకునేందుకు పార్టీ నేతలను కార్యకర్తలను ఆ పార్టీ అధినాయకత్వం ఇప్పటినుంచే సిద్ధం చేస్తోంది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి ఫలితాల తర్వాత ఆయా లోటుపాట్లను సరిదిద్ది, నూతన ఉత్సాహంతో ఎన్నికలకు కేడర్‌ను సిద్ధం చేస్తోంది వైసిపి.ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం కార్యకర్తల్లో నేతలు అంతా చెల్లా చదురవడంతో వారందరినీ ఏకతాటిపైకి తీసుకువచ్చేందుకు నేరుగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ బాధ్యతలను భుజానికి వేసుకున్నారు. అందులో భాగంగానే ఎన్నికల ఫలితాలు వెలువడిన మూడు నెలల్లోనే కొత్త జిల్లా కమిటీలు,కొత్త అధ్యక్షులు,నూతన నియోజకవర్గ సమన్వయ కర్తలు, నూతన అనుబంధ సంఘాల విభాగాల నేతలను నియమించి పార్టీలో కొత్త జోష్ తీసుకొస్తున్నారు. పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి మానిటర్ చేసేందుకు ఎప్పటికప్పుడు కొత్త టీములను సైతం సిద్ధం చేసుకుంటున్నారు వైఎస్ జగన్. ఎన్నికల ఫలితాలపై ఇప్పటికే అన్ని లెక్కలను సిద్ధం చేసుకున్న వైసీపీ, అధినాయకత్వం ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నా, ఇప్పటి నుంచే తమ కార్యాచరణను సిద్ధం చేస్తున్నారు.ఎన్నికల ఫలితాలతో వైసీపీ పూర్తిగా డీలాపడటంతో ఇప్పటి నుంచే ఎన్నికల కోసం వైసీపీ లెక్కలు చేస్తోంది. 2019 ఎన్నికల ఫలితాలను పునరావృతం చేయాలన్న సంకల్పంతో ప్రస్తుతం పార్టీ కేడర్‌ను సిద్ధం చేసుకుంటుంది. జమిలి ఎన్నికలకు సంబంధించిన బిల్లును కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఆమోదించిన నేపథ్యంలో జమిలి ఎన్నికలు వస్తాయన్న యోచనలో ఉన్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం ఆయా ఎన్నికల్లో కచ్చితంగా వైసీపీ విజయం సాధిస్తుందన్న ఆశాభావం చేస్తుంది.
అందులో భాగంగానే గత ఎన్నికల్లో జరిగిన తప్పులు పునరావృత్తం కాకుండా కేడర్‌కు, లీడర్లకు మధ్య గ్యాప్ లేకుండా ఎన్నికల కోసం సమాయత్తం చేస్తోంది. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే జిల్లాల పర్యటనకు రంగం సిద్ధం చేసుకుంటున్న వేళ జమిలి ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రతి కార్యకర్తకు ప్రతి నేతకు భరోసా ఇచ్చే దిశగా జగన్ అడుగులు వేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతోనే అధినాయకత్వం సైతం రాష్ట్రవ్యాప్తంగా క్షేత్రస్థాయిలో పర్యటనలు చేస్తూ సమస్యలపై ఆందోళన చేపట్టడంతో పాటుగా పార్టీకి దూరంగా ఉన్న ప్రతి కార్యకర్తను దగ్గర అయ్యేలా చూడాలంటూ ఆయా జిల్లా నాయకత్వాలకు రాష్ట్ర అధినాయకత్వం స్పష్టమైన ఆదేశాలను పంపింది.ఇప్పటికే వైఎస్ జగన్ కార్యకర్తలపై దాడులు ప్రతి దాడులు జరిగిన చోట పరామర్శల పేరుతో పర్యటనలు చేయడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఆయా జిల్లాల పరిధిలో పార్టీ పరిస్థితి నాయకత్వం మార్పు కొత్త అధ్యక్షులు నియామకం రీజనల్ కోఆర్డినేటర్ల బాధ్యతలు అప్పగించడం లాంటి అంశాలను ప్రత్యేకంగా తీసుకొని ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తున్నారు. వైసీపీ కేంద్ర కార్యాలయం వేదికగా వరుస సమావేశంలో నిర్వహించడంతోపాటు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులతో ప్రత్యేకంగా భేటీ అవుతున్నారు. పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు పార్టీ తరపున ఎన్నికైన ప్రతి ఒక్కరికి పార్టీ తరపున భరోసా ఇస్తూనే జమిలి ఎన్నికలకు సిద్ధం కావాలంటూ జగన్మోహన్ రెడ్డి నేరుగా పిలుపునిస్తున్నారు.జమిలి ఎన్నికలను పెంచాలని కేంద్రం అడుగులు వేస్తున్న వేళ ఏపీలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సైతం అందుకు తగ్గట్టుగానే తన కార్యాచరణను సిద్ధం చేసుకుంటుంది. జమిలి ఎన్నికలకు తాము మొదటి నుంచి ఆమోదం తెలిపామన్న విషయాన్ని స్పష్టం చేస్తూనే ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తాము విజయం సాధిస్తామంటూ కార్యకర్తలకు నేతలకు భరోసా ఇస్తోంది. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, జరిగిన పరిణామాలు దృష్ట్యా తమకంటూ ఉన్న ఓటు బ్యాంకు ఎక్కడకు దూరం కాలేదని అధిష్టానం భావిస్తోంది. పార్టీ తరఫున జరిగిన లోటు పాట్ల చెక్ పెట్టామని, ఏపీలో ప్రజలు మళ్లీ తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టం కడతారని వైసీపీ నేతలు అంటున్నారు.
జగన్ మోహన్ రెడ్డి పరిపాలన పరమైన అంశాల విషయంలో ప్రజల్లో ఎక్కడ ఇబ్బందులు లేవని, జమిలి ఎన్నికలను వైసిపి స్వాగతిస్తుందని, ఎన్నికలు ఎప్పుడొచ్చినా తాము విజయం సాధిస్తామంటూ వైసీపీ అధినాయకత్వం స్పష్టంగా చెబుతోంది.అందులో భాగంగానే ఎప్పటి నుంచే పార్టీ కేడర్‌ను సిద్ధం చేసుకుంటూనే మరోసారి అధికారాన్ని చేపట్టడమే లక్ష్యంగా జమిలి ఎన్నికలకు సిద్ధమవుతామని వైసీపీ ప్రకటిస్తోంది. ఇదే అంశాన్ని వైఎస్ జగన్ మీడియా సమావేశం వేదిక స్పష్టం చేశారు. జెమిలి ఎన్నికలు ఎప్పుడొచ్చినా తాము సిద్దంగా ఉన్నామని ఆ ఎన్నికల్లో విజయం సాధిస్తామని ఆయన నిర్మోహమాటంగా చెప్పేస్తున్నారు.ఇదిలా ఉంటే జమిలి ఎన్నికలపై వైసీపీ వేస్తున్న లెక్కల విషయంలో కూటమి ప్రభుత్వం మాత్రం అందుకు భిన్నమైన ప్రకటన చేస్తోంది. జెమిలి ఎన్నికలు ఎప్పట్లో లేవని కేవలం పార్టీ కార్యకర్తలను నేతలను నాయకత్వాన్ని దగ్గర చేసుకునే ప్రయత్నంలో భాగంగాని జెమిలి ఎన్నికలంటూ కొత్త అంశాన్ని వైసీపీ తెరపైకి తీసుకువచ్చిందంటున్నారు. తమ ఉనికిని కాపాడుకునేందుకు కొత్త ఎత్తులు వేస్తోందని రాష్ట్రమంత్రులు ధ్వజమెత్తారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం సాధిస్తామన్న ప్రకటనను పదేపదే చెప్పి పార్టీకి దూరమైన కార్యకర్తలను నేతలను దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారని, వరసగా పార్టీని వీడుతున్న నేతల విషయంలో ఏం చేయాలో అర్థం కాని వైసీపీ అధినాయకత్వం జెమినీ పేరుతో రాంగ్ ట్రాక్ పట్టిస్తున్నారు అంటూ మంత్రులు మండిపడుతున్నారు. ఎన్నికలు ఏమైనా ఎప్పుడు వచ్చినా కూడా మళ్లీ తిరిగి కూటమి ప్రభుత్వం అధికారులకు వస్తుందంటూ స్పష్టం చేస్తున్నారు. మొత్తానికి ఏపీలో ఎన్నికల సంగతి అటూ ఉంచితే, అధికార, విపక్షాలు ఎవరికి వారు కొత్త లెక్కలను సిద్ధం చేసుకుంటారు.