Vijayawada:పార్టీ విధేయులకు పెద్ద పీట:సస్పెన్స్ వీడిపోయింది. దాదాపు నెల రోజులుగా టీడీపీ నుండి ఎవరు ఎమ్మెల్సీలు అవుతారంటూ జరుగుతున్న చర్చకు తెరపడింది . కావలి గ్రీష్మ, బీద రవిచంద్ర, భీటీ నాయుడు పేర్లను టీడీపీ తరపున ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సి అభ్యర్థులు గా ప్రకటించారు చంద్రబాబు నాయుడు. మొత్తం ఐదు సీట్లు ఖాళీ అవగా మూడు టిడిపి, ఒకటి జనసేన, మరొకటి బిజెపి తీసుకున్నాయి.
పార్టీ విధేయులకు పెద్ద పీట
విజయవాడ, మార్చి
సస్పెన్స్ వీడిపోయింది. దాదాపు నెల రోజులుగా టీడీపీ నుండి ఎవరు ఎమ్మెల్సీలు అవుతారంటూ జరుగుతున్న చర్చకు తెరపడింది . కావలి గ్రీష్మ, బీద రవిచంద్ర, భీటీ నాయుడు పేర్లను టీడీపీ తరపున ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సి అభ్యర్థులు గా ప్రకటించారు చంద్రబాబు నాయుడు. మొత్తం ఐదు సీట్లు ఖాళీ అవగా మూడు టిడిపి, ఒకటి జనసేన, మరొకటి బిజెపి తీసుకున్నాయి. జనసేన తరఫున ఇప్పటికే కొణిదెల నాగబాబు నామినేషన్ వేశారు. టిడిపి నుంచి చాలామంది ఆశావహులు పోటీపడినా చంద్రబాబు మాత్రం పై ముగ్గురికే ఎమ్మెల్సి లుగా స్థానం కల్పించారు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ ప్రతిభా భారతి కుమార్తె గా 2017లో టిడిపిలో చేరిన కావలి గ్రీష్మ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి గా, రాజాం నియోజకవర్గం ఇన్చార్జిగా పనిచేశారు. 2022లో ఒంగోలులో జరిగిన మహానాడు వేదికపై అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ గ్రీష్మ ఇచ్చిన స్పీచ్ టిడిపి క్యాడర్లో జోష్ నింపింది. అలాగే పార్టీ అధిష్టానం దృష్టిలో ఫైర్ బ్రాండ్ గా ఒక గుర్తింపుని తీసుకొచ్చింది.
“మిస్టర్ సీయం ” అంటూ జగన్ పై ఆమె విరుచుకుపడిన తీరు ఆమెను ఒక లీడర్ గా చాలామంది దృష్టిలో పడేలా పడేలా చేసింది. పార్టీ అధికారంలోకి రాగానే ఆమెకు కీలక పదవి గ్యారెంటీ అని అందరూ భావించారు. ఫైర్ బ్రాండ్ ఇమేజ్ కి తోడు మహిళా, దళిత అనే అంశాలు కూడా దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు ఎమ్మెల్సీ స్థానాన్ని గ్రీష్మ కు కేటాయించారు. బెందుల తిరుమల నాయుడు అలియాస్ బీటీ నాయుడు ఉమ్మడి కర్నూలు జిల్లాకు జుమల దిన్నె గ్రామానికి చెందిన టిడిపి నాయకుడు. 1994లో టిడిపిలో చేరిన బీటీ నాయుడు 1996 నుండి మూడు సార్లు రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశాడు. కడప అనంతపురం పార్లమెంటు నియోజకవర్గాల ఇన్చార్జిగా పనిచేసిన నాయుడు 2009, 2014 ఎన్నికల్లో కర్నూలు నుండి లోక్ సభకు పోటీ చేసి ఓడిపోయాడు. అయినా పార్టీ కి ఆయన చేసిన సేవలను గుర్తించిన చంద్రబాబు 2019లో టిడిపి నుండి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. ఇప్పుడు మరోసారి దాన్ని కంటిన్యూ చేస్తూ శాసనమండలికి ఎంపిక చేశారు తొలిసారిగా ఛాన్స్ దక్కించుకున్నారు గ్రీష్మ. ఆమె తల్లి ప్రతిభాభారతి సీనియర్ నేత.
1983 నుంచి 1999 వరకు వరుసగా ఎమ్మెల్యేగా గెలుస్తూ వచ్చారు. ఉమ్మడి ఏపీ శాసనసభ మహిళా స్పీకర్ గా గుర్తింపు దక్కించుకున్నారు. అయితే ఆమె 2004, 2009, 2014లో ఓడిపోతూ వచ్చారు. అందుకే చంద్రబాబు 2019, 2024 ఎన్నికల్లో ప్రతిభా భారతికి ఛాన్స్ ఇవ్వలేదు. అయితే తన బదులు కుమార్తె గ్రీష్మకు అవకాశం కల్పించాలని ఆమె చాలాసార్లు కోరారు. ఇప్పుడు ఎమ్మెల్సీ రూపంలో అవకాశం కల్పించారు చంద్రబాబు.2019లో వైసీపీఅధికారంలోకి వచ్చింది. తెలుగుదేశం పార్టీ నేతలపై విరుచుకుపడేది. ఆ సమయంలోనే టిడిపి మహానాడు తో పార్టీ శ్రేణులు యాక్టివ్ అయ్యాయి. ప్రకాశం జిల్లాలో ఏర్పాటు చేసిన మహానాడు టిడిపి పరిస్థితిని మార్చింది. మహానాడు వేదికగా కావలి గ్రీష్మ ప్రసంగం ఆకట్టుకుంది. ఏకంగా ఆమె తొడగొట్టి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి గట్టి సవాల్ చేశారు. మండలి లో అటువంటి ఫైర్ బ్రాండ్ మహిళా నేత ఉండాలని చంద్రబాబు భావించారు.
అందుకే ఎమ్మెల్సీగా ఛాన్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది..ఉమ్మడి నెల్లూరు జిల్లా ఇసుకపల్లె గ్రామానికి చెందిన బీద రవిచంద్ర యాదవ్ యాదవ్ కు బీసీ నాయకుడుగా మంచి గుర్తింపు ఉంది. నెల్లూరు జిల్లా టిడిపి అధ్యక్షుడిగా, రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడిగా, ఆంధ్రప్రదేశ్ ఆక్వా అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం రవి చంద్రకు ఉంది.2015లో తొలిసారి ఎమ్మెల్సీ అయ్యారు. నెల్లూరు జిల్లాలో సోమిరెడ్డి,నారాయణ లాంటివారు ఉన్నా పార్టీ వ్యవహారాలు రవిచంద్రకే అప్పగించేవారు. ఆనం రామనారాయణ రెడ్డి పార్టీలో చేరాక మాత్రం వారిరువురి మధ్య అంతగా పొసగడం లేదన్న వార్తలు ఉన్నాయి. అయితే అటు చంద్రబాబు ఇటు లోకేష్ ఇద్దరికీ సన్నిహితుడు కావడం 1999 నుండి పార్టీని అంటి పెట్టుకుని ఉండడం బీద రవిచంద్ర కు కలిసి వచ్చింది. దానితో చంద్రబాబు పార్టీ తరఫున ఎమ్మెల్సీ అభ్యర్థిగా బీద రవిచంద్ర ను ఎంపిక చేశారు. ఈసారి మూడు స్థానాలను వెనుకబడిన బలహీన వర్గాలకే కేటాయించాలని చంద్రబాబు భావించడంతో దళిత బిసి వర్గాల నుండి అభ్యర్థులను ఎంపిక చేసినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.