Visakhapatnam:ఉత్తరాంధ్రపై జనసేనాని గురి

Targeting Janasena on Uttarandhra

ఉత్తరాంధ్రలో ఏజెన్సీ ప్రాంతం.. ఆ పార్టీకి కంచుకోట. ఎన్నికలు ఏవైనా.. అభ్యర్థి బరిలో ఉంటే చాలు.. గెలుపు వాళ్ల ముంగిట్లో ఉంటుందంటే అతిశయోక్తి కాదేమో. ఇక్కడ వరకూ ఓకే. గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచినా.. ఆ నేతకు. ఆనందం లేదట. పార్టీ నాయకులతో పాటు శ్రేణుల నుంచి సపోర్టు లేక ఇబ్బంది పడుతున్నారట. దీంతో ఇప్పుడు సీన్ అంతా.. ఎమ్మెల్యే వర్సెస్ మాజీ ఎమ్మెల్యేగా మారిపోయిందనే టాక్‌ నడుస్తోంది.

ఉత్తరాంధ్రపై జనసేనాని గురి

విశాఖపట్టణం, జనవరి 3
ఉత్తరాంధ్రలో ఏజెన్సీ ప్రాంతం.. ఆ పార్టీకి కంచుకోట. ఎన్నికలు ఏవైనా.. అభ్యర్థి బరిలో ఉంటే చాలు.. గెలుపు వాళ్ల ముంగిట్లో ఉంటుందంటే అతిశయోక్తి కాదేమో. ఇక్కడ వరకూ ఓకే. గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచినా.. ఆ నేతకు. ఆనందం లేదట. పార్టీ నాయకులతో పాటు శ్రేణుల నుంచి సపోర్టు లేక ఇబ్బంది పడుతున్నారట. దీంతో ఇప్పుడు సీన్ అంతా.. ఎమ్మెల్యే వర్సెస్ మాజీ ఎమ్మెల్యేగా మారిపోయిందనే టాక్‌ నడుస్తోంది. ఇంట గెలిచినా.. రచ్చ గెలవలేక పోతున్న ఆ ఎమ్మెల్యే ఎవరు.. ఎందుకు వివాదాల్లో చిక్కుకున్నారు. వాచ్‌ దిస్ స్టోరీ..ఉత్తరాంధ్రలో.. ముఖ్యంగా ఉమ్మడి విశాఖ జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో పాడేరు నియోజకవర్గం కీలకమైంది. ఆ ప్రాంతాన్ని వైసీపీ.. తన కంచుకోటలా భావిస్తుందట. 2014 నుంచి 2024 వరకూ జరిగిన ఎన్నికల్లో జగన్‌ వెంటే ఆ ప్రాంత ఓటర్లు ఉన్నట్లు.. అభ్యర్థుల గెలుపు చూస్తే అర్థం అవుతోంది. ఏజెన్సీ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు ఎవరనేది అనవసరం.. వైసీపీ పార్టీ నుంచి బరిలో నిలిస్తే కచ్చితంగా గెలిచి తీరుతారనే టాక్ ఉంది. అలాంటి గెలుపు సునాయాసంగా ఏజెన్సీ నియోజకవర్గాల్లో వస్తుండగా.. పదేళ్లుగా ప్రతి ఎన్నికల్లోను వైసీపీ నుంచి సీటు దక్కించుకోవడానికి ప్రతి ఒక్కరూ ఆసక్తి చూపిస్తున్నారు.

అలాంటి ఏజెన్సీ నియోజకవర్గాల్లోని.. వైసీపీ నాయకుల్లో ఒకరిపై ఒకరికి పడక వర్గ పోరు మొదలైందట.అల్లూరి సీతారామరాజుజిల్లా పాడేరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే వర్సెస్ మాజీ ఎమ్మెల్యేల మధ్యవర్గ పోరు మొదలైందట. 2014, 2019, 2024 ఎన్నికల్లో వరుసగా మూడుసార్లు వైసీపీ నుంచి పోటీ చేసిన అభ్యర్థులు విజయం సాధించడంతో.. ఈ నియోజకవర్గంపై వైసీపీ అధినేత జగన్‌కు ప్రత్యేకమైన అభిమానం ఉందట. 2024 ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా కూటమి గాలి వీచినా.. పాడేరు నియోజకవర్గంలో మాత్రం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మత్స్యరాస విశ్వేశ్వర రాజు.. టీడీపీ అభ్యర్థి గిడ్డి ఈశ్వరిపై ఘనవిజయం సాధించారు.సిట్టింగ్ ఎమ్మెల్యే భాగ్యలక్ష్మిని కాదని.. మత్స్యరాస విశ్వేశ్వర రాజుని వైసీపీ అభ్యర్థిగా జగన్ ప్రకటించడం.. ఎన్నికల్లో గెలిచి ఎమ్మెల్యే అవ్వడం చకచకా జరిగిపోయాయి. ఇక్కడవరకూ ఓకే . అధికారంలో కూటమి ప్రభుత్వం ఉండటం.. నియోజకవర్గ అభివృద్ధి పనులు జరిగే అవకాశం లేకపోవడం…విశ్వేశ్వర రాజుకు కొంత ఇబ్బందికరంగా మారిందట. నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరగడం లేదని ఆరు నెలల నుంచి కూటమికి చెందిన టీడీపీ నాయకులు విమర్శలు చేస్తూ విశ్వేశ్వర రాజును టార్గెట్ చేస్తున్నట్లు టాక్ నడుస్తోంది.పాడేరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే విశ్వేశ్వర రాజుకు అధికార పార్టీ నాయకుల నుంచి.. ఏ స్థాయిలో ఇబ్బందులు ఎదురవుతున్నాయో.. అదే స్థాయిలో వైసీపీ నాయకులు నుంచి కూడా వర్గ పోరు మొదలైందట.

ప్రస్తుతం పాడేరు ఎమ్మెల్యే విశ్వేశ్వర రాజును.. అల్లూరు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా వైసీపీ అధిష్టానం నియమించింది. మాజీ ఎమ్మెల్యే భాగ్యలక్ష్మికి.. రాష్ట్ర ఎస్టీ విభాగంలో కీలకపద‌వితో పాటు ఉమ్మడి విశాఖ జిల్లా సోషల్ మీడియా టాస్క్ ఫోర్స్ టీం సభ్యురాలుగా ప్రకటించింది.ఆ పదవులు కేటాయింపు జరిగిన రోజు నుంచి ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే వర్గాల మధ్య వర్గ పోరు మొదలైనట్లు ప్రచారం జరుగుతుంది. ముఖ్యంగా వైసీపీ పిలుపునిచ్చిన పార్టీ కార్యక్రమాల్లో ఎమ్మెల్యేతో పాటు మాజీ ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి వర్గీయులు పాల్గొంటున్నా.. కార్యక్రమాలు పూర్తైన తర్వాత నెగిటివ్ ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే విశ్వేశ్వర రాజు.. తన సన్నిహితుల దగ్గర చెప్పుకుంటున్నట్లు సమాచారం.అధికార పార్టీ ఇబ్బందులకు గురి చేస్తుంటే.. ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి సర్ది చెప్పుకునే అవకాశం ఉంటుంది. కానీ..సొంత పార్టీలోని వైసీపీ నాయకులే.. ఎమ్మెల్యేను టార్గెట్ చేసుకుని సోషల్ మీడియాలో వ్యతిరేక ప్రచారం చేస్తుండడం, వైసీపీ అధిష్టానం నిర్ణయంతో… అసెంబ్లీకి ఎమ్మెల్యే విశ్వేశ్వర రాజు వెళ్లకపోవడం ఇబ్బందికరంగా మారిందట. వైసీపీకి కంచుకోట లాంటి పాడేరు నియోజకవర్గంలో.. రోజురోజుకీ పెరుగుతున్న వర్గ విభేదాలతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఎమ్మెల్యే ఉన్నట్లు తెలుస్తోంది.తనపై జరుగుతున్న వ్యతిరేక ప్రచారాన్ని వైసీపీ అధ్యక్షుడు జగన్ దృష్టికి విశ్వేశ్వరరాజు తీసుకెళ్లారట. మరోవైపు.. నియోజకవర్గంలోని పార్టీ కార్యకర్తలను.. విశ్వేశ్వర రాజు పట్టించుకోవడంలేదని మాజీ ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి కూడా ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. దీంతో కంచుకోట లాంటి నియోజకవర్గంలో ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యేల మధ్య జరుగుతున్న వర్గపోరును… ఇక్కడితో ఆపివేయాలని జగన్ హెచ్చరించినట్లు సమాచారం.అధికారం కోల్పోయిన ఆరు నెలల్లోనే రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ నుంచి అనేకమంది పార్టీ మారిపోతున్న నేపథ్యంలో పాడేరుపై దృష్టి సారించాలని జగన్‌ తీవ్రయత్నాలు చేస్తున్నారు. బలమైన నియోజకవర్గంగా ఉన్న పాడేరులో అంతర్గత సమస్యలపై ఫోకస్ చేయకుంటే.. భారీ నష్టం జరిగే అవకాశం ఉందని గమనించిన వైసీపీ అధినేత.. దిద్దుబాటు చర్యలో పడినట్లు తెలుస్తోంది.రాష్ట్రంలో 11 సీట్లకే పరిమితం అయిన నేపథ్యంలో పాడేరు నియోజకవర్గంలోని ఎమ్మెల్యే, నియోజకవర్గంలో ఉన్న క్యాడర్‌ను కాపాడుకోకపోతే భవిష్యత్తులో పార్టీకి మనుగడ కూడా కష్టమనే భావనలో అధిష్టానం ఉందట. ఇప్పటికే జనసేనాని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. ఏజెన్సీ నియోజకవర్గాలపై దృష్టి పెట్టిన నేపథ్యంలో వర్గపోరులతో వైసీపీ నాయకులు సతమతం అవుతుంటే.. భవిష్యత్‌ ఎన్నికల్లో ఏజెన్సీ ప్రాంత నియోజకవర్గాల్లో వైసీపీ పట్టుకోల్పోయే అవకాశం ఉందని రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు.

Read:Tirupati:ఎర్రచందనం దొంగల ఆటకట్టించిన పోలీసులు

Related posts

Leave a Comment