Work From Home Policy for Women in AP : మహిళల కోసం వర్క్ ఫ్రమ్ హోమ్…

work from home for women

మహిళల కోసం వర్క్ ఫ్రమ్ హోమ్…
జీసీసీ పాలసీ 4.0 కోసం కసరత్తు

కాకినాడ, ఫిబ్రవరి 13, (న్యూస్ పల్స్)
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వర్క్ ఫ్రం హోమ్ జాబ్‌ను ప్రోత్సహిస్తోంది. ముఖ్యంగా మహిళలకు ఇంటి నుంచి పని చేయడం సౌలభ్యంగా ఉంటుందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఇంట్లో నుంచి పని చేయడం వల్ల శ్రామిక శక్తిలో మహిళల భాగస్వామ్యం పెరిగే అవకాశం ఉంటుందని ట్విట్టర్ వేదికగా సీఎం వ్యాఖ్యానించారు.రాష్ట్రంలోని మహిళల కోసం వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని ప్రారంభించడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. అంతర్జాతీయ సైన్స్ లో మహిళలు, బాలికల దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. రోజురోజుకీ అధునాతన టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో ఇంటి నుండి పని చేసే సంస్కృతి పెరిగిందన్నారు. సైన్స్ రంగంలో విజయం సాధిస్తున్న మహిళలను సీఎం ప్రశంసించారు. ప్రభుత్వం ఇంటి నుంచి పని చేయడాన్ని పెద్ద ఎత్తున ప్రణాళికలు రచిస్తున్నట్లు పేర్కొన్నారు. సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథమెటిక్స్ లాంటి రంగాలలో మహిళలకు సమాన అవకాశాలు అందించడానికి ఏపీ సర్కార్ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. కరోనా మహమ్మారి అనంతరం వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రాముఖ్యత అందిరకీ తెలిసిందని ఆయన తెలిపారు. అన్ని రంగాలలో మహిళలకు సమానమైన అవకాశాలు స్పష్టించడానికి తాము కట్టుబడి ఉన్నామని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.వర్క కల్చర్‌లోకి మహిళలను భారీగా తీసుకొచ్చేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో భారీ ఎత్తున వర్క్‌ఫ్ర హోమ్ కల్చర్‌ డెవలప్ చేయడానికి చర్యలు చేపట్టబోతున్నట్టు పేర్కొన్నారు. కరోనా తర్వాత పని విధానంలో చాలా మార్పు వచ్చిందని అన్నారు. పనితనాన్ని సులభంగా తెలియజేసేందుకు అవసరైన సాంకేతికత కూడా అందుబాటులోకి వచ్చిందని గుర్తు చేశారు.

వర్క్‌ ఫ్రమ్‌హోంకు ప్రాధాన్యత కూడా పెరిగిందని వెల్లడించారు. రిమోట్ వర్క్, కోవర్కింగ్ స్పేస్‌లు, నైబర్‌హుడ్ వర్క్‌స్పేస్‌లు వంటి భావనలు విస్తృతమవుతున్నాయని తెలిపారు. అవి వ్యాపారాలను, ఉద్యోగాలను సులభతరం చేస్తున్నాయని అన్నారు. ముఖ్యంగా మహిళల సౌలభ్యం కోసం వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని ప్రారంభించడానికి పెద్ద ఎత్తున్న తమ ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోందని సీఎం చంద్రబాబు నాయుడు చెప్పారు. రిమోట్ వర్కింగ్, కో- వర్కింగ్ స్పేస్, ఎక్కడి నుంచి అయినా వర్క్ చేసుకునే సౌలభ్యం ఉంటుందని అన్నారు. ఇవి కంపెనీలకు, ఉద్యోగులకు, వ్యాపార వేత్తలకు మంచి ఫలితాలు అందజేస్తాయని ఆయన తెలిపారు. మెరుగైన పని చేయడంతో పాటు వర్క్ లో మంచి ఔట్ పుట్ వచ్చే ఛాన్స్  ఉంటుంది.. కాబట్టి వర్క్ ఫ్ర హోమ్ ఉద్యోగాలు మహిళలకు ఎంతో ఉపయోగకరమని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాష్ట్రంలో ముఖ్యం అత్యవసర సర్వీసులైన రెవెన్యూ , పోలీసు, హాస్పిటల్, టీచర్లు విభాగాలు తప్పించి మిగిలిన విభాగాల్లో ఆఫీసుకు వచ్చే అవసరం ఉండదు.  ఇలాంటి ఉద్యోగాలకు ఇంటి నుంచే పని కల్పించే యోచనలో ప్రభుత్వం ఇప్పటికే కార్యాచరణ సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. మహిళలు ఆఫీస్ లో ఉద్యోగం చేయడం వల్ల శారీరకంగా, మానసికంగా ఎంతో అలసిపోతున్నారు.  ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయడానికి వర్క్ ఫ్రమ్ హోం ఆప్షన్ కరెక్ట్ గా ఉంటుందని సీఎం అన్నారు.ఆంధ్రప్రదేశ్‌లో మహిళ ఉద్యోగుల పాలిట ఇది అర్థవంతమైన మార్పుకు ఇది శ్రీకారం చుట్టబోతుందని సీఎం తెలిపారు. ఏపీ ఐటీ అండ్ జీసీసీ పాలసీ 4.0 ఒక గేమ్ ఛేంజింగ్ పాలసీ అని చెప్పారు. ఏపీలో పత్రి నగరం, పట్టణం, మండలంలో సాఫ్ట్ వేర్ ఆఫీసులు పెట్టడానికి ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇస్తామన్నారు. వర్క్ ఫ్రం హోమ్ ఉద్యోగం చేయడం ల్ల మహిళలకు ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు.

AP Tourism : టూరిజం ప్రాజెక్టులకు మహర్దశ

Related posts

Leave a Comment