విడదల రజనీ ఫ్రస్టేషన్ పీక్స్…
గుంటూరు, ఫిబ్రవరి 13, (న్యూస్ పల్స్)
మాజీ మంత్రి విడదల రజినీ విపరీతమైన ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నట్లు కనిపిస్తున్నారు. జగన్ కేబినెట్‌లో మినిస్టర్‌గా ఉన్నప్పుడు కూడా ఎప్పుడూ పరుష పదజాలం వాడని ఆమె ఇటీవల సవాళ్లు విసురుతూ.. తన రాజకీయ గురువు ప్రత్తిపాటి పుల్లారావుని టార్గెట్ చేస్తుండటం అభద్రతాభావంతోనే అన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. వైసీపీ హయాంలో పలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న ఆమె ఓటమి తర్వాత పార్టీ మారడానికి ప్రయత్నించారన్న ప్రచారం జరిగింది. అయితే అది సాధ్యపడక పోవడంతో ఇప్పుడు కేసుల భయంతో సవాళ్ల పర్వానికి తెర లేపుతున్నారంటున్నారు. అసలు ఆమెలోని కొత్త కోణంపై జరుగుతున్న చర్చేంటి.తనపై కేసు నమోదు అవ్వగానే మాజీ మంత్రి విడదల రజినీ వాయిస్ సడన్‌గా మారిపోయింది. మునుపెన్నడూ లేని విధంగా తెగ ఆవేశపడిపోతున్నారామె.. 2019 ఎన్నికల్లో చిలకలూరిపేట నుంచి టీడీపీ టికెట్ ఆశించిన ఆమె.. అది దక్కక పోవడంతో వైసీపీ బాట పట్టారు. అప్పటికే చిలకలూరిపేటలో టీడీపీ నుంచి సీనియర్ నేత, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు చక్రం తిప్పుతున్నారు. రజినీని టీడీపీలోకి తీసుకొచ్చి ప్రోత్సహించింది ఆయనే.. అలాంటి రాజకీయ గురువుపై తిరుగుబాటు చేసిన రజినీ వైసీపీ నుంచి పోటీ చేసి ప్రత్తిపాటి పుల్లారావు లాంటి దిగ్గజాన్ని ఓడించడం అప్పట్లో పెద్ద సంచలనం రేపింది..మొదటి సారి ఎమ్మెల్యేగా గెలిచిన రజినీకి మంత్రివర్గ విస్తరణలో జగన్ కేబినెట్ బెర్త్ ఇచ్చారు. మంత్రిగా పని చేసినప్పుడు కూడా రజినీ ఏనాడు ప్రత్యర్థులపై పరుష పదజాలంతో విరుచుకు పడలేదు.
అయితే ఆమె తన పీఏ, కుటుంబ సభ్యులతో కలిసి అవినీతికి పాల్పడి పెద్దఎత్తున కూడపెట్టుకున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఎన్నికల్లో ఓటమి తర్వాత వివిధ ఆరోపణలకు సంబంధించి ఆమె నగదు తిరిగి చెల్లించి సెటిల్‌మెంట్లు చేసుకున్నారంట. ఆ క్రమంలో చిలకలూరిపేట పోలీస్ స్టేషన్‌లో రజినిపై.. ఇటీవల ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు అయ్యింది. టీడీపీ అధ్యక్షుడు పిల్లి కోటి ఇచ్చిన ఫిర్యాదు మేరకు 2019 లో సీఐగా ఉన్న సూర్యనారాయణతో పాటు, రజిని పీఏలు నాగఫణీంద్ర, రామకృష్ణపై కూడా కేసు నమోదు చేశారు.తనపై కేసుల నమోదు కావడానికి ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు కారణమని భావిస్తున్న రజినీ.. ఓ రేంజ్‌లో చెలరేగి పోయారు. టైమ్ వచ్చినప్పడు అందరి లెక్కలూ తేలుస్తానని ఆమె అన్నారు. గత ఎన్నికల్లో వైసీపీ అధిష్టానం ఆదేశాల మేరకు తాను… చిలకలూరిపేట వదలి వెళ్లానని.. అంతే తప్ప.. నియోజకవర్గాన్ని వీడే ప్రసక్తే లేదన్నారు మాజీమంత్రి. 30 ఏళ్ల పాటు తాను అక్కడే ఉంటానంటూ ఘాటుగానే స్పందించారు. అందరికీ ఫ్యామిలీలు ఉన్నాయనే విషయాన్ని పుల్లారావు గుర్తు పెట్టుకోవాలని వ్యాఖ్యానించారు రజినీ. రాజకీయాల నుంచి రిటైర్ అయిపోయినా.. వారిని వదలనంటూ వార్నింగ్ కూడా ఇచ్చేశారు. దానిపై ప్రత్తిపాటి కూడా ధీటుగానే స్పందించారరజినీ ఆ స్థాయిలో సవాలు విసరడం పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ డిబేట్‌గా మారింది. మునుపెన్నడూ లేని విధంగా రజినీ అలా చెలరేగిపోవడంపై వైసీపీ నేతలు కూడా ఆశ్చర్యపోతున్నారంట.. గత ఎన్నికల్లో చిలకలూరిపేట నియోజకవర్గం కాకుండా.. రజినీని గుంటూరు నుంచిపోటీ చేయించారు జగన్. అభ్యర్థుల అందరిపైనా సర్వేలు చేయించిన వైసీపీ అధినేత.. రాష్ట్రవ్యాప్తంగా పలువురి స్థానాలను మార్చేశారు.
రజినీ చిలకలూరిపేటలో గెలవడం అసాధ్యమని సర్వేల్లో తేలడంతో ఆమెను గంటూరు వెస్ట్‌కి మార్చినా ఆమె గట్టెక్క లకపోయారు.రజిని మంత్రిగా ఉన్న టైమ్‌లో మైనింగ్, ఇసుక తరలింపులో దందాలు నడిచారన్న ఆరోపణలున్నాయ. తన పీఏల సాయంతో క్రషర్ యాజమానులను బెదిరించారని.. పెట్రోలు బంకులను కూడా ఆమె లాక్కున్నారంటూ ఆరోపణలు వచ్చాయి. దాంతో పాటు నాడు తెలుగుదేశం నేతలపై కేసులు పెట్టించారని.. తద్వారా ఎంతోమంది కార్యకర్తలు కూడా ఇబ్బంది పడ్డారని.. టీడీపీ ఆరోపిస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. చాలామందిపై కేసులు నమోదు అవుతున్న నేపథ్యంలో రజినీపైనా కేసు పెట్టడంతో ఆమె తీవ్ర ఆగ్రహానికి గురయ్యారనే టాక్ నడుస్తోంది.30ఏళ్లు చిలకలూరిపేటలోనే రాజకీయం చేస్తానని.. ప్రత్తిపాటి పుల్లారావు ఎక్కడున్నా వదిలేది లేదంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడం హాట్ టాపిక్‌గా మారింది. రజినీ ఆ స్థాయిలో ఫైర్ అవ్వడానికి భవిష్యత్తు ఆగమ్య గోచరంగా మారడమే కారణమంటున్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత కొంత కాలం సైలెంట్‌గా ఉన్న విడదల రజినీ.. రాజకీయ అండ కోసం జనసేనలో చేరడానికి ప్రయత్నించారంట. ప్రస్తుతం జనసేనలో ఉన్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ద్వారా జనసేనలోకి వెళ్లడానికి ట్రై చేశారన్న ప్రచారం జరిగింది అయితే ఆమెపై ఉన్న అవినీతి ఆరోపణలతో జనసేన నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదంట.. కూటమి పార్టీల్లో చేరే అవకాశం ఎలాగూ లేక పోవడంతో.. ఆమె వైసీపీలోనే భవిష్యత్తు వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.రజినీ కోరికను మన్నించి జగన్ ఆమెను తిరిగి చిలకలూరిపేట ఇన్చార్జ్‌గా ప్రయటించడంతో.. ఆమె అక్కడ తన పునాదులు బలోపేతం చేసుకునే పనిలో పడ్డారు. తనపై కేసు నమోదవ్వడంతో ఉలిక్కిపడిన ఆమె.. తనలోని మరో కోణం చూపిస్తున్నారు. తన రాజకీయ గురువు ప్రత్తిపాటిపై రజినీ ఆ స్థాయిలో ధ్వజమెత్తడం ఇదే తొలిసారి.. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆమె ఎవరినీ దూషించడం కాని, సవాళ్లు విసరడం కాని చేసిన దాఖలాలు లేవు.. వైసీపీ అధిష్టానం నుంచి ఆదేశాలు వచ్చినా ఆమె ప్రత్తిపాటి పుల్లారావుపై గతంలో ఎప్పుడు ఈ స్థాయిలో వార్నింగ్ ఇవ్వలేదు. అయితే తాజాగా ఆమె బరస్ట్ అవ్వడానికి కేసుల భయమే కారణమంటున్నారు. మరి చూడాలి మున్ముందు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో?
Read : Minister Seetakka : చిన్నారులతో కలిసి డిన్నర్ చేసిన మంత్రి సీతక్క