YS Jagan Mohan Reddy | నష్ట నివారణ చర్యల్లో జగన్ | Eeroju news

నష్ట నివారణ చర్యల్లో జగన్

నష్ట నివారణ చర్యల్లో జగన్

కడప, నవంబర్ 24, (న్యూస్ పల్స్)

YS Jagan Mohan Reddy

గెలుస్తామా.. లేదా..?! 2024 ఎన్నికలపై వైసీపీ నేతల్లో హైటెన్షన్!మాజీ ముఖ్యమంత్రి జగన్ నా చెల్లెలు షర్మిల అని కలవరించడం మొదలుపెట్టారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక తల్లి, చెల్లెల్ని పూర్తిగా పక్కన పెట్టిన జగన్.. గద్దె దిగాక వారిపై అస్తులకు సంబంధించి కేసులు కూడా పెట్టి .. విమర్శల పాలవుతున్నారు. ఎన్నికల ప్రచారంలో షర్మిలను టార్గెట్ చేసి ఆమె కట్టుకున్న చీర గురించి అనైతికంగా మాట్లాడిన ఆయన ఇప్పుడు చంద్రబాబును టార్గెట్ చేస్తూ చెల్లెలి భజన మొదలుపెట్టడం చర్చనీయాంశంగా మారింది.తల్లీ.. చెల్లీ అంటూ ఎక్కడపడితే అక్కడ నా కుటుంబం గురించి మాట్లాడుతున్నావ్ కదా నారా చంద్రబాబు నాయుడు. మీకూ కుటుంబాలు ఉన్నాయి కదా? అని బేలగా వాపోతున్నారు. తమ కుటుంబంలో విభేదాలు ఉన్నాయని అంగీకరిస్తున్న మాజీ ముఖ్యమంత్రి జగన్.. నీ బావమరిది బాలకృష్ణ సొంత బిల్డింగ్‌ నుంచి నా చెల్లి షర్మిలమ్మపై దుష్ప్రచారం చేయించలేదా అని ప్రశ్నిస్తున్నారు.

ఎన్నికల ప్రచారంలో పీసీసీ ప్రెసిడెంట్ షర్మిలను తనతో పాటు వైసీపీ నేతలతో కూడా టార్గెట్ చేయించిన జగన్.. అసలు అధికారంలోకి వచ్చినప్పటి నుంచే ఆమెను దూరంగా పెట్టేశారు. వైసీపీ అధికారంలోకి రావడానికి కృషి చేసిన చెల్లెలుకి జగన్ ఎలాంటి న్యాయం చేయలేదు. పైపెచ్చు ఇప్పుడు గద్దె దిగాక తల్లి, చెల్లిపై కేసులు పెడుతూ ఆస్తుల వివాదంలో పరుపుపోగొట్టుకుంటున్నారుజగన్ ఇప్పుడు కుటుంబం గురించి, విలువల గురించి మాట్లాడుతుండటం వెనుక అంతర్యం ఏంటి..? జరుగుతున్న డ్యామేజీను కంట్రోల్ చేయడానికా? నిజంగా పశ్చాతాపంతో మాట్లాడుతున్నారా? లేకపోతే సింపతీ క్రియేట్ చేసుకోవడానికి మరో డ్రామాకి తెరలేపారా అన్న చ్చ మొదలైంది. సోషల్ మీడియా పోస్టులపై ఓ వైపు షర్మిల స్వయంగా జగన్‌పై ధ్వజమెత్తుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో జగన్‌.. నా చెల్లి, తల్లి అంటూ కామెంట్స్‌ చేయడంపై జోరుగా చర్చ సాగుతుంది.

సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై ఇంతకాలం డిఫెన్స్ మోడ్ లోనే ఉండిపోయిన జగన్ తాజాగా తన కుటుంబం మీద చంద్రబాబు నిరాధార ఆరోపణలు చేయిస్తున్నారని ఆరోపిస్తున్నారు. తాజా ప్రెస్ మీట్‌ 2019లో వైఎస్ షర్మిల మాట్లాడిన వీడియోను ప్లే చేయించిన జగన్ తన తల్లి మీద చెల్లెలు మీద టీడీపీ వారే దారుణంగా ఆరోపణలు చేశారని ఎదురు దాడికి దిగారు. మరి అధికారంలో ఉన్నప్పుడు అలాంటి వారిపై జగన్ ఎందుకు చర్యలు తీసుకోలేదో? ఆయనకే తెలియాలి.జగన్ అయిదేళ్ల పాలనలో షర్మిలతో పాటు విపక్ష నేతలపై సోషల్ మీడియాలో ఎంత దుష్ట్రచారం చేసారో తెలిసిందే .. వర్రా రవీంద్రరెడ్డి, బోరగడ్డ అనిల్, శ్రీ రెడ్డి లాంటి వాళ్లు సోషల్ మీడియాల్లో వ్యక్తిగతంగా షర్మిల, విజయమ్మ , సునీతలను టార్గెట్ చేస్తూ కామెంట్స్‌,పోస్టులు చేసినా జగన్‌ ఎప్పుడూ స్పందించలేదు.

కనీసం అసభ్యకరంగా పోస్టులు పెడుతున్న వారిపై చర్యలు తీసుకోలేదు. ఇప్పడు జగన్ డైరెక్షన్‌లోనేనే సోషల్ మీడియాలో దుష్ర్పచారం జరిగిందని షర్మిల ఆరోపిస్తున్నారు..అవినాశ్ రెడ్డి, సజ్జల భార్గవ్‌పై కేసులు పెట్టాలని షర్మిల డిమాండ్‌ చేస్తున్నారు. 2019 కంటే ముందు జరిగిన పరిణామాలపై స్పందించే జగన్.. 2019 నుంచి 2024 మధ్య జరిగిన అంశాలపై ఎందుకు స్పందించడంలేదని అందరూ నిలదీస్తున్నారు.అక్రమాస్తుల కేసులు, గత ప్రభుత్వం హయాంలో జరిగిన అక్రమాల, దౌర్జన్యాలకు సంబంధించి వివాదాలు, తల్లిపై ఆస్తి కోసం కేసు పెట్టారన్ని అపఖ్యాతి ఇలా జగన్‌ చుట్టూ వివాదం కమ్ముకుంటున్నాయి. ఇలాంటి తరుణంలో తనకు, పార్టీకి జరుగుతున్న డ్యామేజీను కంట్రోల్ చేయడానికే తల్లి,చెల్లిపై ప్రేమ కనబరుస్తున్నారన్న టాక్ వినిపిస్తుంది. మరి ఈ డైవర్షన్ పాలిటిక్స్‌తో ఆయన ఏం సాధిస్తారో చూడాలి.

నష్ట నివారణ చర్యల్లో జగన్

TDP influence on Jagan’s political life | జగన్ కు దూరమవుతున్న ఫ్యామిలీ, పొలిటికల్ ఫ్రెండ్స్.. | Eeroju news

Related posts

Leave a Comment