ఎప్పటినుంచో హిందూ దేవాలయాల పరిరక్షణ, నిర్వహణ హిందువుల చేతిలోనే ఉండాలంటూ డిమాండ్ చేస్తున్న విశ్వ హిందూ పరిషత్ విజయవాడలో ఆదివారం నాడు భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తోంది. ” హైందవ శంఖారావం ” పేరుతో విజయవాడ సమీపంలోని కేసరపల్లిలోని 30 ఎకరాల మైదానంలో సభ జరగబోతున్నట్టు VHP నేత గోకరాజు గంగరాజు తెలిపారు.
విజయవాడలో విశ్వ హిందూ పరిషత్
శంఖారావం
విజయవాడ, జనవరి 4
ఎప్పటినుంచో హిందూ దేవాలయాల పరిరక్షణ, నిర్వహణ హిందువుల చేతిలోనే ఉండాలంటూ డిమాండ్ చేస్తున్న విశ్వ హిందూ పరిషత్ విజయవాడలో ఆదివారం నాడు భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తోంది. ” హైందవ శంఖారావం ” పేరుతో విజయవాడ సమీపంలోని కేసరపల్లిలోని 30 ఎకరాల మైదానంలో సభ జరగబోతున్నట్టు VHP నేత గోకరాజు గంగరాజు తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం నుండి సాయంత్రం వరకూ ఈ సభ జరగబోతుంది. దీనికి వివిధ ప్రాంతాల నుంచి హిందూ సంఘాల ప్రతినిధులు హాజరవుతున్నారు. ఈ సభ ఉద్దేశం, ప్రధాన డిమాండ్లు ఇవే..!
1) హిందూ దేవాలయాల్లో, దేవదాయ ధర్మదాయ శాఖలో పనిచేస్తున్న అన్య మత ఉద్యోగులను తొలగించాలి
2) అన్ని దేవాలయాల్లోనూ పూజ ప్రసాద కైంకర్య సేవలన్నీ భక్తిశ్రద్ధలతో జరిగేలా చర్యలు చేపట్టాలి. దాన్ని ఉల్లంఘించే వారికి కఠిన శిక్షలు ఉండాలి.
3)దేవాలయాల ఔట్సోర్సింగ్ ఉద్యోగుల్లోనూ హిందువులు మాత్రమే ఉండాలి
4) దేవాలయాల ట్రస్ట్ బోర్డుల్లో రాజకీయాలకు సంబంధం లేని హిందూ భక్తులు మాత్రమే సభ్యులు గా ఉండాలి
5) దేవాలయాల నిర్వహణపై ధర్మాచార్యులు తయారు చేసిన నమూనా పద్ధతిలోనే విధివిధానాలు ఉండాలి
6) దేవాలయాల పరిసరాల్లోని దుకాణాలు అన్ని హిందువులకు మాత్రమే కేటాయించాలి
7) దేవాలయాల ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా గట్టి చర్యలు తీసుకోవాలి. ఇప్పటికే అన్యాక్రాంతమైన భూములను తిరిగి స్వాధీనం చేసుకోవాలి.
8) హిందూమతంపై హిందూ ఆలయాలపై కుట్రపూరితంగా దాడి చేసిన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలి
9) దేవాలయాల భూముల్లో అన్యమతస్తులు అక్రమంగా నిర్మించిన కట్టడాలను తొలగించాలి
10) దేవాలయాల ఆదాయాన్ని కేవలం ధర్మ ప్రచారానికి, సేవలకు మాత్రమే ఉపయోగించాలి. ప్రభుత్వ ప్రజా పాలన కార్యక్రమాలకు వినియోగించరాదు.
ఈ కీలక డిమాండ్లతో రేపు జరగబోయే హైందవ శంఖారావ సభకు భారీ ఎత్తున ప్రజలు రానున్నట్టు నిర్వాహకులు చెబుతున్నారు.
ఏపీలో 27 వేల ఎకరాల దేవాలయాల భూమి అన్యాక్రాంతం : VHP
కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకూ ఎన్నో వేల దేవాలయాలు దెబ్బతిన్నాయని అలాగే చాలా ఆలయాల జీర్ణోద్ధరణ జరగాల్సి ఉందని విశ్వ హిందూ పరిషత్ ప్రతినిధులు చెబుతున్నారు. ఒక్క ఏపీలోనే 27 వేల ఎకరాల హిందూ దేవాలయాల భూమి అన్యాక్రాంతమైందని అలాంటి భూములను తిరిగి స్వాధీనం చేసుకుని దేవాలయాలకు అప్పగించాలనేది తమ ప్రధాన డిమాండ్ గా ఏపీ విశ్వవిందు పరిషత్ నేత సత్యం చెబుతున్నారు. ఈ సభ కోసం వచ్చే హిందూ భక్తులు సోదరుల కోసం అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్టు విశ్వ హిందూ పరిషత్ చెబుతోంది.