Washington: అక్రమ వలసదారులను ఎలా గుర్తిస్తారంటే:అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అక్రమ వలసదారులను ఆ దేశం నుంచి పంపిస్తున్నారు. ఇందుకోసం దేశమంతా స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఇప్పటికే వందల మందిని తరలించారు. ఇటీవలే 312 మందితో భారత్‌కు కూడా ఓ విమానం వచ్చింది. ఇందులో గుజరాత్, హరియాణా, పంజాబ్‌లకు చెందిన అక్రమ వలసదారులు ఉన్నారు.
అక్రమ వలసదారులను ఎలా గుర్తిస్తారంటే
వాషింగ్టన్, ఫిబ్రవరి 18
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అక్రమ వలసదారులను ఆ దేశం నుంచి పంపిస్తున్నారు. ఇందుకోసం దేశమంతా స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఇప్పటికే వందల మందిని తరలించారు. ఇటీవలే 312 మందితో భారత్‌కు కూడా ఓ విమానం వచ్చింది. ఇందులో గుజరాత్, హరియాణా, పంజాబ్‌లకు చెందిన అక్రమ వలసదారులు ఉన్నారు. వారంతా స్వదేశానికి వచ్చారు. అమెరికా ఎవరిని బహిష్కరిస్తుంది.. మళ్లీ వారు అక్కడకు వెళ్లొచ్చా అన్న సందేహాలు కూడా కలుగుతున్నాయి.అమెరికా నుంచి ఎవరిని బహిష్కరిస్తున్నారనే వివరాలను మైగ్రేషన్ పాలసీ రిపోర్టు కొన్ని వివరాలు వెల్లడించింది. అనధికారికంగా ఉంటున్నవారినే బహిష్కరిస్తారని చాలా మంది భావిస్తున్నారు. అయితే దేశంలో చట్టబద్ధంగా నివసిస్తూ సిటిజన్‌షిప్ పొందని వలసదారులు కూడా కొన్ని పరిస్థితుల్లో బహిష్కరణకు గురికావొచ్చు. అనధికారిక వలసదారులు, అక్రమంగా అమెరికాలోకి ప్రవేశించినవారు, వీసా గడువు ముగిసినా దేశంలో ఉంటున్నవారిని వారి దేశాలకు పంపించవచ్చు. తాత్కాలిక వీసాపై అమెరికాకు వెళ్లి అక్కడే నిబంధనలకు విరుద్ధంగా ఉంటున్నవారిని కూడా బహిష్కరిస్తుంది. అక్రమ వలసదారులే కాకుండా అమెరికాలోని గ్రీన్‌కార్డు హోల్డర్లు, తాత్కాలిక వీసా హోల్డర్లు కూడా బహిష్కరణకు గురికావొచ్చు. అయితే ఈ కోవలోకి వచ్చే వక్తులు నేరాలకు పాల్పడినట్లు నిరూపణ కావాలి. ఈ నేరాలలో తాగి వాహనం నడపడం, అనుమతి లేకుండా ఆయుధాలతో దొరికిపోవడం, డ్రగ్స్ తీసుకోవడం, తిరగడం, హింసాత్మక నేరాలకు పాల్పడడం వంటివి ఉన్నాయిఅనైతిక చర్యలతో కూడిన నేరానికి పాల్పడిన వ్యక్తిని బహిష్కరించడానికి రెండు మార్గాలు ఉన్నాయి. మొదటిది అమెరికాలో నివసించిన మొదటి ఐదేళ్లలో అనైతికంగా భావించే నేరానికి పాల్పడడం, రెండోది వేర్వేరు కేసుల్లో రెండు లేదా అంతకన్నా ఎక్కువ అనైతిక నేరాలకు పాల్పడడం, రెండోదానికి కాలపరిమితి లేదు. అయితే అనైతిక చర్యలతో కూడిన నేరం అంటే ఏమిటో స్పష్టమైన నిర్వచనం లేదు. ఈ విషయంపై అమెరికా కోర్టులు ఎప్పటికప్పుడు తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నాయి. వీటిలో మోసం, వ్యక్తులు లేదా ఆస్తికి హాని కలిగించే ఉద్దేశం, మరణ లేదా దోపిడీకి కారణమయ్చే వారు, భార్యాభర్తల మధ్య హింస మొదలైనవి.అమెరికా ఇమిగ్రేషన్, కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ఐసీఈ)కు చెందిన ఎన్‌ఫోర్స్‌మెంట్ అండ్ రిమూవల్ ఆపరేషన్స్ (ఈఆర్వో) అధికారులు ఆ దేశంలో వలస చట్టాలను అమలు చేసే పనిలో ఉంటారు. ఈ అధికారులు నేషనల్ సెక్యూరిటీ వ్యవహారాలు చూస్తుంటారు. ఇమిగ్రేషన్ అమలు ప్రక్రియ అన్ని దశలను ఈఆర్వో నిర్వహిస్తుంది. ఇమిగ్రేషన్ అమలు ప్రక్రియ అన్ని దశలను ఈఆర్వో నిర్వహిస్తుంది. బహిష్కరణకు అర్హత ఉన్నవారి గుర్తింపు, అరెస్టు, నిర్భంధం, వారి దేశాలకు పంపిచే ప్రక్రియ తదితరాలు ఉంటాయి.ఇక బహిష్కరణకు అర్హులైన వ్యక్తులను గుర్తించడానికి లక్ష్య(టార్గెటెడ్), గూఢచార కార్యకలాపాలను ఈఆర్వో నిర్వహిస్తుంది. క్రిమినల్ అరెస్ట్ వారెంట్‌లను అమలుఏయడం, బహిష్కరణకు అర్హత ఉన్న వ్యక్తుల అరెస్టులతోపాటు ఇమ్మిగ్రేషన్ సంబంధిత క్రిమినల్ చర్యల కోసం ప్రాజిక్యూషన్ ప్రారంభించే అధికారం ఈఆర్వోకు ఉంది. ఈఆర్వో విభాగం అదుపులోకి తీసుకున్న వ్యక్తులను ప్రధానంగాఎండు వర్గాలుగా విభజిస్తారు. ఒకటి అమెరికా పౌరసత్వం ఉన్నవారు, రెండోది అమెరికాలో వారి నేర చరిత్ర ఆధారంగా నిర్ణయిస్తారు..
అమెరికాలో అమ్మకానికి ఇళ్లు
90 రోజుల్లో 1200 ఇళ్లు
అగ్రరాజ్యం అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికయ్యారు. జనవరి 20న ఆయన బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు చేపట్టిన మొదటి రోజు నుంచే ఆయన ఎన్నికల హామీలు నెరవేర్చడంపై దృష్టిపెట్టారు. ఈ క్రమంలోనే మేక్ అమెరికా గ్రేట్ ఎగై న్ నినాదంతో ముందుకు వెళ్తున్నారు. ట్రంప్ నిర్ణయాలతో ప్రపంచ దేశాలు ఇబ్బంది పడుతున్నాయి. ప్రధానంగా అక్రమ వలసదారులను ఖైదీల్లా స్వదేశాలకు పంపుతున్నారు. జన్మతః సిటిజన్‌షిప్ రద్దు చేశారు. మరోవైపు కెనడా, మెక్సికో, చైనా దిగుమతులపై 25 శాతం సుంకాలు విధించారు. స్టీల్, అల్యూమినియం దిగుమతిపైనా భారీగా పన్ను విధించారు. ట్రంప్ నిర్ణయాలతో ప్రపంచదేశాలతోపాటు అమెరికాలో ఉంటున్న విదేశీయులు ఇబ్బంది పడుతున్నారు. ఆ దేశ ప్రజలు కూడా భయపడుతున్నారు. దీంతో వాషింగ్‌టన్ డీసీలో రియల్ ఎస్టేట్ మార్కెట్ పతనం అవుతోంది. దీంతో వేల ఇళ్లను అమ్మకానికి ఉంచారు.అమెరికా రాజధాని వాషింగ్‌టన్ డీసీలో 14 రోజుల్లో 4,271 కన్నా ఎక్కువ ఇళ్లను అమ్మకానికి ఉంచారు. ఈవిషయాన్ని ఒక ఎక్స్ యూజర్ సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఎలుకలు పారిపోతున్నాయి. అని కాప్షన్ ఇచ్చాడు. నగరవాసులు తమ వసుత్వులు సర్దుకుని సామూహికంగా నగరం విడిచి వెళ్లిపోతున్నారని తెలిపారు. ఈ వలసలకు కారణం ఎలాన్ మస్క్ నేతృత్వంలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియన్సీ అని స్థానికులు చెబుతున్నారు. నగరంలో, చుట్టుపక్కలక అమ్మకానికి ఉన్న 14,825 ఇళ్లను చూపించే ఫొటోలు కూడా సోషల్ మీడియాలో షేర్‌చేశారు. నగరంలో 500లకుపైగా ఇళ్లు, రూ.8 కోట్లకన్నా ఎక్కువ ధరకు అమ్మకానికి ఉన్నాయి వెల్లడించారు. అమెరికన్లను సురక్షితంగా ఉంచే విధానాలపై పనిచేసే థింక్ ట్యాంక్ అయిన సెంటర్ ఫర్ సెక్యూరిటీ పాలసీలో పనిచేస్తున్న సీనియర్ విశ్లేషకుడు తెలిపారు.ఆన్‌లైన్ రియల్ ఎస్టేట్ మార్కెట్ ప్లేస్ అయిన జిల్లోలో అమ్మకానికి ఉన్న ఇళ్ల జాబితాను మరో ఎక్క్ యూజర్ షేర్ చేశాడు. ఏడు రోజుల్లో 201, 14 రోజుల్ల 378, 30 రోజుల్లో 706, 90 రోజుల్లో 1,198 కొత్త ఇళ్లు అమ్మకానికి వచ్చినట్లు వివరించాడు. దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలను కూడా ఎక్స్‌లో పోస్టు చేశాడు. అక్రమ వలసదారులను తరలిస్తుండడంతో వారంతా అప్పటికే కొనుగోలు చేసిన ఇళ్లను అమ్మకానికి పెట్టి వెళ్లిపోతున్నారు. దీంతో ఇళ్ల అమ్మకాలు పెరుగుతున్నాయి.
Read more:New Delhi:ఆసియాను శాసిస్తున్న ఇండియన్ బిలీయనీర్స్