డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత, “అమెరికా ఫస్ట్” విధానాన్ని మరోమారు గట్టిగా వినిపించారు. ఇది, భారత్ సహా చాలా దేశాలకు ఇబ్బంది కలిగించే విధానం. ముఖ్యంగా, వాణిజ్య రంగంలో, చైనా-అమెరికా తరహాలోనే ఇండియా-అమెరికా మధ్య కూడా సుంకాల యుద్ధం ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
ఎడా పెడా సుంకాలు..
వాషింగ్టన్, జనవరి 23
డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత, “అమెరికా ఫస్ట్” విధానాన్ని మరోమారు గట్టిగా వినిపించారు. ఇది, భారత్ సహా చాలా దేశాలకు ఇబ్బంది కలిగించే విధానం. ముఖ్యంగా, వాణిజ్య రంగంలో, చైనా-అమెరికా తరహాలోనే ఇండియా-అమెరికా మధ్య కూడా సుంకాల యుద్ధం ప్రారంభమయ్యే అవకాశం ఉంది. డొనాల్డ్ ట్రంప్ భారత ఉత్పత్తులపై సుంకాలు పెంచాలని నిర్ణయిస్తే, భారత్ కూడా అలాంటి చర్యలే తీసుకోవాలని ట్రేడ్ ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు.2018లో, భారతదేశ ఉక్కు & అల్యూమినియంపై అమెరికా అధిక పన్నులు విధించినప్పుడు, భారత్ కూడా ఆపిల్ సహా 29 అమెరికన్ ఉత్పత్తులపై సుంకాన్ని పెంచి ప్రతీకారం తీర్చుకుంది. సుంకాల విషయంలో ఇండియాపై గుర్రుగా ఉన్నారు కొత్త అధ్యక్షుడు ట్రంప్. అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటున్న చాలా వస్తువులపై భారత్ పెద్ద మొత్తంలో సుంకాలు విధిస్తున్నట్లు గతంలోనే అక్కసు వెళ్లగక్కారు. దీనికి తగిన ప్రతిస్పందన ఉంటుందని కూడా హెచ్చరించారు. అంటే, ప్రతీకార సుంకం విధించాలనే తన ఉద్దేశాన్ని స్పష్టంగా చెప్పారు.అమెరికా కొత్త ప్రభుత్వం ‘అమెరికా ఫస్ట్’ ఎజెండాను అనుసరిస్తే.. ఇండియా నుంచి ఎగుమతి చేసే వాహనాలు, వస్త్రాలు, ఫార్మాస్యూటికల్ ఉత్పత్తులపై అధిక కస్టమ్స్ సుంకాలను ఎదుర్కోవలసి ఉంటుందని ఆర్థిక పరిశోధన సంస్థ ‘గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్’ ఫౌండర్ అజయ్ శ్రీ వాత్సవ చెబుతున్నారు. H-1B వీసా నిబంధనలను కఠినంగా మార్చడం ద్వారా కూడా భారతీయ ఐటీ కంపెనీల వృద్ధిని ప్రభావితం చేయవచ్చు. కాబట్టి, ‘భారతదేశం గట్టిగా, అమెరికాతో సమానంగా’ స్పందించాలన్నది శ్రీ వాత్సవ సూచన.కొన్ని ఉత్పత్తులపై అధిక కస్టమ్స్ డ్యూటీలు విధించడం ద్వారా అమెరికా సహా అనేక దేశాలు తమ దేశీయ పరిశ్రమలను కాపాడుకుంటున్నాయి. భారత్ కూడా అదే దారిలో వెళ్లవచ్చు. దిగుమతి సుంకాల వ్యవస్థను ‘దుర్వినియోగం’ చేస్తున్నారనే ట్రంప్ ఆరోపణ గురివింద సామెత లాంటిదని వాణిజ్య నిపుణులు చెబుతున్నారు. ‘మేక్ అమెరికా గ్రేట్ అగైన్’నినాదం ఇచ్చిన ట్రంప్, దానిని నెరవేర్చేందుకు వివిధ రంగాల్లో దిగుమతి సుంకాలను పెంచుతారని గ్లోబల్ ట్రేడ్ ఎక్స్పర్ట్ బిశ్వజిత్ ధర్ అంచనా వేస్తున్నారు. ట్రంప్ ఇప్పటికే భారత్తో వాణిజ్య యుద్ధానికి కాలు దువ్వుతున్నారు. అయితే, భారతదేశం ఎప్పుడూ సంప్రదింపులకు ప్రాధాన్యత ఇస్తుంది & ఎప్పుడూ ఏకపక్షంగా వ్యవహరించలేదు. కానీ, అమెరికా తీరు సరిగ్గా లేకుంటే మాత్రం తదనుగుణంగా చర్యలు తీసుకోవడంలో వెనకాడకూడదు అన్నది బిశ్వజిత్ ధర్ అభిప్రాయం.ప్రస్తుతం, భారత్ ‘గ్లోబల్ మాన్యుఫాక్చరింగ్ హబ్’గా రూపుదిద్దుకుంటోంది. అనేక అమెరికన్ కంపెనీలు ఇండియాలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనబరుస్తున్నాయి. అలాంటి కంపెనీలకు కూడా ట్రంప్ భయం పట్టుకుంది. టారిఫ్ల విధింపు తమపై కూడా ప్రభావం చూపుతుంది కాబట్టి, సుంకాల పెంపుపై ట్రంప్ బెదిరింపులు అమల్లోకి రాకపోవచ్చని ఆయా సంస్థలు భావిస్తున్నాయి. ట్రంప్ గత పదవీకాలం తరహాలోనే భారత్-అమెరికా మధ్య ఆర్థిక & వాణిజ్య సంబంధాలు ఈసారి కూడా బలపడతాయని అంచనా వేస్తున్నాయి.
Read:Hyderabad:హైదరాబాద్ లో హెచ్సీఎల్ కొత్త టెక్ సెంటర్