ఏపీలో ఆ కష్టాలకు ఇక చెల్లు. మనిషి మరణంలోనూ, తప్పని తిప్పలు కోకొల్లలు. మృతదేహాలను బైక్ పై, ఎద్దుల బండిపై, లేకుంటే ఒక్కరే ఎత్తుకొని తీసుకుపోయిన సంధర్భాలు ఎన్నో ఎన్నెన్నో మనకు కనిపిస్తాయి. ఆ కష్టాలకు చెక్ పెట్టేలా కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనితో మృతువు సమయంలోనూ, ఆర్థిక భారం మోయలేని కుటుంబాలకు ఊపిరి అందినట్లే.వైద్యశాలలో ఎవరైనా మరణిస్తే, ఆ మృతదేహాన్ని ఇంటికి తరలించాలంటే జేబులో డబ్బులు ఉండాలి.
మళ్లీ మహాప్రస్థానం అంబులెన్స్
విజయవాడ, డిసెంబర్ 31
ఏపీలో ఆ కష్టాలకు ఇక చెల్లు. మనిషి మరణంలోనూ, తప్పని తిప్పలు కోకొల్లలు. మృతదేహాలను బైక్ పై, ఎద్దుల బండిపై, లేకుంటే ఒక్కరే ఎత్తుకొని తీసుకుపోయిన సంధర్భాలు ఎన్నో ఎన్నెన్నో మనకు కనిపిస్తాయి. ఆ కష్టాలకు చెక్ పెట్టేలా కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనితో మృతువు సమయంలోనూ, ఆర్థిక భారం మోయలేని కుటుంబాలకు ఊపిరి అందినట్లే.వైద్యశాలలో ఎవరైనా మరణిస్తే, ఆ మృతదేహాన్ని ఇంటికి తరలించాలంటే జేబులో డబ్బులు ఉండాలి. అంతేకాదు మృతదేహం అనగానే, భారీ మొత్తం చెల్లించుకోవాలి. ఇక పేద కుటుంబీకులైతే, ఆ బాధ వర్ణనాతీతం. ఓ వైపు కుటుంబంలోని వ్యక్తి మృతి, మరోవైపు చేతిలో చిల్లిగవ్వ లేక ఎందరో కన్నీరు కార్చిన ఘటనలు కూడా ఉన్నాయి. కొందరు స్వయంగా మోసుకెళ్లిన ఘటనలు ఉండగా, మరికొందరు బైక్స్ పై, సైకిళ్లపై కూడా మృతదేహాలను తీసుకెళ్లిన రోజులు ఉన్నాయి. ఈ కష్టాలను గుర్తించిన ప్రభుత్వం మరోమారు మహా ప్రస్థానం అంబులెన్స్ లను ప్రవేశపెట్టింది.2014-19 టీడీపీ పరిపాలన కాలంలో మహా ప్రస్థానం అంబులెన్స్ పథకానికి శ్రీకారం చుట్టారు. ఆ తరువాత అనివార్య కారణాల వల్ల పథకం అమలు కాలేదు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం, ఈ సమస్య ప్రభుత్వం దృష్టికి వచ్చింది. వెంటనే ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సీఎం చంద్రబాబు మహా ప్రస్థానం అంబులెన్స్ ఏర్పాటుపై అధికారులతో సమీక్షించారు. వెంటనే పథకం అమలులోకి రావాలని నిర్ణయించిన ఏపీ సర్కార్, ఏడాదికి వీటి నిర్వహణకు రూ. 9.54 కోట్లు ఖర్చు పెట్టనుంది.అసలే మనిషి చనిపోయిన సమయంలో పడే రవాణా ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే వైద్యశాల నుండి మృతదేహాలను తరలించేందుకు కేవలం ఒక్క 108 కాల్ తో మహా ప్రస్థానం వాహనం ముందుకు రానుంది. దీనితో డబ్బులు అధికంగా వసూలు చేసే, అంబులెన్స్ సామ్రాజ్యానికి కొంత చెక్ పెట్టినట్లు చెప్పవచ్చు. మొత్తం మీద మహా ప్రస్థానం అంబులెన్స్ స్కీమ్ మంచిదేనంటున్నారు ఏపీ ప్రజలు.