ఏపీ ప్రస్తుత డీజీపీగా ఉన్న సీహెచ్ ద్వారకా తిరుమలరావు ఈ నెల 31న పదవీ విరమణ చేయనున్నారు. దీంతో కొత్త పోలీస్ బాస్ ఎవరనేది ఆసక్తికరంగా మారింది. తిరుమలరావు ప్రస్తుతం డీజీపీతో పాటుగా ఆర్టీసీ ఎండీగా పూర్తి అదనపు బాధ్యతల్లో ఉన్నారు.
ఏపీ కొత్త డీజీపీ రేసులో ముగ్గురు
విజయవాడ, జనవరి 24
ఏపీ ప్రస్తుత డీజీపీగా ఉన్న సీహెచ్ ద్వారకా తిరుమలరావు ఈ నెల 31న పదవీ విరమణ చేయనున్నారు. దీంతో కొత్త పోలీస్ బాస్ ఎవరనేది ఆసక్తికరంగా మారింది. తిరుమలరావు ప్రస్తుతం డీజీపీతో పాటుగా ఆర్టీసీ ఎండీగా పూర్తి అదనపు బాధ్యతల్లో ఉన్నారు. ఆయన పదవీ విరమణ చేసిన తర్వాత ఆర్టీసీ ఎండీ పోస్టులో కొనసాగించే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. మరి డీజీపీ ఎవరనే ప్రశ్నకు ప్రముఖంగా ముగ్గురు పేర్లు వినిపిస్తున్నాయి. వీరిలో సర్కార్ ఎవరిని ఎంపిక చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది..డీజీపీ రేసులో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు హరీశ్‌కుమార్ గుప్తా.. ప్రస్తుతం విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ డీజీగా పనిచేస్తున్న ఆయన గతంలోనూ డీజీపీగా పనిచేశారు.. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల సమయంలో.. అప్పటి డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డిని ఎన్నికల సంఘం బదిలీ చేసింది.ఆయన స్థానంలో 1992 బ్యాచ్‌కు చెందిన హరీశ్ కుమార్ గుప్తాను ఎన్నికల సంఘం డీజీపీగా నియమించింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో ఆయన ఆ పోస్టులోనే కొనసాగారు. ఆ తర్వాత కూటమి ప్రభుత్వం హరీష్‌కుమార్ గుప్తా స్థానంలో.. సీహెచ్ ద్వారకా తిరుమలరావును డీజీపీగా నియమించింది. ఇప్పుడు ద్వారకా తిరుమలరావు రిటైర్మెంట్ సమీపిస్తుండడంతో మళ్లీ హరీశ్‌కుమార్ గుప్తాకు చాన్స్ ఇస్తారనే వార్త పోలీస్ సర్కిల్లో చక్కర్లు కొడుతోంది.అయితే సీనియార్టీ ప్రకారం చూసుకుంటే.. 1991 బ్యాచ్‌కు చెందిన అగ్నిమాపకశాఖ డైరెక్టర్ జనరల్ మాదిరెడ్డి ప్రతాప్ మొదటి స్థానంలోఉన్నారు. హరీశ్ కుమార్ గుప్తా రెండో స్థానంలో ఉన్నారు. మాదిరెడ్డి ప్రతాప్ గతంలో జగన్ హయాంలో ఆర్టీసీ ఎండీగా పని చేశారు. ఆ సమయంలోనే ఓ వివాదంతో విచారణను ఎదుర్కొన్నారు.. కూటమి ప్రభుత్వం వచ్చాక ఆ విచారణను నిలిపివేసింది.ఇవన్నీ పక్కన పెడితే ప్రస్తుత డీజీపీ ద్వారకా తిరుమలరావునే కొనసాగిస్తారనే టాక్ కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో వినిపిస్తోంది.. ఇప్పటికైతే ప్రభుత్వం నుంచి ఆ దిశగా ఎలాంటి ప్రతిపాదనలు కేంద్రానికి వెళ్లలేదు. ఇన్ని గాసిప్స్ మధ్య సీనియర్ ఐపీఎస్ రవి శంకర్ అయ్యన్నార్ పేరు కూడా డీజేపీ రేసులో తెరమీదకు వచ్చింది..సాధారంగా సీనియార్టీ, సుదీర్ఘ సేవలను పరిగణలోకి తీసుకొని డీజీపీని ఖరారు చేస్తారు. అన్ని సమీకరణలు పరిశీలించాక విజయనగరం జిల్లాకు చెందిన హరీశ్ కుమార్ గుప్తా వైపే చంద్రబాబు మొగ్గుచూపుతున్నారనేది బలంగా వినిపిస్తోన్న టాక్.. ప్రస్తుతం దావోస్ పర్యటనలో ఉన్న చంద్రబాబు రాష్ట్రానికి తిరిగి వచ్చిన తర్వాత డీజీపీ నియామకంపై అధికారికంగా నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.
Read:Visakhapatnam:రిపబ్లిక్ పరేడ్ లో ఏటికొప్పాక బొమ్మలు