తెలంగాణ ప్రజలకు ఇదొక సువర్ణవకాశం. ఎన్నేళ్ల నుండో మీ ఎదురుచూపులకు ఫుల్ స్టాప్ పడనుంది. ఆ ఒక్కటి లేక మీరు పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. అందుకే తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. మీరు అర్హులైతే ఈ విషయం తెలుసుకోండి. మిస్ మాత్రం కావద్దు. ఎందుకంటే మళ్లీ ఎప్పుడో ఈ అవకాశం రావచ్చు. సీఎం రేవంత్ రెడ్డి అధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అధికారులు సిద్దమవుతున్నారు.
26 నుంచి కొత్త రేషన్ కార్డులు
వరంగల్, జనవరి 6
తెలంగాణ ప్రజలకు ఇదొక సువర్ణవకాశం. ఎన్నేళ్ల నుండో మీ ఎదురుచూపులకు ఫుల్ స్టాప్ పడనుంది. ఆ ఒక్కటి లేక మీరు పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. అందుకే తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. మీరు అర్హులైతే ఈ విషయం తెలుసుకోండి. మిస్ మాత్రం కావద్దు. ఎందుకంటే మళ్లీ ఎప్పుడో ఈ అవకాశం రావచ్చు. సీఎం రేవంత్ రెడ్డి అధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అధికారులు సిద్దమవుతున్నారు. ఏ పథకం వర్తించాలన్న ఈ ఒక్కటి ప్రామాణికం కాబట్టి, అర్హత ఉంటే చాలు దరఖాస్తు చేసుకోండి.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే ఏ పథకం వర్తించాలన్న, రేషన్ కార్డు తప్పనిసరని మనందరికీ తెలుసు. రేషన్ కార్డు ఉంటే నెలవారీ రేషన్ ఒక్కటే కాదు, పింఛన్ ఇలా ఒకటి కాదు ఎన్నో పథకాలతో లబ్ది పొందవచ్చు. అర్హత ఉండి కూడ రేషన్ కార్డు లేని వారు ఎందరో ఉన్నారు. వారి సమస్యలను గుర్తించిన సీఎం రేవంత్ సర్కార్, కీలక నిర్ణయం తీసుకుంది. అయితే మొన్నటి వరకు నూతన రేషన్ కార్డులు అందజేస్తారా లేదా అన్నది ప్రజలకు ఉన్న అనుమానం. కానీ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఇచ్చిన మాటకు కట్టుబడి గుడ్ న్యూస్ చెప్పేశారు.సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ నెల 26 నుండి కొత్త రేషన్ కార్డులు ఇచ్చేందుకు ప్రక్రియ మొదలవుతుందన్నారు. అర్హత ఉన్న ఏ ఒక్కరికీ అన్యాయం జరగదని సీఎం అన్నారు. సీఎం మాటతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఇప్పటికే ఆయా జిల్లాల కలెక్టర్ లు సంబంధిత అధికారుల ద్వార ఎన్ని కుటుంబాలకు నూతన రేషన్ కార్డులు అవసరమో ఆరా తీశారు. అయితే ఈ నెల 15 నుండి రేషన్ కార్డుల మంజూరుకు దరఖాస్తులు స్వీకరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గ్రామసభలు నిర్వహించి దరఖాస్తులను స్వీకరిస్తారని సమాచారం.ఏ పథకం వర్తించాలన్న రేషన్ కార్డు ప్రామాణికం కాబట్టి, అర్హులు ఎప్పటికప్పుడు రెవిన్యూ అధికారుల ద్వార సమాచారం తెలుసుకొని దరఖాస్తులు సమర్పించాల్సి ఉంది. ఎందుకంటే మళ్లీ మళ్లీ అవకాశం రాదు కాబట్టి, ప్రభుత్వం కల్పించిన బృహత్తర అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కాంగ్రెస్ కోరుతోంది. మరి మీరు అర్హులైతే దరఖాస్తు చేసేందుకు సిద్దం కండి!
Read:Hyderabad:గెలిచినా గుర్తింపు ఏదీ