మూడు పార్టీల ముఖ్యనేతలు. మరోసారి ఒకే ఫ్రేమ్‌లో కనిపించబోతున్నారు. ఆరు నెలల కింద ఎన్నికలప్పుడు విజయవాడలో రోడ్ షో చేసిన ఆ నేతలు..ఇప్పుడు మళ్లీ సాగర తీరంలో సింగిల్ ఫ్రేమ్‌లో ఆకట్టుకోబోతున్నారు. ఆ అద్భుత సన్నివేశం కోసం మూడు పార్టీల నేతల క్యాడర్ వెయిట్ చేస్తున్నారు. మరోసారి ముగ్గురు అగ్రనేతలు ఒకే వేదిక మీద కనిపించబోతున్నారు. ఒకే ఫ్రేమ్‌లో వాళ్ల అభిమానుల్లో, పార్టీ శ్రేణుల్లో ఆనందం నింపబోతున్నారు. ఇంతకీ ఆ ముగ్గురు ఎవరంటే ప్రధాని మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.
సాగర తీరంలో సింగిల్ ఫ్రేమ్…
విశాఖపట్టణం, జనవరి 6
మూడు పార్టీల ముఖ్యనేతలు. మరోసారి ఒకే ఫ్రేమ్‌లో కనిపించబోతున్నారు. ఆరు నెలల కింద ఎన్నికలప్పుడు విజయవాడలో రోడ్ షో చేసిన ఆ నేతలు..ఇప్పుడు మళ్లీ సాగర తీరంలో సింగిల్ ఫ్రేమ్‌లో ఆకట్టుకోబోతున్నారు. ఆ అద్భుత సన్నివేశం కోసం మూడు పార్టీల నేతల క్యాడర్ వెయిట్ చేస్తున్నారు. మరోసారి ముగ్గురు అగ్రనేతలు ఒకే వేదిక మీద కనిపించబోతున్నారు. ఒకే ఫ్రేమ్‌లో వాళ్ల అభిమానుల్లో, పార్టీ శ్రేణుల్లో ఆనందం నింపబోతున్నారు. ఇంతకీ ఆ ముగ్గురు ఎవరంటే ప్రధాని మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. ఈ ముగ్గురు ఒకే ఫ్రేమ్‌లో కనిపించడం సమ్‌థింగ్ స్పెషలే. ముఖ్యంగా ఏపీ ఎన్నికల సమయంలో పవన్, మోదీ డిస్కషన్.. వీడియోస్, ఫొటోస్ ఎంతగా వైరల్‌గా మారాయో తెలియంది కాదు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కలిసి రోడ్ షో చేసిన ఈ ముగ్గురు నేతలు..ఇప్పుడు మరోసారి ఒకే డయాస్ మీద అట్రాక్ట్ చేయబోతున్నారు.ఈ నెల 8న ప్రధాని మోదీ విశాఖ పర్యటన ఖరారైంది. షెడ్యూల్ కూడా ఫిక్స్ అయింది. పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభం, శంకుస్థాపన కోసం వస్తున్న ప్రధాని మోదీ.. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌తో కలసి రోడ్‌షో చేయబోతున్నారు. అయితే ఏపీ ఎలక్షన్స్‌కు ముందు ఈ ముగ్గురు లీడర్లు భారీ ర్యాలీ నిర్వహించారు. అందులో పబ్లిక్ పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆ తర్వాత ఎన్నికల్లో కూటమి బంపర్ విక్టరీ సాధించింది.కూటమి ప్రభుత్వం ఏర్పాటు సందర్భంగా ఏపీకి వచ్చిన ప్రధాని..ఆ తర్వాత ఈ ఏడాదిలో మొదటిసారి విశాఖకు రానున్నారు. భారీ విజయం దక్కించుకున్న కూటమి నేతలు చేయబోయే ర్యాలీపై ఇప్పుడు క్యాడర్‌లో ఎంతో ఆసక్తి ఏర్పడింది. అందుకు తగ్గట్లుగానే జనవరి 8న నిర్వహించే మోదీ, బాబు, పవన్ రోడ్‌షోకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. విజయోత్సవ ర్యాలీలాగా జరిపేలా సన్నాహాలు చేస్తున్నారు.ప్రధాని 8న మధ్యాహ్నం 3 గంటలకు విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకుని అక్కడి నుంచి నేరుగా ఆంధ్రా యూనివర్సిటీ ఇంజినీరింగ్ కాలేజీ గ్రౌండ్‌కు చేరుకుంటారు. NTPC ఆధ్వర్యంలో ఏర్పాటు కానున్న గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టుతో పాటు రైల్వేజోన్ పరిపాలన భవనాలు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేసి, బహిరంగ సభలో ప్రసంగిస్తారు.ఆర్నెళ్ల పాలనలో సాధించిన విజయాలపై వివరించేందుకు రెడీ అవుతున్నారు కూటమి నేతలు. సభకు లక్ష మంది హాజరవుతారని అంచనా వేస్తున్నారు. ఆశీల్‌మెట్టలో గల సంపత్ వినాయక్ ఆలయం నుంచి సభా ప్రాంగణం వరకూ ఓపెన్‌టాప్ వాహనంలో ప్రధాని రోడ్‌షో నిర్వహించనున్నారు. ఆయనతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ రోడ్‌షోలో పాల్గొంటారు.ప్రధాని టూర్‌ను గ్రాండ్ సక్సెస్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తుంది ఏపీ సర్కార్. ముగ్గురు మంత్రులతో పర్యవేక్షణ కమిటీని నియమించింది రాష్ట్ర ప్రభుత్వం. జన సమీకరణ బాధ్యతను స్థానిక ప్రజా ప్రతినిధులు, కూటమి నేతలకు అప్పగించారు. అయితే రోడ్ షోలో ముగ్గురు నేతలు ఒకే ఫ్రేమ్‌లో కనిపించబోతుండటంతో..కూటమి పార్టీల క్యాడర్‌లో జోష్ కనిపిస్తోంది. అటు బీజేపీ క్యాడర్, లీడర్లు కూడా మోదీ టూర్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.అటు పవన్ ఫ్యాన్స్ కూడా తమ నేత రాక కోసం వెయిట్ చేస్తున్నారు. కూటమి రథసారధిగా చంద్రబాబు ఇచ్చే స్పీచ్‌పై వైజాగ్ ప్రజల్లోకి ఆసక్తికర చర్చ జరుగుతోంది. అటు ప్రధాని మోదీ వరాలు ప్రకటిస్తారని.. స్టీల్ ప్లాంట్‌పై ఏదైనా ప్రకటన చేస్తారని భావిస్తున్నారు ప్రజలు. చూడాలి మరి మోదీ టూర్‌ను కూటమి నేతలు రేంజ్‌లో సక్సెస్ చేయబోతున్నారో.
పిన్ టూ పిన్ ప్రోగ్రామ్ ఇదే
ఏపీలో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. ఈనెల 8న విశాఖ రానున్నారు. ఏపీ సీఎం గా చంద్రబాబు ప్రమాణస్వీకారం కార్యక్రమానికి మోడీ హాజరయ్యారు. అటు తరువాత ఏపీకి రావడం ఇదే తొలిసారి. ఏపీలో ప్రధాని పర్యటనకు సంబంధించి షెడ్యూల్ కూడా ఖరారు అయ్యింది. లక్ష కోట్ల పెట్టుబడులకు సంబంధించి శంకుస్థాపనలు చేయనున్నారు మోదీ. అలాగే నగరంలో రోడ్ షో కూడా ప్లాన్ చేశారు. ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్లో భారీ బహిరంగ సభ జరగనుంది. ఏపీకి సంబంధించి ప్రధాని మోదీ కీలక ప్రకటనలు చేస్తారని అంచనాలు ఉన్నాయి. సాయంత్రం 4:15 గంటలకు విశాఖలోని ఐఎన్ఎస్ డేగాలో దిగుతారు. ఈ సందర్భంగా ప్రధానికి రాష్ట్ర గవర్నర్, సీఎం, డిప్యూటీ సీఎం, ఇతర ప్రముఖులు స్వాగతం పలుకుతారు. ఈ సందర్భంగా నేవీ నుంచి ఆయన గౌరవ వందనం స్వీకరిస్తారు. అటు తరువాత అక్కడ నుంచి రోడ్ షో బహిరంగ సభ వేదికకు చేరుకోనున్నారు ప్రధాని మోదీ. ప్రధాని పర్యటనకు సంబంధించి ఇన్చార్జిగా మంత్రి నారా లోకేష్ వ్యవహరించనున్నారు.నగరంలోని ప్రధాన జంక్షన్ లను కలుపుతూ మోడీ పర్యటన కొనసాగనుంది. తాటి చెట్ల పాలెం జంక్షన్, సంపత్ వినాయక్ గుడి, దత్త ఐలాండ్ మీదుగా.. ఏయూ ఎకనామిక్స్ విభాగం ఎదురుగా ఉన్న వెంకటాద్రి వంటిల్లు వరకు.. రోడ్డు షోలో పాల్గొంటారు ప్రధాని మోదీ. ఓపెన్ టాప్ వాహనంపై ప్రజలకు అభివాదం చేస్తూ సాగుతారు. త్రీ టౌన్ జంక్షన్ మీదుగా ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ మైదానానికి చేరుకుంటారు.కాగా ఈ రోడ్డు షోకు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. ఓపెన్ టాప్ వాహనంపై ప్రధాని మోదీ తో పాటు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ సైతం పాల్గొనే అవకాశం ఉంది. సాయంత్రం 5:30 నుంచి 6:30 గంటల వరకు ప్రధాని సభా ప్రాంగణంలోనే ఉంటారు. పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. సాయంత్రం 6:30 గంటలకు సభ ముగిసిన తరువాత రోడ్డు మార్గాన ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. అక్కడ నుంచి ఢిల్లీ బయలుదేరి వెళ్తారు. కాగా ఇది పూర్తి అధికారిక పర్యటన. రాజకీయ ప్రసంగాలు ఉండవని తెలుస్తోంది.ప్రధాని పర్యటన వేళ ఏపీకి సంబంధించి చాలా రకాల ప్రాజెక్టులకు ప్రధాని మోదీ సానుకూలత వ్యక్తం చేసే అవకాశం ఉంది. ఇప్పటికే అమరావతి తో పాటు పోలవరం అంశాల్లో కేంద్రం సాయం ప్రకటించింది. అయితే పెండింగ్ ప్రాజెక్టులు చాలా ఉన్నాయి. ముఖ్యంగా విశాఖ స్టీల్ అంశం పెండింగ్లో ఉంది. దీనిపై ప్రధాని మోదీ స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. అందుకే ప్రధాని పర్యటనపై అంత ఉత్కంఠ కొనసాగుతోంది.
Read:Vijayawada:ఆరోగ్యశ్రీ స్థానంలో ఇన్సూరెన్స్