ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి వంగలపూడి అనిత వద్ద ప్రైవేటు పీఏగా పనిచేస్తున్న సంధు జగదీష్‌పై వేటు పడింది. అవినీతి ఆరోపణల నేపథ్యంలో జగదీష్‌ను ఆ పోస్టు నుంచి తొలగించారు.
హోమ్ మంత్రి పీఏ పై వేటు
విజయవాడ, జనవరి 4
హోం మంత్రి అనిత పీఏ జగదీశ్‌పై వేటు.. అసలేం జరిగిందంటే..
ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి వంగలపూడి అనిత వద్ద ప్రైవేటు పీఏగా పనిచేస్తున్న సంధు జగదీష్‌పై వేటు పడింది. అవినీతి ఆరోపణల నేపథ్యంలో జగదీష్‌ను ఆ పోస్టు నుంచి తొలగించారు. ఇక, బదిలీలు, పోస్టింగులు, సిఫార్సుల కోసం జగదీష్ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా సెటిల్‌మెంట్ దందాలు కూడా చేస్తున్నారని కూడా పలువురు ఆరోపించారు. జగదీష్ వ్యవహారంపై ప్రభుత్వానికి, టీడీపీ అధిష్టానానికి ఫిర్యాదులు అందాయి. దీంతో జగదీష్ వేటు పడింది.ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి వంగలపూడి అనిత వద్ద ప్రైవేటు పీఏగా పనిచేస్తున్న సంధు జగదీష్‌పై వేటు పడింది. అవినీతి ఆరోపణల నేపథ్యంలో జగదీష్‌ను ఆ పోస్టు నుంచి తొలగించారు. వివరాలు.. వంగలపూడి అనిత వద్ద జగదీష్ ప్రైవేటు పీఏగా పనిచేస్తున్నారు. అయితే జగదీష్‌పై పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. బదిలీలు, పోస్టింగులు, సిఫార్సుల కోసం అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా సెటిల్‌మెంట్ దందాలు కూడా చేస్తున్నారని కూడా పలువురు ఆరోపిస్తున్నారు. పాయకరావుపేట నియోజకర్గంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు అనితను కలవడానికి వెళ్లిన సమయంలో కూడా ఇబ్బందులు ఎదుర్కొవాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలోనే మంత్రి అనిత తర్వాత తానే అన్నట్టుగా జగదీష్ వైఖరిపై టీడీపీ క్యాడర్ సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే జగదీష్‌పై ఎన్ని ఆరోపణలు, విమర్శలు వచ్చినప్పటికీ హోం మంత్రి అనిత మాత్రం వాటిని పట్టించుకోలేదు. దీంతో అనిత అండతోనే జగదీష్ ఇష్టానుసారంగా రెచ్చిపోతున్నాడనే ప్రచారం కూడా తెరమీదకు వచ్చింది. అయినప్పటికీ అనిత వైపు నుంచి ఎలాంటి చర్యలు లేవు. ఈ నేపథ్యంలో జగదీష్ వ్యవహారంపై ప్రభుత్వానికి, టీడీపీ అధిష్టానానికి ఫిర్యాదులు అందాయి. దీంతో జగదీష్‌ను అనిత పీఏ పోస్టు తొలగించారు. ఈ విషయాన్ని అనిత స్వయంగా కార్యకర్తల సమావేశంలో వెల్లడించడం గమనార్హం.
Read:Vijayawada:విజయవాడలో విశ్వ హిందూ పరిషత్ శంఖారావం