Varun Tej :ప్రభాస్‌కి విలన్‌గా మెగా హీరో.. వరుణ్ తేజ్:రెబల్ స్టార్ ప్రభాస్ ఇమేజ్, క్రేజ్, పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు ఇండియన్ సినిమాలో మోస్ట్ డిమాండబుల్ హీరో అతనే. ‘బాహుబలి’ సినిమాలతో పాన్ ఇండియా స్టార్ గా అవతరించిన డార్లింగ్.. తన స్టార్ డమ్ ను కాపాడుకునేలా మూవీస్ సెట్ చేసుకుంటూ ముందుకుసాగుతున్నారు. ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు. ఇక సోషల్ మీడియాలో ప్రభాస్ కు విపరీతమైన ఫాలోయింది ఉంది. ఇన్స్టాగ్రామ్ లో ఆయన పెట్టే పోస్టులు క్షణాల్లోనే నెట్టింట వైరల్ అవుతుంటాయి.
Varun Tej :ప్రభాస్‌కి విలన్‌గా మెగా హీరో.. వరుణ్ తేజ్
రెబల్ స్టార్ ప్రభాస్ ఇమేజ్, క్రేజ్, పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు ఇండియన్ సినిమాలో మోస్ట్ డిమాండబుల్ హీరో అతనే. ‘బాహుబలి’ సినిమాలతో పాన్ ఇండియా స్టార్ గా అవతరించిన డార్లింగ్.. తన స్టార్ డమ్ ను కాపాడుకునేలా మూవీస్ సెట్ చేసుకుంటూ ముందుకుసాగుతున్నారు. ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు. ఇక సోషల్ మీడియాలో ప్రభాస్ కు విపరీతమైన ఫాలోయింది ఉంది. ఇన్స్టాగ్రామ్ లో ఆయన పెట్టే పోస్టులు క్షణాల్లోనే నెట్టింట వైరల్ అవుతుంటాయి. అయితే ఆ పోస్టులు పెట్టేది ప్రభాస్ కాదనే విషయం బయటకు వచ్చింది. ప్రభాస్ తన ఇన్స్టాగ్రామ్ లో సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ మాత్రమే షేర్ చేస్తుంటారు. తన సినిమాలతో పాటుగా ఇతరుల చిత్రాలను ప్రమోట్ చేయడానికి, సినీ ప్రముఖులకు బర్త్ డే విషెస్ చెప్పడానికి తన అకౌంట్ ను ఉపయోగిస్తుంటారు. ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేసే అప్డేట్స్ కి మిలియన్ల కొలదీ లైక్స్, లక్షలాది కామెంట్స్ వస్తుంటాయి. అయితే ప్రభాస్ పేరుతో ఇన్‌స్టా నుంచి వచ్చే పోస్ట్‌లు షేర్ చేసేది ఆయన కాదని ‘సలార్’ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ తాజాగా వెల్లడించారు. ‘లూసిఫర్ 2’ ప్రమోషన్స్ లో భాగంగా పృథ్వీరాజ్ సుకుమారన్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ గురించి మాట్లాడారు. అంత పెద్ద స్టార్ అయినప్పటికీ చాలా సింపుల్‌గా ఉంటాడని.. స్టార్డమ్ గురించి అసలు ఆలోచించడని అన్నారు. సోషల్ మీడియాపై ఆయనకు పెద్దగా ఆసక్తి ఉండదని.. ప్రభాస్ ఇన్‌స్టా నుంచి వచ్చే పోస్ట్‌లు కూడా ఆయన షేర్ చెయ్యరని చెప్పారు. ఈ విషయాన్ని రివీల్ చేసి ఫ్యాన్స్ అందరినీ నిరాశ పరిచినందుకు పృథ్వీరాజ్ క్షమించమని కోరాడు. ఇక ప్రభాస్ కు చిన్న చిన్న ఆనందాలంటే ఇష్టమని తెలిపారు. ఎక్కడైనా మొబైల్ పనిచేయని ప్రాంతానికి వెళ్దామని తరచుగా అడుగుతుంటాడని, అతను తన ఫామ్‌హౌస్‌లో హ్యాపీగా ఉంటాడని చెప్పారు. అలాంటి బిగ్ స్టార్ ఇలాంటి చిన్న ఆనందాలను కోరుకోవడం చూసి ఒక్కోసారి ఆశ్చర్యంగా అనిపిస్తుందని పృథ్వీరాజ్ చెప్పుకొచ్చారు. నిజానికి మన స్టార్ హీరోలెవరూ సోషల్ మీడియాలో స్వయంగా పోస్టులు పెట్టరు. దాని కోసం వాళ్లకు సపరేట్ గా డిజిటల్ టీమ్స్ ఉంటాయి. ఇన్స్టాగ్రామ్, ఫేస్ బుక్, ట్విట్టర్.. వంటి సోషల్ ఫ్లాట్ ఫామ్స్ లలో హీరోల పేరుతో అకౌంట్స్ క్రియేట్ చేసి పోస్టులు పెడుతుంటారు. ఇందుకుగాను వారికి భారీగానే చెల్లిస్తారని సమాచారం. ఇప్పుడు ప్రభాస్ ఇన్‌స్టా ఖాతాలోనూ ఆయన పోస్టులు పెట్టరనే విషయం బయటకు వచ్చింది.
ఇకపోతే మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ‘సలార్’ సినిమాలో ప్రభాస్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో ఇద్దరూ విరోధులుగా మారిన స్నేహితులుగా నటించారు. ఆ సమయంలో వీరి మధ్య ఫ్రెండ్ షిప్ కుదిరింది. పలు సందర్భాల్లో ఒకరి మీద ఒకరికి ఉన్న అనుబంధాలను పంచుకున్నారు. త్వరలో రాబోతున్న ‘సలార్ 2’ సినిమాలో కలిసి నటించబోతున్నారు. అంతకంటే ముందుగా పృథ్వీరాజ్ మరికొన్ని చిత్రాలతో తెలుగు ఆడియన్స్ ను పలకరించబోతున్నారు. మోహన్ లాల్ హీరోగా ఆయన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘లూసిఫర్ 2’ మార్చి 27న రిలీజ్ కానుంది. ఇక మహేశ్ బాబు, రాజమౌళి కాంబోలో రూపొందుతున్న ‘SSMB 29’లో పృథ్వీరాజ్ కీలక పాత్ర పోషిస్తారని టాక్. మెగా హీరో వరుణ్ తేజ్ కెరీర్ ప్రస్తుతం చాలా వీక్‌గా ఉంది. ఎన్ని ప్రయోగాలు చేసినా, ఎలాంటి విభిన్నమైన పాత్రలు వేసినా ఫలితం మాత్రం రావడం లేదు. వరుణ్ తేజ్ ఒక కమర్షియల్ సక్సెస్ అందుకొని చాలా కాలం అయిపోయింది. ఇటీవల రిలీజైన మట్కా కూడా ఘోరంగా ఫెయిల్ అయింది. దీంతో ఏం చేయాలా అనే ఆలోచనలో వరుణ్ తేజ్ ఉన్నాడు. అయితే ఇలాంటి సమయంలో ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేంటంటే?
ప్రభాస్ గురించి వరుణ్ తేజ్
మెగా హీరో వరుణ్ తేజ్ కెరీర్ ప్రస్తుతం చాలా వీక్‌గా ఉంది. ఎన్ని ప్రయోగాలు చేసినా, ఎలాంటి విభిన్నమైన పాత్రలు వేసినా ఫలితం మాత్రం రావడం లేదు. వరుణ్ తేజ్ ఒక కమర్షియల్ సక్సెస్ అందుకొని చాలా కాలం అయిపోయింది. ఇటీవల రిలీజైన మట్కా కూడా ఘోరంగా ఫెయిల్ అయింది. దీంతో ఏం చేయాలా అనే ఆలోచనలో వరుణ్ తేజ్ ఉన్నాడు. అయితే ఇలాంటి సమయంలో ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేంటంటే? ప్రభాస్-సందీప్ రెడ్డి వంగా కాంబోలో ‘స్పిరిట్’ అనే చిత్రం రానుంది. ఇందులో నిజాయతీ గల పోలీస్ ఆఫీసర్ పాత్రలో ప్రభాస్ నటించబోతున్నారు. అయితే ఈ సినిమాలో మెగా హీరో వరుణ్ తేజ్‌ని ఒక విలన్ రోల్‌కి సెలక్ట్ చేశారంటూ టాక్ నడుస్తోంది. ఇది నిజమో కాదో తెలియదు కానీ ఈ వార్త మాత్రం వైరల్ అవుతోంది. ముఖ్యంగా ప్రభాస్ ముందు వరుణ్ తేజ్ విలన్‌గా కరెక్ట్‌గా సరిపోతాడంటూ రెబల్ ఫ్యాన్స్ కూడా అంటున్నారు. ఎందుకంటే వరుణ్ తేజ్ ఆరడగులపైనే ఉంటాడు.. పైగా బాడీ కూడా అదిరిపోతుంది. దీంతో ప్రభాస్ ముందు సరిగ్గా సరిపోతాడంటూ ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు.
ఇదే సందర్భంలో గతంలో ప్రభాస్ గురించి వరుణ్ తేజ్ మాట్లాడిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గతంలో వరుణ్ తేజ్ సినిమా ఈవెంట్‌కి ప్రభాస్ గెస్టుగా వెళ్లారు. ఆ సమయంలో ప్రభాస్ గురించి వరుణ్ తేజ్ చాలా గొప్పగా మాట్లాడాడు. “నేను చాలా ఇంటర్వ్యూల్లో చెప్పాను.. నేను ఛత్రపతి నుంచో బాహుబలి నుంచో ఆయన ఫ్యాన్ కాదు.. ఈశ్వర్ సినిమా అప్పుడే నేను ఫస్ట్‌డే మార్నింగ్ షోకి వెళ్లాను.. అంత ఇష్టం ప్రభాస్ అంటే.. ఆయనతో స్టేజ్ పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది.” అంటూ వరుణ్ తేజ్ అన్నాడు. ఈ వీడియోని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు ఫ్యాన్స్. అప్పట్లోనే వరుణ్ తేజ్ ఓ హింట్ ఇచ్చాడని.. ప్రభాస్‌తో నటించాలని వరుణ్‌కి ఎప్పటినుంచో కోరిక ఉందంటూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. ఖచ్చితంగా ఈ కాంబో అదిరిపోతుందని అభిప్రాయపడుతున్నారు. ఇక ఈ చిత్రం క్యాస్టింగ్ గురించి ఇప్పటివరకూ సందీప్ రెడ్డి చెప్పలేదు. ప్రస్తుతానికి అయితే స్పిరిట్ స్క్రిప్ట్ వర్క్‌తో ఆయన బిజీగా ఉన్నారు. కానీ సాధారణంగానే సందీప్ రెడ్డి క్యాస్టింగ్ సెలక్షన్ చాలా బావుంటుంది. యానిమల్ సినిమాకి విలన్‌గా బాబీ డియోల్‌ని తీసుకోవడం ఏ రేంజ్లో క్లిక్ అయిందో తెలిసిందే. ఈ సినిమాతో బాబీ కెరీర్యే టర్న్ అయిపోయింది. మరి ఇప్పుడు వరుణ్ తేజ్‌ని కూడా అలానే ఏమైనా ట్రాక్‌లోకి తెస్తాడేమో చూడాలి.