స్పా సెంటర్లలో యవ్వారం
ఒంగోలు, జూలై 22 (న్యూస్ పల్స్)
Yavvaram in spa centers
బయటేమో స్పా, మస్సాజ్ సెంటర్ల బోర్డులు.. లోపలేమో యవ్వారం వేరే.. తనిఖీలకు వెళ్లిన పోలీసులు బిత్తరపోయారు.. ప్రకాశం జిల్లా ఎస్పిగా నాలుగురోజుల క్రితం బాధ్యతలు స్వీకరించిన దామోదర్ అసాంఘిక కార్యక్రమాలపై తనదైన స్టైల్లో దృష్టి పెట్టారు.. ఒంగోలులో మసాజ్ సెంటర్లపై ఏకకాలంలో దాడులు నిర్వహించారు. దీంతో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.. ఒంగోలు నగరంలో మసాజ్ సెంటర్లు, స్పా క్లినిక్ల పేరుతో యువతులతో యువకులకు క్రాస్ జెండర్ మసాజ్లు చేస్తున్నట్టు ఫిర్యాదులు వచ్చాయి.. దీంతో మొత్తం 16 స్పా సెంటర్లపై ఏకకాలంలో దాడులు చేయాలని ఎస్పి దామోదర్ పోలీసు సిబ్బందిని అదేశించారు.
ఎస్పి ఆదేశాల మేరకు బృందాలుగా విడిపోయిన పోలీసులు నగర పరిధిలోని పలు ప్రాంతాల్లో నడుపుతున్న స్పా సెంటర్లపై ఏకకాలంలో తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో పలు స్పా సెంటర్లలో యువకులకు యువతులు మసాజ్ చేస్తున్నట్టు గుర్తించారు. పలు సెంటర్లలో యువతీయువకులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించి కౌన్సిలింగ్ ఇచ్చారు.మరోవైపు స్పా సెంటర్ల పేరుతో క్రాస్ జెండర్ మసాజ్ చేస్తున్న కొన్ని పార్లర్లలో యువకులను ఆకర్షించేందుకు రూంలలో ఆధునాతమైన లైటింగ్లు, ఏసీలు ఏర్పాటు చేయడాన్ని చూసిన పోలీసులు బిత్తరపోయారు. అంతే కాకుండా మసాజ్ కోసం వచ్చే యువకులతో బేరసారాలు లేకుండా నేరుగా తెలుసుకునేందుకు ధరల పట్టిక కూడా ఏర్పాటు చేశారు.
రెండు నెలలకు ఒక ప్యాకేజీ, మూడు, నాలుగు నెలలకు డిస్కౌంట్తో కూడిన ఆఫర్లు కూడా ఇస్తున్నట్లు గుర్తించారు. కొన్నేళ్లుగా ఒంగోలులో గుట్టుగా సాగుతున్న ఈ క్రాస్ జెండర్ మసాజ్ సెంటర్లపై స్థానికులు ఫిర్యాదు చేస్తున్నా పట్టించుకోని పోలీసులు.. కొత్త ఎస్పి ఆదేశాలతో వెంటనే రంగంలోకి దిగి దాడులు చేయడం కలకలం రేపింది. స్పా సెంటర్ల పేరుతో క్రాస్ జెండర్లతో మసాజ్ చేస్తున్న వారిపై కేసులు పెట్టడం కంటే వారికి అవగాహన కల్పించి ముందు కౌన్సిలింగ్ చేయనున్నట్టు ఎస్పి దామోదర్ తెలిపారు.