Warangal:ఏనుమాముల మార్కెట్ కు పోటెత్తిన మిర్చి- ధర పడిపోతుండటంతో రైతుల్లో దిగులు:వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ కు ఎర్ర బంగారం పోటెత్తింది. యార్డు మొత్తం మిర్చి బస్తాలతో నిండిపోయింది. సుమారు 80 వేల మిర్చి బస్తాలు మార్కెట్ కు వచ్చాయి. అయితే ఆశించిన స్థాయిలో గిట్టుబాటు ధర రావడంలేదని రైతులు ఆందోళన చెందుతున్నారు.ఆసియాలోనే రెండో అతి పెద్ద మార్కెట్ గా పేరున్న వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ సోమవారం ఎరుపెక్కింది. ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు ఇతర ప్రాంతాల నుంచి రైతులు పెద్ద ఎత్తున మిర్చి బస్తాలు తీసుకురాగా.. యార్డు మొత్తం బస్తాలతో నిండిపోయింది.
ఏనుమాముల మార్కెట్ కు పోటెత్తిన మిర్చి-
ధర పడిపోతుండటంతో రైతుల్లో దిగులు
వరంగల్, ఫిబ్రవరి 25
వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ కు ఎర్ర బంగారం పోటెత్తింది. యార్డు మొత్తం మిర్చి బస్తాలతో నిండిపోయింది. సుమారు 80 వేల మిర్చి బస్తాలు మార్కెట్ కు వచ్చాయి. అయితే ఆశించిన స్థాయిలో గిట్టుబాటు ధర రావడంలేదని రైతులు ఆందోళన చెందుతున్నారు.ఆసియాలోనే రెండో అతి పెద్ద మార్కెట్ గా పేరున్న వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ సోమవారం ఎరుపెక్కింది. ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు ఇతర ప్రాంతాల నుంచి రైతులు పెద్ద ఎత్తున మిర్చి బస్తాలు తీసుకురాగా.. యార్డు మొత్తం బస్తాలతో నిండిపోయింది. వరుసగా శని, ఆదివారం రెండు రోజుల పాటు వ్యవసాయ మార్కెట్ కు సెలవులు రావడం, సోమవారం తిరిగి మార్కెట్ ఓపెన్ కావడంతో రైతులు పెద్ద ఎత్తున మిర్చి బస్తాలు తీసుకొచ్చారువివిధ ప్రాంతాల నుంచి సుమారు 80 వేల బస్తాలతో రైతులు ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డుకు రాగా, యార్డు మొత్తం ఎర్ర బంగారంతో నిండిపోయింది. కాగా ఓ వైపు మార్కెట్ యార్డుకు పెద్ద ఎత్తున మిర్చి బస్తాలు తీసుకు వస్తున్నా.. ఆశించిన స్థాయిలో రేటు గిట్టుబాటు కావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్ కు దేశీ మిర్చి, వండర్ హాట్, యూఎస్ 341, డీడీ, దీపిక ఇలా వివిధ రకాల మిర్చి వస్తుండగా, దేశీ మిర్చి మినహా మిగతా ఏ రకానికీ 20 వేల గరిష్ట ధర రావడం లేదని అన్నదాతలు వాపోతున్నారు.వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ లో మిర్చి ధరలు రోజురోజుకు పడిపోతుండటంతో అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పెట్టిన పెట్టుబడి, వచ్చిన దిగుబడి, మార్కెట్ లో పలుకుతున్న ధరకు ఏమాత్రం పొంతన ఉండటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్ వ్యాపారులంతా కుమ్ముక్కై మిర్చి ధరలు తగ్గిస్తున్నారని ఆరోపిస్తున్నారు.
కానీ ఎగుమతులు తగ్గడమే మిర్చి ధర పడిపోవడానికి కారణమని వ్యాపారులు చెబుతుండటం గమనార్హం. కాగా గతేడాది క్వింటా మిర్చి రూ.20 నుంచి 40 వేలు పలికింది.ఇప్పుడు ఆ పరిస్థితి లేకపోవడంతో ధరలు గిట్టుబాటు కావడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. లక్షల్లో పెట్టుబడి పంటలు సాగు చేస్తే మార్కెట్ లో రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకే ధర కడుతున్నారని వాపోతున్నారు. ప్రభుత్వం ఈ విషయంలో చొరవ తీసుకుని మిర్చి రైతులకు న్యాయం జరిగేలా తగిన చర్యలు తీసుకోవాలని అన్నదాతలు విజ్ఞప్తి చేస్తున్నారు.కొంతమంది రైతులు ఆర్థిక పరిస్థితులు బాగోలేక మిర్చి తగ్గువ రేటుకే అమ్ముకుంటుండగా, మరికొందరు కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ చేసుకునేందుకు మొగ్గు చూపుతున్నారు. దీంతో వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ చుట్టూ ఉన్న కోల్డ్ స్టోరేజీలు మిర్చి బస్తాలతో నిండిపోతున్నారు. కాగా గతేడాది కూడా ఎగుమతులు పెద్దగా లేకపోవడంతో చాలా మంది వ్యాపారుల మిర్చి బస్తాలు కూడా కోల్డ్ స్టోరేజీల్లోనే మూల్గుతున్నాయి. ఇప్పటికే దాదాపు 10 లక్షల బస్తాలకుపైగా కోల్డ్ స్టోరీజీల్లో నిల్వ ఉండగా, అందులో 90శాతానికిపైగా వ్యాపారులే కావడం గమనార్హం. ఇదిలాఉంటే ఈసారి కూడా ఎగుమతులు పెద్దగా లేకపోవడంతో మిర్చి ధర పెరగడం లేదని వ్యాపారులు చెబుతున్నారు. మున్ముందు మరింత ధర పతనం అయ్యే అవకాశం లేకపోలేదని స్పష్టం చేస్తున్నారు.వ్యవసాయ ఉత్పత్తుల ధరలు బాగా పడిపోయినప్పుడు, రాష్ట్రాలు సాయం కోరితే మద్దతు ధర పథకాల పరిధిలోకి రాని వ్యవసాయ ఉత్పత్తులను కేంద్రం సేకరిస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఆ నష్టాలను భరిస్తుంది. దీనికి మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ అని పేరు పెట్టారు. కేంద్రం గిట్టుబాటు ధర ప్రకటించే వాణిజ్యపంటల జాబితాలో మిర్చి చేర్చకపోవడం వల్ల మిర్చికి ఈ ఫథకాన్ని అమలు చేస్తున్నారు. ఎగుమతులు కేంద్రం చేతిలోనే ఉంటాయి కాబట్టి..ఎగుమతి విధానంపై కేంద్రం కొన్ని నిర్ణయాలు తీసుకుంటే డిమాండ్ పెరిగే అవకాశం ఉంది.