When is Sunita Williams coming? | సునీతా విలియమ్స్ వచ్చేది ఎప్పుడు | Eeroju news

When is Sunita Williams coming?

సునీతా విలియమ్స్  వచ్చేది ఎప్పుడు

న్యూయార్క్, జూలై 23, (న్యూస్ పల్స్)

When is Sunita Williams coming?

సునీతా విలియమ్స్‌తోపాటు, బుచ్‌ విల్మోర్‌ను నాసా ఈ ఏడాది జూన్‌ 6వ తేదీన అంతరిక్షంలోకి పంపించింది. బోయింగ్‌ సంస్థ తయారు చేసిన స్టార్‌ లైనర్‌లో వీరు ఇంటర్నేషనల్‌ స్పేస్‌ సెంటర్‌కు వెళ్లారు. షెడ్యూల్‌ ప్రకారం వీరు కేవలం వారం రోజులు అంటే.. జూన్‌ 14 వరకే అక్కడ ఉండాలి. 15వ తేదీన తిరిగి భూమికిరావాలి. కానీ సునీతా విలియమ్స్, విల్మోర్‌ నెల రోజులకుపైగా అంతరిక్షంలోనే ఉన్నారు. వీరిని ఐఎస్‌ఎస్‌లోకి తీసుకెళ్లిన స్పేస్‌ రాకెట్‌లో తలెత్తిన సాంకేతిక సమస్యలతో వారు అక్కడే ఉండిపోయారు. అయితే స్టార్‌లైర్‌కు నాసా మరమ్మతులు చేపట్టింది. కానీ అవి సత్ఫలితాలు ఇవ్వడం లేదు.

నాలుగు నెలల తర్వాత భూమికి సునీతా విలియమ్స్ | Sunita Williams, fellow astronauts back on Earth | 4 నెలల తర్వాత భూమికి సునీతా - Telugu Oneindia

నాసా సైంటిస్టుల సూచన మేరకు ఐఎస్‌ఎస్‌లో ఉన్న సైంటిస్టులు కూడా స్టార్‌లైనర్‌కు మరమ్మతులు చేస్తున్నారు. కానీ, ఇప్పటివరకు స్టార్‌లైన్‌ తిరిగి భూమికి చేరే తేదీపై నాసా స్పష్టత ఇవ్వడం లేదు. ఇదిలా ఉండగా తాంము బోయిగ్‌ స్పేస్‌ క్యాప్సూల్‌ స్టార్‌లైనర్‌లో అంతరిక్షంలోకి వెళ్లామని, తిరిగి అదే క్యాప్సూల్‌లో భూమికి వస్తామని తెలిపారు. ఈమేరకు వారు అంతరిక్షం నుంచే తొలిసారిగా మీడియాతో మాట్లాడారు. థ్రస్టర్‌ పరీక్ష పూర్తయ్యాక తమ తిరుగు ప్రయాణం ఉంటుందని తెలిపారు. ఇదే సమయంలో గడువు దాటినా వ్యోమగాములు మాత్రం నాసాపై ఎలాంటి ఫిర్యదు చేయలేదు.

ఐఎస్‌ఎస్‌ సిబ్బందికి సహాయం చేస్తూ ఎంజాయ్‌ చేస్తున్నామని తెలిపారు. స్టార్‌లైనర్‌ స్పేస్‌క్రాఫ్ట్‌ తమను ఇంటికి తీసుకొస్తుందని నమ్మకంతో ఉన్నారు.ఇదిలా ఉంటే.. సునితా విలియమ్స్, బుచ్‌ విల్మోర్‌ అంతరిక్షంలోకి వెళ్లి నెల దాటింది. అయినా స్టార్‌లైనర్‌తో తలెత్తిన సమస్యలపైగానీ, ఆస్ట్రోనాట్స్‌ తిరిగి భూమికి వచ్చే తేదీపైగానీ నాసా ఎలాంటి ప్రకటన చేయడం లేదు. మరమ్మతులు చేస్తున్నామని మాత్రమే చెబుతోంది. దీంతో వారు ఎప్పుడు భూమికి చేరుకుంటారన్న ప్రశ్నకు ఎవరూ సమాధానం చెప్పలేకపోతున్నారు. ఇద్దరూ సేఫ్‌ల్యాండ్‌ కావాలంటే.. స్టార్‌లైనర్‌ మరమ్మతులు పూర్తికావాలి. అవి ఎప్పటికి పూర్తవుతాయన్నది కూడా తెలియడం లేదుప్రపంచంలో అతిపెద్ద విమానాల తయారీ సంస్థ బోయింగ్‌ ప్రపంచ కుబేరుడు తయారు చేయించిన అంతరిక్ష నౌక స్సేస్‌ ఎక్స్‌కు దీటుగా స్టార్‌లైనర్‌ను తయారు చేసింది.

Sunita Williams Space Mission: సునీతా విలియమ్స్ మూడో అంతరిక్ష యాత్ర వాయిదా, కారణం ఏమిటంటే? - NTV Telugu

అనేక పరీక్షల తర్వాత నాసా దీనిలో సునీతా విలియమ్స్, బుచ్‌విల్మోర్‌ను అంతరిక్షంలోకి పంపాలని నిర్ణయించింది. ఈమేరు ఇద్దరు ఆస్ట్రోనాట్‌లను సిద్ధం చేసిన తర్వాత రాకెట్‌లో సాంకేతిక సమస్యలతో పర్యటన వాయిదా వేశారు. తర్వాత మళ్లీ కౌంట్‌డౌన్‌ ప్రారంభించాక స్టార్‌లైనర్‌లో హీలియం లీక్‌ అవుతున్నట్లు గుర్తించారు. దీంతో మళ్లీ పర్యటన వాయిదా వేశారు. మూడో ప్రయత్నంలో జూన్‌ 5న స్టార్‌లైన్‌ నాసా నుంచి అంతరిక్ష కేంద్రంలోకి దూసుకెళ్లింది. అయితే స్టార్‌లైనర్‌ ఐఎస్‌ఎస్‌కు చేరుకోకముందే… మళ్లీ హీలియం లీకేజీని గుర్తించారు. అయినా ప్రమాదం లేదని నాసా ప్రకటించింది. ఇద్దరు వ్యోమగాములు ఐఎస్‌ఎస్‌కు చేరుకోవడంలో ఊపిరి పీల్చుకున్నారు.సంస్థకు లక్షల కోట్ల వ్యాపారం చేస్తోంది.

Glitch delays Sunita Williams' third space mission

విమానాలను ప్రపంచ వ్యాప్తంగా విక్రయిస్తోంది. తొలిసారి స్పేస్‌ రాకెట్‌ తయారు చేసింది. అయితే అది విఫలమైంది. అయితే.. ప్రతిష్టాత్మక సంస్థ బోయింగ్‌ వైఫల్యాలను కప్పి పుచ్చేందుకు అగ్రరాజ్యం అమెరికా ప్రయత్నాలు చేస్తుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే బోయింగ్‌ తయారు చేసిన విమానాలు కూలిపోతున్నాయి. మరోవైపు స్టార్‌లైనర్‌ వైఫల్యాన్ని అధికారికంగా ప్రకటిస్తే.. సంస్థకు తీవ్ర నష్టం జరుగుతుంది. ఈ నేపథ్యంలో అమెరికా.. స్టార్‌లైనర్‌ సమస్యను బయటపెట్టడం లేదని తెలుస్తోంది. ఇక సునీతా విలియమ్స్, బుచ్‌ విల్మోర్‌ కిందకు రావడానికి ఐఎస్‌ఎస్‌లో ఎలాన్‌ మస్క్‌కు చెందిన స్పేస్‌ ఎక్స్‌ అక్కడ సిద్ధంగా ఉంది.

Good feeling in heart': NASA's Sunita Williams shows confidence in Boeing Starliner, says it will bring her home safely

అయినా నాసా స్టార్‌లైనర్‌ మరమ్మతుల పేరుతో కాలయాపన చేస్తోంది. స్పేస్‌ ఎక్స్‌లో వ్యోమగాములను తీసుకువస్తే.. స్టార్‌లైనర్‌ విఫలం అయినట్లు అంగీకరించాల్సి ఉంటుంది. దీంతో లక్షల కోట్లు వృథా అవడమే కాకుండా బోయింగ్‌ ప్రతిష్ట దెబ్బతింటుంది. ఈ నేపత్యంలోనే బోయింగ్‌ సంస్థ ఆ విషయాన్ని పక్కదోవ పట్టించేందుకు ఉట్ర చేస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ట్రంప్‌పై దాడి.. మైక్రోసాఫ్ట్‌ సమస్యలను తెరపైకి తెచ్చినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా సునీతా విలియమ్స్, బుచ్‌ విల్మోర్‌ ఎప్పుడు భూమికి చేరుతారనే విసయంలో మాత్రం క్లారిటీ లేదు.

 

When is Sunita Williams coming?

 

Sakambari Devi Utsavam begins in Indrakiladri | ఇంద్రకీలాద్రి లో శాకంబరీ దేవి ఉత్సవాలు ప్రారంభం | Eeroju news

Related posts

Leave a Comment