YS Jagan : జగన్ అత్యుత్సాహం కొంపముంచుతోంది

What is Jagan's strategy behind petitions in courts?

-జగన్ అత్యుత్సాహం కొంపముంచుతోంది…

కడప, డిసెంబర్ 17 (న్యూస్ పల్స్)
జగన్ ఎందుకు టెన్షన్ పడుతున్నారు? నెగిటివ్ క్యాంపెయిన్‌కు కూటమి సర్కార్ ఫుల్‌స్టాప్ పెట్టిందా? దీంతో ఏం చెయ్యాలో జగన్ తికమకపడు తున్నారా? నేరుగా వైఎస్ఆర్ ఫోటో పెట్టి కొత్త ప్రచారం మొదలుపెట్టిందా? టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ పెట్టిన పథకాలను వైఎస్ఆర్ పెట్టినట్టుగా ప్రచారం చేస్తోందా? అవుననే అంటున్నారు అభిమానులు.వైసీపీ అధినేత జగన్ బ్రహ్మాస్త్రం సోషల్ మీడియా. ప్రత్యర్థులపై దారుణంగా కామెంట్స్ పెట్టి ప్రభుత్వంపై విమర్శించేవారు. 2014-19 మధ్యకాలంలో అదే జరిగింది. ఇప్పుడు అదే స్ట్రాటజీని మొదలు పెట్టారు. దీన్ని ముందుగా పసిగట్టిన కూటమి సర్కార్, ఆదిలో చెక్ పెట్టేసింది. దీంతో వైసీపీ సోషల్ మైకులు మూగబోయాయి.వైసీపీ హార్డ్ కోర్ అభిమానులు అక్కడక్కడా కొందరు రీసౌండ్ చేస్తున్నారు. గడిచిన ఆరునెలలుగా తాము ఇస్తున్న సందేశం ప్రజలకు సరిగా రీచ్ కాలేదని తెగ బాధపడు తున్నారట నేతలు. ఈ విషయాన్ని కొందరు నేతలు అధినేత దృష్టికి తెచ్చారట. ఇప్పుడున్న పరిస్థితుల్లో కీలక నేతలు మీడియా ముందుకొచ్చి మాట్లాడడం తప్పితే మరొక మార్గం లేదని అన్నారట అధినేత.ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల.. వైఎస్ఆర్ ఫోటో పెట్టుకుని ప్రజల్లోకి వెళ్తున్నారు. ఆమె మాట్లాడిన ప్రతీ మాటలో వైఎస్‌ఆర్‌ను ప్రస్తావిస్తున్నారు. దీన్ని పసిగట్టిన వైసీపీ, సోషల్ మీడియా ద్వారా ఇటు టీడీపీ, అటు కాంగ్రెస్‌కు సమాధానం ఇవ్వాలని ప్లాన్ చేసింది.. ఆ విధంగా ముందుకెళ్తోంది.రీసెంట్‌గా సోషల్ మీడియా ఓ పోస్టు పెట్టింది వైసీపీ. రూ. 2ల‌కే కిలో బియ్యం ప‌థ‌కాన్ని ప్ర‌వేశ‌పెట్టి పేద‌ల క‌డుపు నింపిన నాయ‌కుడు దివంగ‌త మ‌హానేత డాక్ట‌ర్ వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి అంటూ కొత్త ప్రచారం మొదలుపెట్టేసింది. ఆ పోస్టును చూసి చాలామంది నవ్వుకుంటున్నారు.చనిపోయిన తండ్రిని నవ్వులు పాలయ్యేలా వైసీపీ ప్రచారం మొదలుపెట్టిందని కొందరు మాట్లాడుకోవడం మొదలైంది. రెండు రూపాయలు కిలో బియ్యం పథకాన్ని ప్రవేశ పెట్టింది టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ అని, ఈ విషయం ఎవర్ని అడిగినా చెబుతాడు. ఇప్పటికీ ఆ స్కీమ్ కొనసాగుతోంది కూడా.నాటి నుండి నేటి వరకు నాలుగు దశాబ్దాలు గడిచినా అది కంటిన్యూ అవుతోంది. ఎన్టీఆర్ పెట్టిన రేషన్ స్కీమ్‌ను వైఎస్ఆర్  పెట్టినట్టుగా ప్రచారం చేసుకుంటోంది. తన రాజకీయాల కోసం తండ్రిని జగన్ బాగానే వాడుకుంటున్నారనే ప్రచారం లేకపోలేదు. కాకపోతే కరోనా సమయంలో పేదలకు ఉచితంగా బియ్యం ఇవ్వాలని నిర్ణయించింది కేంద్రం.వైసీపీ చేసిన పోస్టుకు కామెంట్లు తెగ పడిపోతున్నాయి. చనిపోయిన తండ్రిని ఎందుకు తెరపైకి తెచ్చావంటూ ప్రశ్నించేవాళ్లు లేకపోలేదు. 2019 ఎన్నికల్లో తండ్రి, తల్లి, చెల్లిని ఉపయోగించుకుని, ఆ తర్వాత వారిని దూరంగా పెట్టావంటూ మండిపడుతున్నారు. మళ్లీ తండ్రి భజన మొదలైందని అంటున్నారు. మరి వైసీపీ పథకాలేమయ్యాంటూ ప్రశ్నించడం కొందరి వంతైంది. మొత్తానికి జగన్ ఏ అంశం ఎత్తుకున్నా బూమరాంగ్ అవుతోందన్నమాట.

Read : YCP : వైసీపీలో ఆగని షాక్ లు

Related posts

Leave a Comment