Vijayawada:కొడాలి నాని అరెస్ట్ తప్పదా

Kodali Nani must be arrested

కొత్త సంవత్సరంలో మాజీ మంత్రి కొడాలి నాని అరెస్టు తప్పదని విశ్లేషణలు ఉన్నాయి. సరిగ్గా ఇదే సమయంలో ఆయన ప్రధాన అనుచరుడిని గుడివాడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

కొడాలి నాని అరెస్ట్ తప్పదా

విజయవాడ, జనవరి 2
కొత్త సంవత్సరంలో మాజీ మంత్రి కొడాలి నాని అరెస్టు తప్పదని విశ్లేషణలు ఉన్నాయి. సరిగ్గా ఇదే సమయంలో ఆయన ప్రధాన అనుచరుడిని గుడివాడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన నుంచి కీలక వాంగ్మూలం సేకరించినట్లు సమాచారం.మాజీ మంత్రి కొడాలి నాని అరెస్టు తప్పదా? ఆయనను ఏ క్షణంలోనైనా పోలీసులు అరెస్టు చేస్తారా? ఆయన అనుచరుడు కీలక వాంగ్మూలం ఇచ్చారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు అలానే ఉన్నాయి. తాజాగా కొడాలి నాని ప్రధాన అనుచరుడు కాలిని గుడివాడ పోలీసులు అరెస్టు చేశారు. మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు షాపుపై పెట్రోల్ దాడి కేసులో కాళీ అరెస్టయ్యారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఖాళీ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో గుడివాడ పోలీసులు అస్సాం వెళ్లి మరి కాలిని అరెస్టు చేశారు. ఇప్పటికే ఈ కేసులో 13 మందిని అరెస్టు చేయగా.. వారంతా ఇప్పటికే నెల్లూరు జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. తాజాగా ఖాళీని అరెస్టు చేశారు. విచారణ చేపడుతున్నారు. అయితే తాను మాజీ మంత్రి కొడాలి నాని ఆదేశాల మేరకు అలా చేశానని కాళీ చెప్పినట్లు సమాచారం. దీంతో కొడాలి నాని చుట్టూ ఉచ్చు బిగిస్తున్నట్లు తెలుస్తోంది.వైసిపి ప్రభుత్వ హయాంలో గుడివాడలో టిడిపి కార్యాలయం పై దాడి జరిగింది. ఆ పార్టీ నేత రావి వెంకటేశ్వరరావు పై కూడా దాడి జరిగింది. ఈ రెండు కేసుల్లో కాళీ ప్రధాన నిందితుడిగా ఉన్నారు. 13 మంది వైసీపీ కార్యకర్తలు ఈ దాడిలో పాల్గొన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ కేసులో పురోగతి పెరిగింది. ఆ 13 మంది వైసీపీ కార్యకర్తల అరెస్టు జరిగింది. వారంతా ఇప్పుడు రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. ఇప్పుడు సూత్రధారిగా భావిస్తున్న కాళీని సైతం అస్సాంలో అదుపులోకి తీసుకున్నారు గుడివాడ పోలీసులు. ఆయనను విచారిస్తున్నారు.

ఎవరి ప్రమేయం ఉందా? ఎవరు ప్రోత్సహించారు? అన్న కోణంలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.2022 డిసెంబర్ 26న వంగవీటి మోహన్ రంగా వర్ధంతి. గుడివాడలో కార్యక్రమాలు నిర్వహించేందుకు టిడిపి నేతలు సిద్ధమయ్యారు. అయితే డిసెంబర్ 25న టిడిపి నేత రావి వెంకటేశ్వరరావుకు కొడాలి నాని ప్రధాన అనుచరుడు అయిన కాళీ ఫోన్ చేసి హెచ్చరించారు. రంగా వర్ధంతి నిర్వహిస్తే ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చారు. కార్యక్రమాన్ని నిర్వహించి తీరుతామని రావి వెంకటేశ్వరరావు చెప్పగా.. చంపేస్తానని కాళీ బెదిరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అదే రోజు వెంకటేశ్వరరావు కు చెందిన బట్టల దుకాణం పై కొడాలి నాని అనుచరులు పెట్రోల్ ప్యాకెట్లతో దాడి చేశారన్న ఆరోపణలు కూడా వినిపించాయి. ఈ క్రమంలోనే టిడిపి కార్యాలయానికి నిప్పంటించబోతుండగా పోలీసులు అడ్డుకోవడంతో ప్రమాదం తప్పింది.వైసిపి హయాంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులకు ఫిర్యాదు చేస్తే అప్పట్లో పట్టించుకోలేదు. ఓటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మరోసారి ఫిర్యాదు అందడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కొడాలి నాని అనుచరులపై వరుసగా కేసులు నమోదు చేశారు. ఇటీవల 13 మందిని అరెస్టు చేయగా.. ప్రధాన అనుచరుడు కాళీ దొరకలేదు. తాజాగా అరెస్టు చేయగా.. ఈ మొత్తం ఎపిసోడ్లో కొడాలి నాని పాత్ర పై పోలీసులు ఆరా తీస్తున్నట్లు సమాచారం. అయితే కాళీ నుంచి కీలక వాంగ్మూలం తీసుకున్న పోలీసులు కొడాలి నానిని అరెస్టు చేయబోతున్నట్లు ప్రచారం నడుస్తోంది. మరి అందులో ఎంత వాస్తవం ఉందో తెలియాలి.
Read:Kadapa:నెలకో జిల్లాకు జనసేనాని

Related posts

Leave a Comment