Visakhapatnam:రుషికొండకు బ్లూ ఫ్లాగ్.. కధేంటీ:విశాఖలోని రుషికొండ బీచ్ బ్లూ ఫ్లాగ్ గుర్తింపును కోల్పోయింది. నిర్వహణపై ఫిర్యాదులు రావడంతో ఎఫ్.ఈ.ఈ గుర్తింపును రద్దు చేసింది. ఈ వ్యవహారంపై ప్రభుత్వం సీరియస్ అయ్యింది. తక్షణమే పునరుద్ధరణ చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. దీనిఖపట్నంలోని రుషికొండ బీచ్ ‘బ్లూ ఫ్లాగ్’ గుర్తింపును కోల్పోయింది. డెన్మార్క్‌కు చెందిన ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ (ఎఫ్.ఈ.ఈ) సంస్థ గుర్తింపును తాత్కాలికంగా రద్దు చేసింది.
రుషికొండకు బ్లూ ఫ్లాగ్.. కధేంటీ
విశాఖపట్టణం, మార్చి 4
విశాఖలోని రుషికొండ బీచ్ బ్లూ ఫ్లాగ్ గుర్తింపును కోల్పోయింది. నిర్వహణపై ఫిర్యాదులు రావడంతో ఎఫ్.ఈ.ఈ గుర్తింపును రద్దు చేసింది. ఈ వ్యవహారంపై ప్రభుత్వం సీరియస్ అయ్యింది. తక్షణమే పునరుద్ధరణ చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. దీనిఖపట్నంలోని రుషికొండ బీచ్ ‘బ్లూ ఫ్లాగ్’ గుర్తింపును కోల్పోయింది. డెన్మార్క్‌కు చెందిన ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ (ఎఫ్.ఈ.ఈ) సంస్థ గుర్తింపును తాత్కాలికంగా రద్దు చేసింది. రుషికొండ బీచ్ నిర్వహణ అధ్వానంగా ఉందని ఎఫ్.ఈ.ఈకి ఫిర్యాదులు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఎఫ్.ఈ.ఈ గుర్తింపును తాత్కాలికంగా రద్దు చేస్తూ చర్యలు తీసుకుంది. దీనికి సంబంధించిన 9 ముఖ్యమైన అంశాలు ఇలా ఉన్నాయి..బీచ్ పరిసరాల్లో వ్యర్దాలు పేరుకుపోవడం, బట్టలు మార్చుకునే గదుల దగ్గర శుభ్రత లోపించటం, నడక దారి ధ్వంసం అవ్వటం వంటి కారణాల వల్ల బ్లూ ఫ్లాగ్ ట్యాగ్‌ను తొలగించారు.రుషికొండ బీచ్‌లోకి శునకాలు రావడం, సీసీ కెమెరాలు పనిచేయకపోవడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి..బీచ్ నిర్వహణను ప్రైవేటు సంస్థ గాలికొదిలేయడం, పర్యాటక శాఖ అధికారుల మధ్య సమన్వయలోపం కారణంగానే ఇది జరిగింది..ఈ సర్టిఫికెట్ ఉపసంహరణ తాత్కాలికమేనని, భద్రతా ఆడిట్ తర్వాత బ్లూఫ్లాగ్‌ను పునరుద్ధరించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు..రుషికొండ బీచ్‌కు బ్లూ ఫ్లాగ్ ట్యాగ్ ఉపసంహరణపై.. ఏపీ ప్రభుత్వం సీరియస్ అయ్యింది.
తక్షణమే పునరుద్ధరణ చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.ఈ వివాదంపై ఏపీ ప్రభుత్వం వివరణ ఇచ్చింది. బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్‌ను రద్దు చేయలేదు.. తాత్కాలికంగా మాత్రమే ఉపసంహరించారని స్పష్టం చేసింది. సేఫ్టీ ప్రోటోకాల్స్ అప్డేట్ చేయాలని.. బ్లూఫ్లాగ్ ఫౌండేషన్ సూచించింది. 2 రోజుల్లో ఆడిట్ తర్వాత పునరుద్ధరిస్తామని ప్రభుత్వం వెల్లడించింది.రుషికొండ బీచ్ వైజాగ్ రైల్వే స్టేషన్ నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. పర్యాటకులను, స్థానికులను బాగా ఆకర్షిస్తుంది. ఈ బీచ్‌ను ‘జ్యువెల్ ఆఫ్ ది ఈస్ట్ కోస్ట్’ అని కూడా పిలుస్తారు. భారతదేశ బ్లూ ఫ్లాగ్ బీచ్ మిషన్ నుండి రుషికొండ బీచ్‌కు ఎకో లేబుల్ ‘బ్లూ ఫ్లాగ్’ వచ్చింది. దాంతో ఈ బీచ్‌కు ఇప్పుడు గ్లోబల్ పర్యాటకం మ్యాప్‌లో స్థానం లభించింది..బ్లూ ఫ్లాగ్ గుర్తింపు పొందిన బీచ్‌లు పర్యాటకులను ఆకర్షిస్తాయి. పర్యాటకుల సంఖ్య పెరగడం వల్ల స్థానిక ఆర్థిక వ్యవస్థకు మేలు జరుగుతుంది. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన బ్లూ ఫ్లాగ్ ట్యాగ్ వల్ల.. ఆయా ప్రదేశాల ప్రతిష్ట పెరుగుతుంది. బ్లూ ఫ్లాగ్ ప్రమాణాలు బీచ్‌ల వద్ద భద్రతా చర్యలను పెంపొందిస్తాయి. లైఫ్ గార్డ్స్, ప్రథమ చికిత్స సౌకర్యాలు వంటివి అందుబాటులో ఉంటాయి.ఈ ట్యాగ్ వల్ల నీటి నాణ్యతను కాపాడతారు. నీటి నాణ్యతను పరీక్షించి పర్యాటకులకు అనుకూలంగా ఉండేలా చూస్తారు. పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండడం వల్ల ప్రజల ఆరోగ్యం మెరుగుపడుతుంది. బ్లూ ఫ్లాగ్ ప్రమాణాలు బీచ్‌లు పర్యావరణానికి అనుకూలంగా ఉండేలా ప్రోత్సహిస్తాయి.
Read more:Andhra Pradesh:ప్రభుత్వ ప్రచారానికి ప్రైవేట్ ఏజెన్సీలు