విజయవాడ, జూన్ 20, (న్యూస్ పల్స్)
Will the YCP fight…. will they take a U turn..? : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకు రంగం సిద్ధమవుతోంది. అటూ ఇటూ మార్చినా చివరికి 21, 22 తేదీల్లో సభను సమావేశపరాచలని డిసైడయ్యారు. ఈ రెండు రోజుల్లో సభ్యుల ప్రమాణ స్వీకారం, స్పీకర్ ఎన్నిక ప్రక్రియను పూర్తి చేస్తారు. తర్వాత వాయిదా వేస్తారా కొనసాగిస్తారా అన్నది అప్పుడే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే గత ప్రభుత్వ విధ్వంసం మొత్తాన్ని ప్రజల ముందు ఉంచాలంటే పక్కాగా శ్వేతపత్రాలు సిద్ధం చేయాల్సి ఉందని.. అందుకే ముందుగా సభ్యుల ప్రమాణ స్వీకారం, స్పీకర్ ఎన్నికకే పరిమితం చేస్తున్నారని భావిస్తున్నారు. అయితే ఆ తర్వాత రెండు వారాలకయినా మళ్లీ పూర్తి స్థాయి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాల్సి ఉంది. పూర్తి స్థాయి బడ్జెట్ కూడా ప్రవేశ పెట్టాల్సి ఉంది. ఎన్నికల కారణంగా జగన్ ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ ను మాత్రమే ప్రవేశ పెట్టింది. ప్రమాణ స్వీకార సమావేశాలకు, ఆ తర్వాత జరగాల్సిన సమవేశాలకు మాజీ సీఎం జగన్ హాజరవుతారా.. లేకపోతే గతంలోలా బహిష్కరణ అస్త్రం ప్రయోగిస్తారా అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది.
AP Politics :
ఎందుకంటే ఏపీ రాజకీయాలు ప్రతిపక్ష నేత సభకు రాలేనంత ఘోరంగా గత ఐదేళ్లలో దిగజారిపోయాయి. టీడీపీ నేతలు ప్రతీకారం కోసం ఎదురు చూస్తున్నారని చెప్పాల్సిన పని లేదు. అందుకే సభకు వెళ్లడం.. అపరిమితమైన బలంతో ఉన్న అధికార పక్షాన్ని ఎదుర్కోవడం అంత తేలిక కాదన్న్ భావన ఉంది. అసెంబ్లీలో వైఎస్ఆర్సీపీకి కేవలం పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో గట్టిగా నిలబడి అధికారపక్షంగా తన వాయిస్ గా గడగడలాడించేవారు ఎవరూ లేరు. జగన్ కన్నా రాజకీయాల్లో సీనియర్ అయని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మరోసారి గెలిచి అసెంబ్లీలో అడుగు పెడుతున్నారు. కానీ ఆయన తెరవెనుక రాజకీయ వ్యూహాల్లో దిట్ట కానీ అసెంబ్లీలో నిలబి సాధికారికంగా మాట్లాడి అధికారపక్షానికి కౌంటర్ ఇచ్చేంత టాకింగ్ పవర్ లేదు. ఉన్నదల్లా జగన్మోహన్ రెడ్డి మాత్రమే. ప్రతీ దానికి ఆయనే మైకందుకోవాల్సి ఉంటుంది. కానీ మైక్ ఎంత సేపు ఇస్తారన్నది కూడా పజిలే. ప్రధాన ప్రతిపక్ష హోదా గుర్తింపు వచ్చి ఉంటే.. అధికారపక్షంతో పాటుగా తమకూ ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేయవచ్చు. సభా సంప్రదాయాలు కాపాడాలని కోరవచ్చు. కానీ ఇక్కడ వైసీపీకి ప్రధాన ప్రతిపక్ష నేత హోదా రాలేదు. అంతకు మించి జగన్కు మందు వరుసలో సీటు లభిస్తుందో లేదో చెప్పలేని పరిస్థితి. స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటే అ నిర్ణయానికి శిరసావహించాల్సిందే. గత అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీకి 23 మంది సభ్యులు ఉన్నారు. ప్రధాన ప్రతిపక్షనేతగా చంద్రబాబుకు హోదా ఉంది. అయినా అసెంబ్లీలో ఆయనను ఘోరంగా అవమానించారు. ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఆయనను వ్యక్తిగతంగా కించ పరిచారు. ఆయన కుటుంబాన్ని ఘోరంగా తిట్టారు. ఈ తిట్లు తట్టుకోలేక ఆయన చాలెంజ్ చేసి బయటకు వెళ్లారు. కౌరవసభలా చేశారని.. గౌరవసభగా చేసి మళ్లీ ముఖ్యమంత్రిగా సభలోకి వస్తానని చాలెంజ్ చేసి వెళ్లారు.అలాగే అడుగు పెడుతున్నారు. గత సభలో ఇంత జరిగితే ఆ పరిస్థితులందటికి కారణమైన వైఎస్ఆర్సీపీ వారిని టీడీపీ సభ్యులు వదిలి పెట్టే అవకాశం ఉండదు. పైగా జగన్మోహన్ రెడ్డి ఓటమి భారంలో ఉన్నారు. 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో జగన్ ను టార్గెట్ చేయడానికి టీడీపీ ఖచ్చితంగా ప్రయత్నిస్తుంది. ప్రజాస్వామ్య పద్దతుల్లో అయినా జగన్ పై ఎటాక్ ఖాయం. ఏ ప్రభుత్వం మారినా గత ప్రభుత్వంలో తప్పులు, అవకతవకలు అంటూ అసెంబ్లీలో ప్రకటనలు చేస్తుంది. జగన్ ప్రభుత్వం లో అలాంటివి లెక్కలేనన్ని ఉన్నాయని టీడీపీ చెబుతోంది.
ఇప్పటికే కొన్ని శాంపిల్స్ రిలీజ్ చేసింది. జగన్ ప్రైవేటు నివాసానికి కోట్ల ప్రజాధనం వెచ్చి ఫర్నీచర్ తోపాటు ఇతర సౌకర్యాలు కల్పించుకోవడం, ఐదు వందల కోట్లు పెట్టి రుషికొండ ప్యాలెస్ ను నిర్మించుకోవడం… ప్రాజెక్టుల్ని నిర్లక్ష్యం చేయడం వంటివన్నీ బయటకు వస్తున్నాయి. అలాగే కొండంత అప్పులు చేశారని టీడీపీ నిందిస్తోంది. ఈ మొత్తం వ్యవహారాలపై వైట్ పేపర్లు రిలీజ్ చేయాలనుకుంటున్నారు. అంటే అది పూర్తిగా జగన్ పాలనా వైఫల్యాలను ప్రజల ముందు పెట్టడమే. దీనికి కౌంటర్ ఇచ్చుకోవడం.. పదకొండు మంది ఎమ్మెల్యేలతో జగన్కు కష్టమవుతుంది. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు జగన్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. మామూలుగా అయితే విస్తృత స్థాయి సమావేశం అవసరం లేదు. గెలిచిన ఎమ్మెల్యేలతో ఎల్పీ భేటీ నిర్వహించి నాయకుడ్ని ఎన్నుకుంటారు. ఇప్పటి వరకూ అలాంటి ఆలోచన చేయలేదు. నేరుగా విస్తృత స్థాయి సమావేశానికి పిలుపునిచ్చారు. అంటే ఖచ్చితంగా అసెంబ్లీ బహిష్కరణ నిర్ణయం తీసుకుంటారని అంటున్నారు.గతంలో కూడాజగన్ ఓ సారి అసెంబ్లీ బ బహిష్కరణ నిర్ణయం తీసుకున్నారు.
ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హతా వేటు వేయకపోవడానికి నిరసనగా అసెంబ్లీని బహిష్కరంచారు. తానే కాదు.. యాభై మంది వరకూ ఉన్న తన ఎమ్మెల్యేలను కూడా అసెంబ్లీకి పోనివ్వలేదు. అప్పుడు కూడా ఇలా విస్తృత స్థాయి సమావేశాన్ని లోటస్ పాండ్లో నిర్వహించి నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు నిర్వహించబోయే విస్తృత స్థాయి సమావేశంపై అందుకే రాజకీయవర్గాల్లో ఆసక్తి వ్యక్తమవుతోంది. ఒక వేళ అసెంబ్లీ బహిష్కరణకు జగన్ నిర్ణయం తీసుకుంటే… ఆయనపై పారిపోయారని ముద్ర పడుతుంది. దైర్యంగా ఎదుర్కుంటనే రాజకీయంగా గుర్తింపు ఉంటుందని చెబుతున్నారు. ఇదే విషయాన్ని జగన్ శ్రేయోభిలాషిగా పేరు తెచ్చుకున్న ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా చెప్పారు. పోరాడమని సలహా ఇచ్చారు. మరి జగన్ ఏం చేయబోతున్నారో ?