Vijayawada:అరెస్ట్ల్ లకు సిద్దంగా ఉండండి

Be prepared for arrests

Vijayawada:అరెస్ట్ల్ లకు సిద్దంగా ఉండండి:వైసీపీ అధినేత వైఎస్ జగన్ పార్టీ నేతలకు కీలక సందేశం ఇచ్చినట్లయింది. మిగిలిన నేతలు కూడా జైలుకు వెళ్లే అవకాశాలు లేకపోలేదని, మానసికంగా సిద్ధమవ్వాలని కూడా ఆయన పరోక్షంగా చెప్పినట్లయింది. నిన్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పరామర్శించేందుకు విజయవాడ జిల్లా జైలుకు వచ్చిన ఆయన మాట్లాడిన మాటలు ఈ సంకేతాలు పంపినట్లయింది.

అరెస్ట్ల్ లకు సిద్దంగా ఉండండి..

విజయవాడ, ఫిబ్రవరి 20
వైసీపీ అధినేత వైఎస్ జగన్ పార్టీ నేతలకు కీలక సందేశం ఇచ్చినట్లయింది. మిగిలిన నేతలు కూడా జైలుకు వెళ్లే అవకాశాలు లేకపోలేదని, మానసికంగా సిద్ధమవ్వాలని కూడా ఆయన పరోక్షంగా చెప్పినట్లయింది. నిన్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పరామర్శించేందుకు విజయవాడ జిల్లా జైలుకు వచ్చిన ఆయన మాట్లాడిన మాటలు ఈ సంకేతాలు పంపినట్లయింది. కొడాలి నాని, దేవినేని అవినాష్ పేర్లను ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించి చంద్రబాబు, లోకేష్ లు వీరి అరెస్ట్ లకు కూడా సిద్ధపడతారని చేసిన కామెంట్స్ ఇప్పుడు పార్టీలోనే కాదు బెజవాడ రాజకీయాల్లోనూ చర్చనీయాంశమయ్యాయి. సొంత సామాజికవర్గం నేతలు తమకు మద్దతు ఇవ్వకపోతే చంద్రబాబు ఊరుకోరని, అరెస్ట్ చేస్తారని జగన్ అన్నారంటే తర్వాత లిస్ట్ లో వీరిద్దరూ ఉన్నట్లేనని పార్టీ నేతలు కూడా దాదాపుగా ఫిక్స్ అయినట్లే కనపడుతుంది.. అయితే అరెస్ట్ అవ్వడం వంటివి సాధారణంగానే చూడాలని జగన్ పర్యటనలో కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు కూడా అదే అర్ధం చెబుతున్నాయి. అంటే తాము అరెస్ట్ కు సిద్ధంగా ఉన్నామని వారు చెబుతున్నారు. తాను యాక్టివ్ గా లేనని ప్రచారం జరుగుతుందని, అజ్ఞాతంలోకి వెళ్లానని కొందరు పనిగట్టుకుని సోషల్ మీడియాలో, ప్రధాన మీడియాల్లో వార్తలు పోస్టు చేస్తున్నారని, కానీ అధికారంలో లేనప్పుడు యాక్టివ్ గా ఎలా ఉంటామని ఆయన ప్రశ్నించారు. తన చుట్టూ ఉన్న న్యాయవాదులను చూపించి వీరున్నారుగా వారు చూసుకుంటారులే అని అన్నారు. రెడ్ బుక్ అనేది తాను చూడలేదని, అయినా ఏ బుక్కు తమను ఏం చేయలేమని, తాము జగన్ ను వదిలి వేరే పార్టీలోకి అడుగు పెట్టే ప్రసక్తి లేదని కొడాలి నాని స్పష్టం చేశారు.మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో దేవినేని అవినాష్ కూడా నిందితుడిగా ఉన్నారు. అవినాష్ పై కేసు నమోదు చేసిన పోలీసులు లుక్ అవుట్ నోటీసులు కూడా జారీ చేశారు. దేవినేని అవినాష్ గత ఎన్నికలకు ముందు టీడీపీ నుంచి వైసీపీలోకి చేరి విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అవినాష్ తండ్రి దేవినేని నెహ్రూ పేరిట ఉన్న రహదారికి తిరిగి మహానాడు రోడ్డుగా ప్రభుత్వం నామకరణం చేసింది. ఇలా దేవినేని అవినాష్ విషయంలో కొంత అధినాయకత్వం ఆగ్రహంతో ఉందని, త్వరలోనే ఆయన కూడా అరెస్ట్ అవుతారని జగన్ చెప్పకనే చెప్పినట్లయింది. దీంతో బెజవాడ వైసీపీ నేతలు ఒక్కొక్కరుగా జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని చెప్పడంతో దేవినేని కూడా రెడీ అవ్వాల్సిందే. . వీరే కాదు వైసీపీలో కీలక నేతలు, గత ప్రభుత్వ హయాంలో అప్పటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన వారితో పాటు సామాజికవర్గంగా బలంగా ఉన్న నేతలను కూటమి ప్రభుత్వం టార్గెట్ చేస్తుందని వైసీపీ నేతలు ముందుగానే అంచనా వేసుకున్నారు. అందుకు తగినట్లుగానే వారు మానసికంగా సిద్ధమయ్యారు. నందిగం సురేష్ తో మొదలయిన అరెస్ట్ ల పర్వం ఇక ఆగదని కూడా తెలుసు. అందుకు రెడీ అయిపోవడం మంచిదన్న భావనకు వచ్చారు. అరెస్టయి జైలుకు వెళ్లి వస్తే సానుభూతి వస్తుందని, తమకు వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ ఆ నియోజకవర్గంలో ఖచ్చితంగా దక్కుతుందని కూడా నేతలు సిద్ధమవుతున్నారు. అందుకే నాలుగు గోడల మధ్య నాలుగైదు నెలలు ఉంటే పోయేదేముంది? అన్న భావనకు వచ్చినట్లే కనపడుతుంది.

Read more:Vijayawada:అప్ డేట్ కానీ సర్వర్లు

Related posts

Leave a Comment