Why is YCP like this? | వైసీపీ అలా ఎందుకు… | Eeroju news

Why is YCP like this?

 వైసీపీ అలా ఎందుకు…

విజయవాడ, జూన్ 29, (న్యూస్ పల్స్)

Why is YCP like this?

లోక్‌సభ స్పీకర్ ఎన్నిక విషయంలో  వైఎస్ఆర్‌సీపీ ఎంపీలు తమ మద్దదు  బీజేపీకే అని ప్రకటించడం దేశవ్యాప్త రాజకీయాల్లో కలకలానికి కారణం అయింది. ఎందుకంటే  ఎన్డీఏ కూటమిలో టీడీపీ, జనసేన ఉన్నాయి. ఆ రెండు పార్టీలతో కలిసి వైసీపీని భారీ తేడాతో ఓడించాయి. అంతకు ముందు ఐదేళ్ల పాటు బీజేపీకి జగన్మోహన్ రెడ్డి బేషరతు మద్దతు ఇచ్చారు. ఎలాంటి బిల్లు అయినా పార్లమెంట్ లో డిమాండ్లు పెట్టకుండా అడిగినా అడగకపోయినా సపోర్టు  చేశారు. అందుకే తమకు వ్యతిరేకంగా బీజేపీ వెళ్లదని అనుకున్నారు. పొత్తులపై చర్చలు జరుగుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి స్వయంగా ప్రధాని మోదీని కలిసి తాము ఎప్పటిలాగా మద్దతుగా ఉంటామని టీడీపీ, జనసేనతో కలవొద్దని కోరినట్లుగా ప్రచారం కూడా జరిగింది. కానీ టీడీపీ, జనసేనతో బీజేపీ కలిసిపోయింది. ఇలాంటి సందర్భంలో వైసీపీ బీజేపీని వ్యతిరికించాల్సింది.

కానీ వైసీపీ అధినేత జగన్‌కు  మరో ఆప్షన్ లేదన్నట్లుగా బీజేపీకే మద్దతుగా ఉంటున్నారు. తాను బద్దశత్రువులుగా భావించే టీడీపీ,జనసేన ఉన్న కూటమి అభ్యర్థికే ఏ మాత్రం ఆలోచించకుండా మద్దతు తెలిపారంటే జగన్ ఉన్న అనివార్య పరిస్థితిని అర్థం  చేసుకోవచ్చని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి. కొత్త లోక్ సభ ఏర్పడింది. స్పీకర్ ఎన్నిక జరిగింది.  ప్రతిపక్షానికి డిప్యూటీ స్పీకర్ పోస్టు ఇచ్చేందుకు అంగీకరించకపోవడంతో బరిలో ఉండాలని కాంగ్రెస్ నిర్ణయించింది. అభ్యర్థిని కూడా ఖరారు చేశారు. కాంగ్రెస్ తరపున కేరళ ఎంపీ కే.సురేష్ నామినేషన్ వేశారు. అంతే అన్ని పార్టీలు విప్ జారీ చేయడం ప్రారంభించాయి.

ఎన్డీఏ కూటమిలో ఉన్న టీడీపీ, జనసేన విప్ జారీ చేసి.. ఓటింగ్ ఎలా చేయాలో శిక్షణ కూడా ఇచ్చాయి. అయితే నలుగురు ఎంపీలు ఉన్న వైసీపీకి ఇక్కడే సమస్య ఎదురయింది. తాము ఓటింగ్ కు దూరంగా ఉండాలా లేకపోతే బీజేపీ అభ్యర్థికి మద్దతివ్వాలా అని ఆలోచించారు. కానీ బీజేపీకి దూరమయ్యామని భావిస్తే… కాంగ్రెస్ కు దగ్గరవుతున్నామన్న అభిప్రాయం ఏర్పడుతుంది. అందుకే  బీజేపీకే మద్దతివ్వాలని నిర్ణయించుకున్నారు.   మీడియాకు సమాచారం ఇచ్చారు. తమను బీజేపీ నేతలు అడిగారని.. తాము మద్దతిచ్చేందుకు అంగీకరించామని చెప్పారు. ఇది రాజకీయాల్లో చర్చనీయాంశమయింది. బీజేపీకి కూటమికి మరో నలుగురు ఎంపీల మద్దతు పెరిగినట్లయిందని ఖరారు చేశారు. కేంద్రంలో ఏ పార్టీ అధికారంో ఉంటే ఆ పార్టీకి వైసీపీ మద్దతివ్వక తప్పని  పరిస్థితి. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఉన్న అనివార్య పరిస్థితి అది. ఆయనపై సీబీఐ, ఈడీ కేసులు ఉన్నాయి. వాటి విచారణ కోర్టుల్లో ఉంది.

పన్నెండేళ్లుగా ట్రయల్ కు రాని కేసులన్న విమర్శలు  వస్తున్నాయి. అదే సమయంలో వైఎస్ వివేకా హత్య కేసు కూడా ఉంది. అధికారంలో ఉండటం వల్ల అవినాష్ రెడ్డిని అరెస్టు కాకుండా అతి కష్టం మీద కాపాడగలిగారు. ఇప్పుడు బీజేపీకి వ్యతిరేంగా వెళ్తున్నామన్న సంకేతాలు వస్తే పరిస్థితులు ఒక్కసారిగా తిరగబడతాయి. బీజేపీ కనీస మెర్సీ  చూపించదన్న సంకేతాలు ఉన్నాయి. అందుకే జగన్మోహన్ రెడ్డి నైతికత.. అనైతికత అనేదాని గురించి ఆలోచించకుండా.. వెంటనే బీజేపీకి మద్దతు పలికేశారు.  లోక్‌సభ స్పీకర్ ఎన్నిక ఓటింగ్ వరకూ వెళ్లలేదు. మూజువాణి ఓటుతో ముగిసిపోయింది. బీజేపీకి  మద్దతుగా  పార్లమెంట్ లో ఓటు వేయాల్సిన అవకాశం రాలేదు.

అనవసరంగా ముందే బీజేపీకి మద్దతు ఇచ్చామని ప్రకటించడం ద్వారా తాము బీజేపీ వైపు ఉన్నామన్న సంకేతాలను బహిరంగంగా పంపినట్లయింది..   అంతేనా.. స్పీకర్ ఎన్నిక జరగగానే .. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా స్పీకర్ ను చెయిర్ వద్దకు తీసుకెళ్లారు. ఇది వైసీపీని మరింత ఇబ్బంది పెట్టింది. ఎందుకంటే అసెంబ్లీలో జగన్ స్పీకర్ ఎన్నిక ప్రక్రియలో పాలు పంచుకోలేదు. ఇది కూడా ప్రజల్లో చర్చనీయాంశం అయింది. ఓ వైపు టీడీపీ, జనసేనతో కలిసిన కూటమికి స్పీకర్ ఎన్నికలో మద్దతివ్వడం .. కనీసం బాయ్ కాట్ చేయలేని నిస్సహాయతతో ఉండటం ప్రజల్ని కూడా విస్మయానికి గురి చేసింది. రాజ్యసభలో ఇప్పటికీ వైసీపీకి పదకొండు మంది సభ్యులు ఉన్నారు. వారంతా ఇక చెప్పాల్సిన పని లేకుండా బీజేపీకే మద్దతుగా ఉంటారు. అంటే..  టీడీపీ, జనసేనతో కలిసిన బీజేపీకి వ్యతిరేకంగా వెళ్లేందుకు వైసీపీ సిద్దంగా లేదన్నమాట.

ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో టీడీపీకి కీలక పాత్ర, బీజేపీ తర్వాత అతి పెద్ద పార్టీ. టీడీపీని శత్రువులా చూసేది వైసీపీ. ఐదేళ్ల కాలంలో టీడీపీని వైసీపీ అధినేత జగన్ ఎంత టార్చర్ పెట్టారో చెప్పాల్సిన పని లేదు. అంతకు మించి చూపించాలని టీడీపీ హైకమాండ్ పై క్యాడర్ ఒత్తిడి ఉంటుంది. ఇలాంటి సమయంలో వైసీపీ పాలనలో జరిగిన అక్రమాల గురించి విచారణలు చేయక తప్పదు. ఒక్క డిజిటల్ కార్పొరేషన్ పేరుతోనే పద్దెనిమిది వందల కోట్ల రూపాయల స్కాం చేశారన్న ఆరోపణలు వస్తున్నాయి. వీటన్నింటిపై విచారణ చేస్తే.. జగన్ సహా అనేక మందికి అరెస్టు ముప్పు ఉంటుంది. సీబీఐ, ఈడీ కేసులకు ఇవి అదనం అవుతాయి. అయితే బీజేపీకి సపోర్టుగా ఉంటున్నందున బీజేపీ కాపాడుతుందని.. వైసీపీ నేతలు గట్టి నమ్కకంతో ఉన్నారని అందుకే సపోర్టు అడగకపోయినా ప్రకటిస్తున్నారని చెబుతున్నారు. భవిష్యత్ రాజకీయాలు ఎలా ఉంటాయో కానీ.. వైసీపీ అధినేత జగన్ మాత్రం.. ఢిల్లీలో ఎవరు అధికారంలో ఉంటే వారికి దాసోహం అంటారన్న భావన మాత్రం పెరుగుతోంది.

 

Why is YCP like this?

 

Shock for YCP in Punganur | పుంగనూరులో వైసీపీకి షాక్ | Eeroju news

Related posts

Leave a Comment