బద్వేలు నియోజకవర్గం పోరుమామిళ్ల పట్టణం లో ని బలిజ కోటలో ఉన్న శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానానికి వెళ్ళు రహదారిలోని ప్రధాన మార్గంలో శ్రీ వీరాంజనేయ స్వామి ముఖద్వారాన్ని పోరుమామిళ్ల పట్టణ మేజర్ పంచాయతీ సర్పంచ్ యనమల సుధాకర్ నాయుడు కుటుంబ సభ్యులుతమ సొంత ఖర్చులతో ఆంజనేయ స్వామి ఆలయాన్ని మరియు ముఖద్వారాన్ని దాదాపు 12 లక్షల రూపాయల ధనాన్ని వెచ్చించి నిర్మించారు
శ్రీ వీరాంజనేయ స్వామి ముఖద్వారం ప్రారంభోత్సవం
బద్వేలు
బద్వేలు నియోజకవర్గం పోరుమామిళ్ల పట్టణం లో ని బలిజ కోటలో ఉన్న శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానానికి వెళ్ళు రహదారిలోని ప్రధాన మార్గంలో శ్రీ వీరాంజనేయ స్వామి ముఖద్వారాన్ని పోరుమామిళ్ల పట్టణ మేజర్ పంచాయతీ సర్పంచ్ యనమల సుధాకర్ నాయుడు కుటుంబ సభ్యులుతమ సొంత ఖర్చులతో ఆంజనేయ స్వామి ఆలయాన్ని మరియు ముఖద్వారాన్ని దాదాపు 12 లక్షల రూపాయల ధనాన్ని వెచ్చించి నిర్మించారు. ఈ ముఖద్వారాన్ని బద్వేల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు ఇన్చార్జి రితీష్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. అనంతరం ఆయన కోటవీధుల వెంట నడుచుకుంటూ వెళ్లి శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించుకుని తీర్థ ప్రసాదములను స్వీకరించారు. ఈ సందర్భంగా రితీష్ రెడ్డి మాట్లాడుతూ సర్పంచి యనమలసుధాకర్ నాయుడు కుటుంబం కలిసి బలిజ కోటలోకి ప్రవేశించే కూడలిలో ఈ ముఖద్వారాన్ని నిర్మించి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచారన్నారు. ఇలాంటి శాశ్వత నిర్మాణాల వల్ల నాయకులు ప్రజల హృదయాల్లో ఉంటారని పేర్కొన్నారు. సర్పంచ్ సుధాకర్ నాయుడు మాట్లాడుతూ బలిజ కోటకు చాలా చరిత్ర ఉందన్నారు. ఉదయగిరి కోట నిర్మించిన విజయనగర సామ్రాజ్య రాజులు ఇక్కడ కోటను నిర్మించి ఇక్కడి నుండి చుట్టుపక్కల ప్రాంతాలను పరిపాలించే వారిని అందుకు గుర్తుగా నేడు కోట గుర్తులు ఉండాయన్నారు. కోట ముఖ ద్వారంలో వీరాంజనేయ స్వామి ఆలయం నేటికీ ఉందన్నారు. ఈ ఆలయానికి గుర్తుగా కోటలోకి ప్రధానంగా ఉన్న రహదారి లో ఈ ముఖద్వారాన్ని నిర్మించామన్నారు. ఈ ముఖద్వారం శాశ్వతంగా ఉండిపోవాలన్న సహృదయంతో ఈ నిర్మాణం చేపట్టామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షుడు నగరి భైరవ ప్రసాద్, బద్వేల్ మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ చెరుకూరి చెనరాయుడు, కాశి నాయన మండలం టిడిపి అధ్యక్షులు హోండా రవీంద్రనాథ్ రెడ్డి,టిడిపి సీనియర్ నాయకులు కొండాకృష్ణారెడ్డి, కల్లూరి కృష్ణారెడ్డి, మాజీ ఉపసర్పంచ్ షరీఫ్, సీనియర్ నాయకుడు మహబూబ్బాషా (బిజ్జే), టిడిపి మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ రంతు, రామ సుబ్బారావు, అతి కారి రాజా, పోరుమామిళ్ల మండలం నీటి సంఘ అధ్యక్షులు తోట వెంకటయ్య, చెన్ను వెంకటరమణ, లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.
Read:Siddipet:సిద్దిపేట మార్కెట్ లో కందుల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి పొన్నం