Who will listen to the sarpanch’s cry… | సర్పంచ్ ల మొర వినేదెవరు… | Eeroju news

Who will listen to the sarpanch's cry..

సర్పంచ్ ల మొర వినేదెవరు…

కరీంనగర్, జూన్ 25, (న్యూస్ పల్స్)

Who will listen to the sarpanch’s cry..

కరీంనగర్ జిల్లా గ్రామ పంచాయితీలో బిల్లులు పేరుకుపోయాయి. పెండింగ్ బిల్లుల కారణంగా.. మాజీ సర్పంచ్‎లు ఆందోళన చెందుతున్నారు. సరిగా బిల్లులు రాకపోవడంతో.. అభివృద్ధిపై ప్రభావం చూపుతుంది. ఇప్పటికే పలువురు మాజీ సర్పంచ్‎లు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. అంతేకాకుండా.. సర్పంచ్‎ల పదవీకాలం ముగిసి ఆరు నెలలు గడుస్తోంది. దీంతో పెండింగ్ బిల్లులు మంజూరుకాక చాలా ఇబ్బందులు పడుతున్నారు లోకల్ నాయకులు.

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గ్రామ పంచాయతీ బిల్లులు పెండింగ్‎లో ఉన్నాయి. స్థానికంగా నిధులు లేనప్పటికీ.. గతంలో సర్పంచ్‎లు పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. వాటికి సంబంధించిన నిధులు సక్రమంగా సమయానికి రావడం లేదు. దీంతో కనీసం సిబ్బందికి కూడా వేతనాలు చెల్లించే పరిస్థితి లేదు. ఒకవేళ నిధులు విడుదలైనప్పటికీ.. విద్యుత్ బిల్లుల కోసం వినియోగిస్తున్నారు. గతంలో అప్పుల బాధ భరించలేక.. సర్పంచ్‎లు ఆత్మహత్య చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. అంతేకాదు.. పదవి నుంచి తప్పుకున్న వారు కూడా ఉన్నారు. పదవీకాలం జనవరి 31తో ముగిసింది. కానీ ఇప్పటికీ వారు చేపట్టిన అభివృద్ది పనులకు సంబంధించిన పెండింగ్ బిల్లులు మంజూరుకాలేదు.

తాము అప్పులు తెచ్చి అభివృద్ధి చేశామని.. నిధులు మంజూరు చేయాలని కోరుతున్నారు.మేడిపల్లి మండలం గోవిందారం మాజీ సర్పంచ్ మధుకర్.. సుమారుగా రూ.18 లక్షల వరకు ఖర్చు పెట్టానని చెబుతున్నారు. వివిధ అభివృద్ధి పనుల కోసం వెచ్చించామని తమ గోడు వెల్లగక్కుతున్నారు. కానీ నిధులు మంజూరు చేయలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల చుట్టు తిరిగినా లాభం లేకుండాపోయిందని కొందరు చెబుతున్నారు.

ఎన్ని ప్రయత్నాలు చేసినా నిధులు మాత్రం మంజూరు చేయడం లేదు. అదే విధంగా.. హుజురాబాద్ మండలం రంగాపూర్ మాజీ సర్పంచ్ కరుణాకర్ రెడ్డి సుమారు రూ. 60 లక్షల విలువైన అభివృద్ది పనులు చేశామని చెబుతున్నారు. అక్కడ కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ముందుగా నిధులు ఇవ్వనప్పటికీ తమ సొంత డబ్బులతో చాలా గ్రామాల్లో నూతన గ్రామ పంచాయతీ భవనాలు నిర్మించారు. అయితే ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేయకపోవడంతో అప్పుల పాలవుతున్నామని ఆవేదన చెందుతున్నారు.

6 నెలల క్రితం ఏర్పాటైన కొత్త ప్రభుత్వం వెంటనే స్పందించి.. తాము పెట్టుబడి పెట్టిన నిధులు మంజూరు చేయాలని కోరుతున్నారు. గ్రామాల్లో ప్రస్తుతం స్పెషల్ ఆఫీసర్ పాలన కొనసాగుతుంది. అయినా నిధులు మంజూరు కావడం లేదని చెబుతున్నారు. పైగా వర్షాకాలం మొదలై జిల్లాలో సిజనల్ వ్యాధులు పెరిగే అవకాశం ఉందని.. కనీసం వాటికోసమైనా గ్రామ పంచాయతీలకు నిధులు మంజూరు చేయాలని వాపోతున్నారు.

Who will listen to the sarpanch's cry..

 

కరీంనగర్ లో బూడిద రాజకీయం | Gray politics in Karimnagar | Eeroju news

 

 

Related posts

Leave a Comment