Vande Bharat Train | 19 నుంచి అందుబాటులోకి రానున్న వందే భారత్ ట్రైన్స్ | Eeroju news

Vande Bharat Train

19 నుంచి అందుబాటులోకి రానున్న వందే భారత్ ట్రైన్స్

హైదరాబాద్, సెప్టెంబర్ 17, (న్యూస్ పల్స్)

Vande Bharat Train

Vande Bharat Express: Odisha's first Vande Bharat train to hit tracks in May | Bhubaneswar News - Times of Indiaమేక్‌ ఇన్‌ ఇండియా కార్యక్రమంలో భాగంగా భారత రైల్వే శాఖ.. రైలు మార్గాలపై ప్రత్యేక దృష్టిసారించింది. ప్రయాణికులను ఆట్టుకునేలా అత్యాధునిక సౌకర్యాలతో, పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో వందే భారత్‌ రైళ్లను రూపొందించింది. ఏడాదిగా వందే భారత్‌ రైళ్లు దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో పరుగులు పెడుతున్నాయి. తెలుగు రాష్ట్రాలు అయిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు కూడా కేంద్రం వందే భారత్‌ రైళ్లను కేటాయించింది. తాజాగా మరో రెండు రైళ్లను రెండు తెగులు రాష్ట్రాల మీదుగా నడపాలని నిర్ణయించింది. ఈమేరకు రూట్లు ఖరారు చేసింది.

సెప్టెంబర్‌ 16న ఒకేసారి ఆరు వందే భారత్‌ రైళ్లను ప్రధాని నరేంద్రమోదీ వర్చువల్‌గా ప్రారంభించారు. ఇందులో తెలుగు రాష్ట్రాలకు కేటాయించిన రెండు వందే భారత్‌ రైళ్లు కూడా ఉన్నాయి. ఈనెల 19 నుంచి ఈ రైళ్లు ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి.ప్రస్తుతం తెలుగ రాష్ట్రాల్లో నడుస్తున్న ఇంటర్‌సిటీ రైళ్ల స్థానంలో వందే మెట్రో రైళ్లు నడపాలని రైల్వే శాఖ నిర్ణయించింది. దేవంలో తొలి వందే మెట్రో సర్వీసు ప్రారంభం అవుతుంది. అహ్మదాబాద్‌–భుజ్‌ మధ్య దీనిని ప్రారంభిస్తున్నారు.Soon Vande Bharat train to ply on the Mumbai-Ahmedabad route

తెలుగు రాష్ట్రాల్లో రెండు వందే మెట్రో రైళ్లు నడిపే రూట్లను రైల్వే శాఖ అధికారికంగా ఖరారు చేసింది. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్టణం నుంచి దుర్గ్‌ మధ్య ఒక వందే మెట్రోరైలు నడుపుతారు. తెలంగాణలోని సికింద్రాబాద్‌ నుంచి నాగపూర్‌ మధ్య మరో సర్వీస్‌ నడుపుతారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన తొలి వందే మెట్రో రైలును తిరుపతితో అనుసంధానం చేయనున్నారు.ఇక ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి–చెన్నై మధ్య తొలి వందే మెట్రో రైలు పట్టాలెక్కనుంది. తర్వాత వరంగల్‌ మీదుగా సికింద్రాబాద్‌–విజయవాడ మధ్య మరో వందే మెట్రో రైలు నడుపుతారు. ప్రస్తుతం ఈ రెండు రూట్లలో నడుస్తున్న ఇంటర్‌సిటీ స్థానంలో అదే సమయంలో వందే మెట్రో రైళ్లను అందుబాటులోకి తీసుకువస్తున్నారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో వందేభారత్‌ సేవలు మరింత మెరుగుపడతాయి.

100 నుంచి 300 కిలోమీటర్ల దూరంలో ఉండే రెండు ప్రధాన నగరాల మధ్య నడిచేలా ఈ వందే మెట్రో రైళ్లను రూపొందించారు. వీటి గరిష్ట వేగం గంటకు 110 కిలోమీటర్గు ఉంటుందివందే మెట్రోరైళ్లు పూర్తిగా ఏసీ రైళ్లు. భవిష్యత్‌లోనాన్‌ ఏసీ రైళ్లను కూడా నడపనున్నారు. ఈ రైళ్లలో కనీస ఛార్జీ రూ.30. దూరాన్ని బట్టి చార్జీ మారుతుంది. 350 కిలోమీటర్లకు రూ.445గా నర్ణియించారు. ఈ రైళ్లలో ఆటోమేటిక్‌ డోర్‌ సిస్టమ్, ప్రయాణికులకు అనువైన సీటింగ్‌ ఉంటుంది. ఈ రైలులో నాలుగు ఏసీ బోగీలు ఒక యూనిట్‌గా ఉంటాయి.

Vande Bharat Train


Vande Bharat sleepers since August | ఆగస్టు నుంచి వందే భారత్ స్లీపర్లు | Eeroju news

 

Related posts

Leave a Comment