విలవిలల్లాడిన విజయవాడ
విజయవాడ
Vijayawada
విజయవాడలో గత మూడు రోజులుగా కురుస్తున్న కుండపో త వర్షాలకు రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. మురుగు నీరు రోడ్లపై ప్రవహిస్తోంది. వరద నీటిలో కార్లు, ద్విచక్రవాహనాలు కొట్టుకు పోయాయి. 30 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా విజయవాడ విలవిల్లా డింది. పాతబస్తీ, బందరు రోడ్డు, ఏలూరు రోడ్డు, జాతీయ రహదారి, ఆటోనగర్ లో భారీ వరద పోటెత్తిం ది. విజయవాడ సమీపంలోని జాతీయ రహదారుల నీటిలో చిక్కుకుపోయాయి.
మొగల్రాజ పురం వద్ద కొండచరియల విరిగి పడ్డాయి. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు. అధికారులు శిథి లాలను తొలగిస్తున్నారు. పడిపో యిన కొండరాళ్లను డ్రిల్లింగ్ చేసి, భారీ క్రేన్లతో శిథిలాల తొలగింపు ప్రక్రియ చేపట్టారు. భారీ వర్షాల కారణంగా కొండ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాం తాలకు తరలిస్తున్నారు.
మొగల్రా జపురం మృతుల కుటుంబాలకు ప్రభుత్వం 5 లక్షల పరిహారం ప్రకటించింది. ఎక్కడ చూసిన వరద నీటిలో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. విజయవాడలోని బుడమేరు వాగు పొంగటంతో నగర ఔటర్ పరిధిలో ఉన్న రాయనపాడు రైల్వే స్టేషన్ లోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. రైల్వే స్టేషన్ లో ఉన్న ప్రయాణికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఆరో బెటాలియన్ ఎస్డీఆర్ఎఫ్ రెస్కూ టీమ్ రంగంలోకి దిగి సహాయక చర్యలను చేపట్టింది.
2005 తర్వాత… బెజవాడ మునిగింది Vijayawada Floods | Eeroju News