Warangal:వరంగల్ రోడ్లపై ఎలక్ట్రిక్ బస్సులు

Electric buses on Warangal roads

వరంగల్ రోడ్లపై ఎలక్ట్రిక్ బస్సులు పరుగులు పెట్టనున్నాయి. కాలుష్యంతో పాటు ఖర్చును తగ్గించేందుకు టీజీఎస్ ఆర్టీసీ ఈ ఎలక్ట్రిక్ బస్సులను తీసుకొస్తుంది. వరంగల్ రీజియన్‌కు మొత్తంగా 112 బస్సులను కేటాయించారు. అందులో ముందస్తుగా 75 వెహికిల్స్ వరంగల్‌కు చేరుకున్నాయి. వాటిని ప్రారంభించనున్నారు.వాస్తవానికి ఆదివారం ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, అటవీశాఖ మంత్రి కొండా సురేఖ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క చేతుల మీదుగా ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేశారు.

వరంగల్ రోడ్లపై ఎలక్ట్రిక్ బస్సులు

వరంగల్, జనవరి 7
వరంగల్ రోడ్లపై ఎలక్ట్రిక్ బస్సులు పరుగులు పెట్టనున్నాయి. కాలుష్యంతో పాటు ఖర్చును తగ్గించేందుకు టీజీఎస్ ఆర్టీసీ ఈ ఎలక్ట్రిక్ బస్సులను తీసుకొస్తుంది. వరంగల్ రీజియన్‌కు మొత్తంగా 112 బస్సులను కేటాయించారు. అందులో ముందస్తుగా 75 వెహికిల్స్ వరంగల్‌కు చేరుకున్నాయి. వాటిని ప్రారంభించనున్నారు.వాస్తవానికి ఆదివారం ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, అటవీశాఖ మంత్రి కొండా సురేఖ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క చేతుల మీదుగా ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేశారు. కానీ మంత్రుల బిజీ షెడ్యూల్ కారణంగా ఎలక్ట్రిక్ బస్సుల ప్రారంభోత్సవాన్ని వాయిదా వేశారు. సోమవారం నిర్వహించే ఎలక్ట్రిక్ బస్సుల ప్రారంభోత్సవ కార్యక్రమానికి మంత్రులు హాజరవుతారా లేదా అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉందిఆర్టీసీ వరంగల్ రీజియన్ కు కేటాయించిన ఎలక్ట్రిక్ బస్సులను మొదటగా వరంగల్-2 డిపోకు కేటాయించారు. ఇక్కడ ఎలక్ట్రిక్ చార్జింగ్ పాయింట్లు, సబ్ స్టేషన్ నిర్మాణం పూర్తి అయ్యింది. ఇదిలాఉంటే టీజీఎస్ఆర్టీసీ వరంగల్ రీజియన్ కు 112 ఎలక్ట్రిక్ బస్సులు కేటాయించగా.. వాటిలో 19 సూపర్ లగ్జరీ, 18 డీలక్స్, 75 ఎక్స్ ప్రెస్ సర్వీసులు ఉన్నాయి.వరంగల్ రీజియన్ కు కేటాయించిన వాటిలో ఇప్పటివరకు 75 బస్సులు హనుమకొండలోని వరంగల్ 2 డిపోకు చేరుకున్నాయి. వీటిలో 19 సూపర్ లగ్జరీ, 16 డీలక్స్, 40 ఎక్స్ ప్రెస్ బస్సులు ఉన్నాయి. జేబీఎం సంస్థ నిర్వహణలో ఎలక్ట్రిక్ బస్సులు నడవనుండగా.. ఆ సంస్థ డ్రైవర్ల రిక్రూట్మెంట్ బాధ్యతను శ్రీ బాలజీ కన్సల్టెన్సీకి అప్పగించింది. దీంతో డ్రైవర్ల ఎంపిక ప్రక్రియను కొనసాగుతోంది. మొత్తం 112 బస్సులకు 260 మంది డ్రైవర్లు అవసరం కాగా.. ఇప్పటి వరకు 136 మందిని ఎంపిక చేశారు.

మిగతా వారిని కూడా తొందర్లోనే నియమించి, ఎలక్ట్రిక్ బస్సులు నడిపించేందుకు సిద్ధం చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.వరంగల్ రీజియన్ కు కేటాయించిన 112 బస్సులకు మొత్తం 21 ఛార్జింగ్ పాయింట్లు ఏర్పాటు చేయాల్సి ఉంది. వాటి పనులు వేగంగా కూడా నడుస్తున్నాయి. ఇప్పటికే ఆరు ఛార్జింగ్ పాయింట్లు అందుబాటులోకి రాగా.. వాటికి అవసరమై విద్యుత్ సరఫరా చేసేందుకు సబ్ స్టేషన్ నిర్మాణం కూడా పూర్తయ్యింది. ఇప్పుడున్న 6 పాయింట్ల ద్వారా 30 నుంచి 35 బస్సులు ఛార్జింగ్ చేసుకునే అవకాశం ఉంది. ఒక్క బస్సు ఛార్జింగ్ పూర్తి చేసుకోవడానికి గంటన్నర నుంచి రెండు గంటల సమయం పడుతుందని సిబ్బంది చెబుతున్నారు. ఒక పిన్ తో ఛార్జింగ్ చేస్తే 2 గంటలు, రెండు పిన్ లతో ఛార్జింగ్ చేస్తే గంట సమయం పట్టే అవకాశం ఉందని చెబుతున్నారు. మిగతా 15 ఛార్జింగ్ పాయింట్ల నిర్మాణం కూడా కొనసాగుతోందని ఆఫీసర్లు చెబుతున్నారు.వరంగల్ రీజియన్ కు ముందుగా 86 అలాట్ చేయగా.. ఇటీవల మరో 26 బస్సులు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో వరంగల్ రీజియన్ కు కేటాయించిన సంఖ్య 112కు చేరింది. వాస్తవానికి వరంగల్ రీజియన్ లో ఇటీవల కాలం చెల్లిన బస్సులను తొలగించడం, మహాలక్ష్మి పథకం ఎఫెక్ట్, రూరల్ గ్రామాలకు బస్సు సర్వీసుల పునరుద్ధరణ వల్ల బస్సుల కొరత ఏర్పడింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం 112 ఈవీ బస్సులను కేటాయించడంతో కొంతమేర కొరత తీరే అవకాశం కనిపిస్తోంది.ముందుగా 75 బస్సులను ప్రారంభించేందుకు హనుమకొండలోని కుడా గ్రౌండ్ (హయగ్రీవాచారి గ్రౌండ్)ను సిద్ధం చేశారు. ఈ మేరకు ఆదివారం వీటిని ప్రారంభించాల్సి ఉండగా.. మంత్రుల షెడ్యూల్ ఖాళీ లేని కారణంగా ఈ కార్యక్రమాన్ని సోమవారానికి వాయిదా వేశారు. మొదట డిసెంబర్ 18న మంత్రి పొన్నం చేతుల మీదుగా వీటిని ప్రారంభించేందుకు సన్నాహాలు చేయగా.. ఆ కార్యక్రమం వివిధ కారణాల వల్ల రద్దయ్యింది.ఆ తరువాత డిసెంబర్ 26 న ప్రారంభించాలని చూసినా కలిసి రాలేదు. ఇప్పుడు జనవరి 5న కూడా ఓపెనింగ్ కు అనుకూలంగా పరిస్థితులు లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో సోమవారానికి వాయిదా వేశారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం పూర్తయిన తరువాత ఉమ్మడి వరంగల్ జిల్లా రోడ్లపై ఎలక్ట్రిక్ బస్సులు పరుగులు తీయనున్నాయి.

Read:Mahbub Nagar:రిజర్వేషన్లు మారితే ఏంటీ

Related posts

Leave a Comment