విజయసాయిరెడ్డికి ఇంటి పోరేనా
నెల్లూరు, జూలై 17 (న్యూస్ పల్స్)
Vijayasai Reddy
పార్టీలో సాధారణ ఎంపీ, ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులు ఆయన్ని టార్గెట్ చేయలేరు. ఒకవేళ అలాంటి వారు చేసినా.. వారి వెనక ఎవరిదో పెద్ద హస్తమే ఉంటుంది. అయితే.. ఇప్పుడే కాదు.. గతంలో కూడా ఓసారి విజయసాయి రెడ్డిని జగన్ పక్కన పెట్టారనే వార్తలు వచ్చాయి. వార్తలు మాత్రమే కాదు.. అప్పట్లో పార్టీలో విజయసాయిరెడ్డి ప్రియారిటీ చూస్తే అదే అనిపిస్తోంది. పార్టీ ఉత్తరాంధ్ర బాధ్యతల నుంచి ఆయన్ని తప్పించారు. ఆ బాధ్యతలను వైవీ సుబ్బారెడ్డికి ఇచ్చారు. ఇదంతా సజ్జల చేయించారనే అనుమానాలు కూడా అప్పట్లో వచ్చాయి. అంతేకాదు. పార్టీలో ప్రియారిటీ తగ్గిందని గ్రహించి విజయసాయిరెడ్డి కూడా తన వైఖరి మార్చుకున్నారని చాలా మంది చెప్పారు.
చిన్న అవకాశాన్ని కూడా వదులుకోకుండా ట్విట్టర్లో టీడీపీపై, చంద్రబాబుపై విరుచుకుపడిన విజయసాయి రెడ్డి ఆ మధ్య సైలంట్ అయ్యారు. తన విమర్శల పదును తగ్గించారు. గత ప్రభుత్వాన్ని ప్రశంసించడం తప్పా.. పెద్ద ప్రతిపక్షాలపై విమర్శల జోలికి వెళ్లలేదు. తన పరిధిలో ఉన్న పని తాను చేసుకుంటూ పోయేవారు. అయితే.. ఎన్నికలు దగ్గరపడేసరికి మరోసారి జగన్.. విజయసాయిరెడ్డికి ప్రాధాన్యత ఇచ్చినట్టు కనిపించారు. కృష్ణా, గుంటూరు, నెల్లూరు జిల్లాల బాధ్యతలు ఆయనకే ఇచ్చారు. దీంతో మళ్లీ యాక్టివ్ అయ్యారు విజయసాయిరెడ్డి. అయితే.. అప్పుడు కూడా విజయసాయిరెడ్డపై సజ్జల రామకృష్ణారెడి కుట్రలు చేశారని అనుమానాలు ఉన్నాయి. నెల్లూరు జిల్లాలో వైసీపీ నేతలంతా ఖాళీ అయిపోయారు.
అసలు పోటీ చేయడానికి కూడా ఎవరూ లేరు. అలాంటి టైంలో నెల్లూరు ఎంపీగా జగన్ విజయసాయిరెడ్డి పేరు ప్రతిపాదించారు. గెలిచే అవకాశం లేనపుడు ఆయన పేరు తెరపైకి తీసుకొని రావడం నిజంగా ఆయనను రాజకీయంగా తొక్కేడమేనని చాలా మంది అన్నారు. ఈ ప్రతిపాదన వెనుక సజ్జల ఉన్నారన అప్పుడు టాక్ నడించింది. ఎట్టకేలకు విజయసాయిరెడ్డే స్వయంగా తనపై వైసీపీ నేతలు కూడా కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. దీంతో.. ఇప్పుడు మరోసారి సజ్జల వైపే అందరి చూపు పడింది.విజయసాయిరెడ్డి మరో విషయం కూడా చెప్పారు. తన సొంతంగా ఓ ఛానెల్ పెడుతున్నానని ఆయన అన్నారు. రెండేళ్ల క్రితమే పెట్టాలనుకున్నానని.. జగన్ వద్దని చెప్పడంతో ఆగిపోయానని చెప్పారు.
ఇక్కడే మరో అనుమానానికి కూడా తావిస్తుంది. తమకు అనుకూలంగా ఓ ఛానెల్ వస్తుందంటే జగన్ ఎందుకు వద్దనుకున్నారు? అనేది ప్రశ్న. విజయసాయిరెడ్డిని ఎందుకు అడ్డుకున్నారు అనే అనుమానాలు వస్తున్నాయి. రెండేళ్ల క్రితం అంటే.. వైసీపీలో విజయసాయిరెడ్డి ప్రియారిటి తగ్గిందనే ప్రచారం జరుగుతున్నప్పటి మాట. అంటే.. ప్రియారిటీ తగ్గింది కాబట్టే విజయసాయిరెడ్డి సొంతగా ఛానెల్ పెట్టి తనేంటో చూపించాలి అనుకున్నారు. అదే సమయంలో విజయసాయిరెడ్డి ఛానెల్ పెడితే.. తనకు ఇబ్బంది అవుతుందని జగన్ భావించి ఉంటారు. అందుకే వద్దని అని ఉంటారని ఇప్పుడు ప్రచారం జరుగుతోంది. మొత్తానికి విజయసాయిరెడ్డి పెట్టిన ఒక ప్రెస్ మీట్ ఎన్నో సంచలనాలకు దారి తీసింది.
బీజేపీలోకి విజయసాయిరెడ్డి… | Vijayasai Reddy joins BJP | Eeroju news