“శివ శివ” ఏమిటి పరధ్యానం..!?
తనిఖీలు సరే చర్యలేవి..!.
సమయపాలన పాటించని వైద్యులు..
నాణ్యమైన వైద్యం ఎండమావెనా..?
వరంగల్
శివుడి ఆజ్ఞ లేనిది చీమైనా కుట్టదు అన్న సామెత నిజమో అబద్దమో తెలియదు గాని వరంగల్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి పర్యవేక్షణ లేకపోవడంతో వరంగల్ జిల్లాలో నకిలీ వైద్యుల బాగోతాలు మూడు పువ్వులు ఆరు కాయలు వలె నడుస్తుంది అన్న విమర్శలు జిల్లాలో జోరుగా వినిపిస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా గ్రామీణ ప్రాంతాలలోని మారుమూల గ్రామాలకు చెందిన ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని లక్ష్యంతో చేస్తున్న ప్రణాళికలు క్షేత్రస్థాయిలో ఫలించటం లేదన్న అపోహ ప్రజల్లో నెలకొంది దానికి ప్రధానంగా జిల్లాలో వైద్య ఆరోగ్యశాఖ అధికారిగా పనిచేస్తున్న అధికారి అండదండలతో ఈ తంతు సాగుతుందన్న ఆరోపణలు జోరుగా వినిపిస్తున్నాయి వరంగల్ జిల్లాలో 14 మండలాలు ఉండగా ఆయా మండలాలలో నెలకొన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్య అధికారులు సమయపాలన పాటించకపోవడం పై గ్రామాలలో మండలాలలో ప్రజలు పెదవిరుస్తున్నారు ఇటీవల జిల్లా ఆరోగ్యశాఖ అధికారి జిల్లాలోని కొన్ని మండలాలలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను తనిఖీ చేసి సమయపాలన పాటించాలని ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని అందించాలని చేసిన సూచనలు ఎక్కడ అమలు కావటం లేదన్న అపవాదు ప్రజల్లో వినిపిస్తోంది కఠినమైన రీతిలో చర్యలు లేకపోవడంతో వైద్యాధికారి సూచనలను అధికారులతో పాటు ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న సిబ్బంది నిబంధనలను పాటించకపోవడంపై మండలాలలో తీవ్రమైన నిరసన వ్యక్తం అవుతుంది గతంతో పోలిస్తే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను తెలంగాణ ప్రభుత్వం ఎంతో పటిష్టవంతంగా బలవపేతం చేస్తున్న వైద్య సేవలు మాత్రం మునుపటి కంటే మెరుగన్న రీతిలో ఉండటం లేదన్న విమర్శలు జిల్లా వ్యాప్తంగా వినిపిస్తున్నాయి తనిఖీలు సర్వసాధారణంగా జరుగుతుంటాయి అన్న అభిప్రాయం కిందిస్థాయి సిబ్బందిలో ఉండటంతో వాటిని పాటించేవారు ఎక్కడా కనిపించడం లేదన్న అభిప్రాయం ప్రజల వ్యక్తం అవుతుంది వీటికి తోడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో ఉండే ఆరోగ్య ఉప కేంద్రాల పరిస్థితి పెనం మీద నుండి పొయ్యిలో పడ్డ సందంగా తయారైందని ఆయా గ్రామాల ప్రజలు బహిరంగంగా చర్చించుకుంటున్నారు యధా రాజా తథా ప్రజా అన్న రీతిలో వరంగల్ జిల్లాలోని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఉన్నారని ప్రజలు చర్చించుకుంటున్నారు
తనిఖీలు సరే చర్యలేవి ?
వరంగల్ జిల్లాలో నకిలీ వైద్యులు విచ్చలవిడిగా ఆస్పత్రులను నిర్వహిస్తుండడంతో ప్రజలు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు వైద్యం నారాయను హరి అన్నారు పెద్దలు కానీ వైద్యులు ఆసుపత్రికి వచ్చిన ప్రజలను ముక్కు పిండి వివిధ పరీక్షల పేరుతో జేబులు ఖాళీ చేస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి జిల్లాలో ఎవరు నిజమైన వైద్యులు కాదో తెలవక మోసపోయే పరిస్థితి జిల్లాలో నెలకొందని ప్రజలు అనుకుంటున్నారు వరంగల్ జిల్లాలో నకిలీ ఎంబిబిఎస్ లా జోరు కొనసాగుడుతుండడంతో నాణ్యమైన వైద్యం అందక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అన్న చర్చ కొనసాగుతోంది ఈ క్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ను తనిఖీ చేసి వస్తున్నారే కానీ నాణ్యమైన వైద్య సేవలో నిర్వాహలలో జరుగుతున్న లోపాలపై దృష్టి సారించడం లేదని ప్రజలు చర్చించుకుంటున్నారు అదేవిధంగా జిల్లాలో నకిలీ ఎంబిబిఎస్ లో జోరుకు నిబంధనలు పాటించని ఆసుపత్రులపై చర్యలకు వైద్యాధికారి ముందుకు రాకపోవడంతో వారు తీరుపై ప్రజలు పెదవి విరుస్తున్నారు. అలాంటప్పుడు వరంగల్ జిల్లాలోని ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు ఎక్కడ అందుతాయని ప్రజలు నిలదీస్తున్నారు వరంగల్ జిల్లాలోని నర్సంపేట నల్లబెల్లి జిల్లాలోని ఇతర మండలాలలో నకిలీ వైద్యాధికారుల జోరు కొనసాగుతుండడంపై జిల్లా వైద్య ఆరోగ్యశాఖ సరిగా స్పందించకపోవడం అధికారుల తీరు పట్ల ప్రజలు మండిపడుతున్నారు.
Read:Ongole:ఏపీలో భూముల రీ సర్వే