ఐదేళ్లలో 35 శాతం పెరిగిన వాహానాలు
హైదరాబాద్, జూలై 2, (న్యూస్ పల్స్
Vehicles increased by 35 percent in five years
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని రోడ్లపై రోజురోజుకు వాహనాల సంఖ్య పెరిగిపోతున్నది. పర్సన్ వాహనాల కొనుగోలుకే ప్రజలు మొగ్గు చూపుతుండడంతో.. ఐదేండ్లలో వాహనాల అమ్మకాలు విపరీతంగా పెరిగిపోయాయి. దీని ద్వారా రవాణా శాఖకు పన్నుల ద్వారా ఆదాయం సమకూరుతున్నప్పటికీ.. రోడ్లను విస్తరించకపోవడం తో నగర ప్రజలు ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాలుష్యం సైతం పెరిగిపోతున్నది. ప్రజా రవాణాను కూడా ఆయా శాఖలు పట్టించుకోకుపోవడంతో అవి సత్ఫలితాలనివ్వడం లేదుగ్రేటర్ హైదరాబాద్ సుమారు 800 కిలోమీటర్ల మెయిన్ రోడ్డును కలిగి ఉన్నది.
2019 లో ప్రతి కిలోమీటరుకు 6500 వాహనాలు మాత్రమే ఈ రోడ్లపై తిరుగుతుండేవి. 2024 నాటికి ఈ సంఖ్య 35 శాతం పెరిగి పది వేలకు చేరుకున్నది. ఇందులో ఏడు వేల ద్విచక్ర వాహనాలు, 1900 కార్లు ఉన్నట్లు గుర్తించా రు. 2019లో నగర రోడ్లపై సగటున 54 లక్షల వాహనాలు తిరుగుతుండగా.. ఈ సంఖ్య ప్రస్తుతం 80 లక్షలకు చేరుకున్నది. రవాణా శాఖ లెక్కల ప్రకారం నగరంలో 59 లక్షల ద్విచక్ర వాహనాలు, 14.3 లక్షల కార్లు ఉన్నాయి. నగరంలో ఉదయం 8.30 గంటల నుం చి 11 గంటల వరకు రోడ్లపైకి ట్రాఫిక్ రద్దీ అధికంగా ఉంటున్నది. రవాణా శాఖ లెక్కల ప్రకారం రంగారెడ్డి జిల్లా కొండాపూర్ ఆర్టీఏ కార్యాలయం పరిధిలో ప్రతిరోజు సగటున 1500 కొత్త వాహనాలు రిజిస్ట్రేషన్‌కు వస్తున్నాయి.
రెండేళ్ల క్రితం ఈ సంఖ్య వెయ్యి లో పే ఉండేది. దీన్ని బట్టి కొత్త వాహనాల సంఖ్య ఎంత పెరిగిపోయిందో అర్థం చేసుకోవచ్చు.జీహెచ్ఎంసీ పరిధిలో 72 కిలోమీటర్ల మేర మెట్రోను 2017లో అందుబాటులో తీసుకువచ్చారు. దీంతో నగరంలో ట్రాఫిక్, కాలు ష్యం సమస్య తగ్గుతుందని అంతా భావించా రు. అయితే పరిస్థితుల్లో ఎలాంటి మార్పు రా లేదు. గ్రేటర్ పరిధిలో ప్రజా రవాణా చేసే ఆ ర్టీసీ, మెట్రో, ఎంఎంటీఎస్ మధ్య సమన్వయం లోపించినట్లు కనిపిస్తున్నది. మెట్రో స్టేషన్లకు వచ్చే ప్రయాణికుల కోసం చుట్టు పక్కల కాలనీల నుండి మినీ బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు గతంలో ఆర్టీసీ ప్రకటించింది.
కొన్ని రోజులపాటు సిటీ బస్సులను నడిపినా తర్వాత వాటిని నిలిపివేయడంతో సమస్య మొదటికొచ్చింది. దీంతో ప్రజలు మెట్రో స్టేషన్లకు వ్యక్తిగత వాహనాల మీద వస్తున్నారు. ఇలా రద్దీ సమయంలో వాహనాలన్నీ రోడ్లకెక్కుతుండడంతో ట్రాఫిక్ సమస్య జఠిలంగా మారుతున్నది. ఇప్పటికైనా ప్రజారవాణా చేసే శాఖలు సమన్వయంతో పని చేసి వ్యక్తిగత వాహనాలు రోడ్ల మీదకు రాకుండా మెరుగైన సదుపాయాలు కల్పించాలని నగరవాసులు కోరుతున్నారు.
గ్రేటర్ పరిధిలో వాహనాల సంఖ్య ఇలా..
ఈ కార్ట్ 41
ప్రైవేట్ సర్వీస్ వెహికల్స్ 2,274
కాంట్రాక్ట్ క్యారేజ్ 6,835
స్టేజ్ క్యారేజెస్ 8,569
విద్యా సంస్థల బస్సులు 14,624
మ్యాక్సి క్యాబ్‌లు 15,754
ఇతర వాహనాలు 40,421
ట్రాక్టర్ అండ్ ట్రాలీస్ 45,806
మోటార్ క్యాబ్ 79,609
ఆటో రిక్షా 1,07,862
గూడ్స్ క్యారేజెస్ 3,14,359
మోటార్ కార్స్ 14,82,028
మోటార్ సైకిల్స్ 59,25,468