Vijayawada:వారసుల సక్సెస్ రేటు ఎంత

ap political news

రాజకీయ పార్టీలు వారసులకు పగ్గాలు అప్పగించడం పరిపాటి. ప్రధానంగా ప్రాంతీయ పార్టీల్లో వారసులదే పార్టీలో ఆధిపత్యం.తండ్రులు, తాతలు స్థాపించిన పార్టీలను వీరు సక్రమంగా జనంలోకి తీసుకెళ్లి సక్సెస్ అవుతున్నారా? లేదా? అంటే సక్సెస్ రేటు మాత్రం తక్కువగానే ఉందని చెప్పాలి.

వారసుల సక్సెస్ రేటు ఎంత..

విజయవాడ, జనవరి 21
రాజకీయ పార్టీలు వారసులకు పగ్గాలు అప్పగించడం పరిపాటి. ప్రధానంగా ప్రాంతీయ పార్టీల్లో వారసులదే పార్టీలో ఆధిపత్యం.తండ్రులు, తాతలు స్థాపించిన పార్టీలను వీరు సక్రమంగా జనంలోకి తీసుకెళ్లి సక్సెస్ అవుతున్నారా? లేదా? అంటే సక్సెస్ రేటు మాత్రం తక్కువగానే ఉందని చెప్పాలి. దేశ వ్యాప్తంగా అనేక మంది ప్రాంతీయ పార్టీలను నెలకొల్పి తమ రాష్ట్రాల్లో అధికారాల్లోకి తెచ్చారు. కానీ వారసుల టైం వచ్చేసరికి మాత్రం పార్టీ వ్యవహారం మాత్రం తలకిందులవుతుంది. ఎక్కువ శాతం ఓటములు వారి ఖాతాల్లో పడుతున్నాయి. దీంతో వారసులు పార్టీని సక్రమంగా నడపలేకపోతున్నారని, తండ్రులే బెటర్ అన్న కామెంట్స్ పొలిటికల్ పార్టీల్లో ఉన్నాయి.. ఉత్తర్ ప్రదేశ్ లో సమాజ్ వాదీ పార్టీని ములాయం సింగ్ యాదవ్ నుంచి పగ్గాలు అందుకున్న తర్వాత అధికారంలోకి ఒకసారి మాత్రమే అఖిలేష్ యాదవ్ పార్టీని తీసుకు రాగలిగారు. ఎక్కువ సార్లు ఓటమి చవి చూశారు. తన తండ్రి స్థాపించిన పార్టీని సక్రమంగా నడపలేకపోయారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక బీహార్ లోనూ లాలూ ప్రసాద్ యాదవ్ రాష్ట్రీయ జనతా దళ్ నేతృత్వంలో పార్టీని అధికారంలోకి తేగలిగారు. పలుమార్లు ముఖ్యమంత్రిగా కూడా ఆయన చేశారు. కానీ ఆయన తనయుడు తేజస్వి యాదవ్ చేతుల్లోకి వచ్చిన తర్వాత అది పూర్తిగా ఓటమి అంచునే తిరుగుతూ ఉంది. ఇక కాంగ్రెస్ పార్టీని తీసుకుంటే ఇందిరాగాంధీ పరావాలేదనిపించారు. తర్వాత రాహుల్ గాంధీ ఓకేలా పార్టీని విజయం వైపు నడిపించారు. తర్వాత వారసురాలిగా సోనియా గాంధీ కూడా రెండు సార్లు అధికారంలోకి తేగలిగారు.

తర్వాత రాహుల్ గాంధీ నేతృత్వంలో రెండుసార్లు పార్టీ ఓటమి పాలయ్యింది.  దక్షిణాది రాష్ట్రాల్లో… మహారాష్ట్రలో శివసేన కూడా అంతే. బాల్ థాక్రే ఉన్న సమయంలో ఒక ఊపు ఊపిన శివసేన నేడు వారసుడు ఉద్ధవ్ థాక్రే హయాం వచ్చేసరికి డీలా పడింది. రేపు ఆయన వారసుడు ఆదిత్య ధాక్రే ఏ మేరకు పార్టీని నడుపుతాడన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒక్క ఒడిశాలో మాత్రమే తన తండ్రి స్థాపించిన పార్టీని ఐదు సార్లు అధికారంలోకి నవీన్ పట్నాయక్ తేగలిగారు. మొన్నటి ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. అలాగే కరుణానిధిని లెగసీని స్టాలిన్ ఒకసారి అందుకున్నారు. రెండోసారి ఆయన పార్టీని అధికారంలోకి తెస్తారా? అన్నది చూడాల్సి ఉంది. కర్ణాటకలోనూ దేవెగౌడ పలుమార్లు అధికారంలోకి తెచ్చిన జేడీయూను ఆయన తనయుడు కుమారస్వామి పార్టీని అధోగతి పాల్జేశారన్న కామెంట్స్ వినపడుతున్నాయి. ఏతా వాతా తేలిందేంటంటే దేశంలో అన్ని రాష్ట్రాల్లో వారసులను జనం పెద్దగా ఆదరించలేదు.  తెలుగు రాష్ట్రాల్లో… ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. ఎన్టీఆర్ వారసులు ఎవరూ రాజకీయాల్లోకి రాకపోయినా ఆయన వారసుడిగా చంద్రబాబు నాలుగుసార్లు అధికారంలోకి తెచ్చారు. అదే తన తండ్రి పేరు మీద అన్న తెలుగుదేశం పార్టీ పెట్టి ఎన్టీఆర్ తనయుడు హరికృష్ణ నెగ్గుకురాలేకపోయారు. ఇక కాంగ్రెస్ పార్టీని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి రెండుసార్లు పార్టీని అధికారంలోకి తేగలిగారు. ఆయన కుమారుడు జగన్ రెండుసార్లు ఓటమి పాలయి, ఒకసారి అధికారంలోకి తేగలిగారు. వైఎస్ కుమార్తె షర్మిల అయితే పార్టీ పెట్టడం, విలీనం చేయడం కూడా జరిగిపోయాయి. ఇక తాజాగా లోకేష్ కు కూడా ప్రమోషన్ ఇవ్వాలని, ప్రభుత్వంలో ప్రాధాన్యత ఇవ్వాలని వినిపిస్తున్న డిమాండ్ కూడా సీనియర్ నేతలు చేస్తుండటంతో వారసుల సక్సెస్ రేటుపై చర్చ జరుగుతుంది. వారసులు ఎక్కువగా రాజకీయంగా విఫలమవుతున్నారన్నదే పొలిటికల్ ఫిగర్స్ చెబుతుండగా, సీనియర్ నేతలు మాత్రం అవేమీ పట్టించుకోకుండా ప్రాపకం కోసం ప్రయత్నిస్తున్నారు. మరి చివరకు ఏం జరుగుతుందో చూడాలి.

Read:Ram Charan :మాట తప్పితే నేను రామ్‌చరణ్ కాను:దిల్ రాజుకు హామీ

Related posts

Leave a Comment