Vijayawada:ముదురుతున్న ఎండలు.. ఫిబ్రవరిలోనే ఇదేం సెగ సామీ? : చాలా సంవత్సరాల క్రితం వేసవి కాలం అంటే ఏప్రిల్, మే నెలలని చెప్పుకునే వారు. కానీ ఇప్పుడు మాత్రం ఫిబ్రవరి మొదటి వారంలోనే వేసవి మొదలైపోతుంది. ఏటా రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు పెరుగుదల నమోదవుతుంది. గత శతాబ్ద కాలంలో 2024 అత్యంత వేడి సంవత్సరంగా రికార్డైన సంగతి తెలిసిందే. 2025 కూడా అదే మాదిరిగా ఉంటుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.
ముదురుతున్న ఎండలు.. ఫిబ్రవరిలోనే ఇదేం సెగ సామీ?
విజయవాడ, ఫిబ్రవరి 3
చాలా సంవత్సరాల క్రితం వేసవి కాలం అంటే ఏప్రిల్, మే నెలలని చెప్పుకునే వారు. కానీ ఇప్పుడు మాత్రం ఫిబ్రవరి మొదటి వారంలోనే వేసవి మొదలైపోతుంది. ఏటా రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు పెరుగుదల నమోదవుతుంది. గత శతాబ్ద కాలంలో 2024 అత్యంత వేడి సంవత్సరంగా రికార్డైన సంగతి తెలిసిందే. 2025 కూడా అదే మాదిరిగా ఉంటుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. 2023 లో ఆరు నెలలు, 2024 లో ఏడాది పొడవునా రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.1901 నుంచి సేకరిస్తున్న సమాచారం ప్రకారం.. 2024 అత్యంత వేడి సంవత్సరంగా రికార్డు సృష్టించింది. ఉష్ణోగ్రత సగటున 0. 65 డిగ్రీలు పెరిగింది.గతేడాది జనవరి నుంచి ఫిబ్రవరి మధ్యలో సాధారణం కంటే 0.37 డిగ్రీలు పెరిగింది. ఈ ఏడాది జనవరిలో ఉష్ణోగ్రత సగటున 0.94 డిగ్రీలు పెరిగింది.1958 లో 1.17 , 1990 లో 0.97 డిగ్రీలు పెరిగాయి. ఆ తర్వాత ఇదే హైయ్యేస్ట్ గా తెలుస్తుంది.వాతావరణ మార్పుల ప్రభావం లానినా పరిస్థితుల పై పడుతోంది. లానినా పరిస్థితులు బలహీనపడడంతో శీతాకాలంలోనూ చలి తీవ్రత అసాధారణంగా లేదు. వచ్చే వారం నుంచి తూర్పు, మధ్య భారతంలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యే సూచనలున్నాయి. ఉత్తర, మధ్య ,తూర్పు భారతంలోని కొన్ని ప్రాంతాల్లో అయిదు డిగ్రీల వరకు పెరుగుతాయని నిపుణులు భావిస్తున్నారు.దక్షిణ ,వాయువ్య భారతంలోని కొన్ని మినహా అన్ని ప్రాంతాల్లోనూ వేడి వాతావరణం నెలకొంటుందని చెబుతున్నారు. కేరళలో జనవరిలోనే ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికంగా నమోదయ్యాయి.రాష్ట్రంలో రాబోయే రోజుల్లో గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతాయని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.రెండు రోజులుగా ఉక్కపోత ప్రారంభమైంది. కర్నూలు జిల్లా ఆదోని లో శుక్రవారం గరిష్ఠంగా 35.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. పల్నాడు, అన్నమయ్య, వైఎస్సాఆర్ , ప్రకాశం, నంద్యాల, అనకాపల్లి , శ్రీసత్యసాయి ,కర్నూలు,అనంతపురం,తిరుపతి, ఎన్టీఆర్ , ఏలూరు తదితర జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీలు పెరిగాయి.తెలుగు రాష్ట్రాల్లో కోస్తాంధ్రతో పోలీస్తే రాయలసీమ, తెలంగాణలో ఉక్కపోత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
Read:Trending Womens Collection | women fashion dresses