Vande Bharat Sleepers | ఫైవ్ స్టార్ హోటల్ సౌకర్యాలతో వందే భారత్ స్లీపర్లు | Eeroju news

ఫైవ్ స్టార్ హోటల్ సౌకర్యాలతో వందే భారత్ స్లీపర్లు

ఫైవ్ స్టార్ హోటల్ సౌకర్యాలతో
వందే భారత్ స్లీపర్లు

చెన్నై, అక్టోబరు 5, (న్యూస్ పల్స్)

Vande Bharat Sleepers

దేశంలో వందే భారత్ రైళ్లు దూసుకుపోతున్నాయి. ఇవి ప్రారంభించినప్పటి నుంచే అనూహ్య స్పందన వస్తున్నాయి. వీటిల్లో ప్రయాణం చేయడానికి చాలా మంద ఆసక్తి చూపుతున్నారు. ముందుగా ప్రధాన రూట్లలో ప్రారంభించిన వందే భారత్ ఎక్స్ ప్రెస్ లు ఇప్పుడు తక్కువ దూరంలో కూడా వెళ్తుననాయి. అయితే రైల్వే శాఖ తాజాగా మరో నిర్ణయం తీసుకుంంది. వందే భారత్ నుంచి స్లీపర్ రైళ్లను కూడా నడపాలని నిర్ణయం తీసుకున్నాయి. ఇందు కోసం ఇప్పటికే అన్ని విధాలుగా ఏర్పాట్లు చేశారు. అయితే ముందుగా ట్రయల్ రన్ నిర్వహించిన తరువాత వీటిని మెయిన్ ట్రాక్ లోకి తీసుకొస్తారు.

అప్పుడే ఇవి ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. అయితే వంద్ భారత్ స్లీపర్ రైళ్లు ఎలా ఉండబోతున్నాయి.ప్రస్తుతం వందే భారత్ ఎక్స్ ప్రెస్ లు పట్టాలపై ప్రయాణం చేస్తున్నాయి. త్వరలో స్లీపర్ రైళ్లు కూడా ఉండనున్నాయి. అయితే వీటిల్లో అదనంగా కొన్ని ప్రత్యేక సదుపాయాలు ప్రవేశపెట్టినట్లు రైల్వే శాఖ నుంచి సమాచారం ఉంది. ఇందులో ప్రయాణికులకు సౌకర్య వంతంగా యూఎస్ బీ ఛార్జర్ ఉండనుంది. వీరి రక్షణ కోసం సీసీ కెమెరాలు, విమానంలో లాగా ఇన్ సైడ్ డిస్ ప్లే, సమాచారం తెలిపే విజువల్ బోర్డులు ఉండనున్నాయి.

ఏసీ కోచ్ లో వేడి నీరుకూడా ఉండనుంది. దివ్యాంగుల కోసం ప్రత్యేక బెర్త్ లు అమరుస్తున్నారు.ఇప్పుడున్న వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లు గంటకు 160 కిలోమీటర్ల దూరంలో ప్రయాణిస్తున్నాయి. అయితే కొత్తగా రాబోతున్న వందే భారత్ స్లీపర్ రైళ్లు గంటకు 180 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోనున్నాయి. కొత్త రైళ్ల టికెట్ ధరలు ఎలా ఉంటాయి? అనేది ఆసక్తిగా ఉంది. కానీ రైల్వే సమాచారం మేరకు ఇప్పుడున్న ఎక్స్ ప్రెస్ ధరలకు సమానంగానే స్లీపర్ ధరలు కూడా ఉంటాయని తెలుస్తోంది. అయితే ఇవి పూర్తిగా అందుబాటులోకి వచ్చిన తరువాత ప్రకటించే అవకాశం ఉంది.

ఇందులో మొత్తం 16 కోచ్ లు ఉంటాయి. వీటిలో 1 ఫస్ట్ క్లాస్, 2ఏసీ కోచ్ లు 4, 3ఏసీ కోచ్ లో 11 ఉండనున్నాయి.తాజాగీ ఈ రైలు రైల్వే ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీకి చేరుకోనుంది. మరికొద్దిరోజుల్లో దీనిని ట్రయల్ రన్ నిర్వహిస్తారు. ఆ తరువాత డిసెంబర్ లో ఇది అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. కొత్తగా ప్రారంభించే వందే భారత్ స్లీపర్ రైలు బెంగుళూరు, ఢిల్లీ, ముంబయ్ రూట్లలో ప్రారంభించే అవకాశం ఉంది.

వందే భారత్ ఎక్స్ ప్రెస్ కు అనుగుణంగా వీటి సమయాలు మార్చనున్నారు. అయితే కొత్త రైలుకు అనుగుణంగా ఫైలట్లకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. అలాగే లోకో ఫైలెట్ క్యాబ్ ఆధునీకంగా ఉండనుంది. మరోవైపు ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకొని ఇందులో అదనపు సౌకర్యాలు అమర్చనున్నారు. దూర ప్రయాణాలు చేసేవారికి స్లీపర్ రైలు సౌకర్యవంతంగా ఉంటుందని భావిస్తున్నారు.

ఫైవ్ స్టార్ హోటల్ సౌకర్యాలతో వందే భారత్ స్లీపర్లు

 

Vande Bharat Train | 19 నుంచి అందుబాటులోకి రానున్న వందే భారత్ ట్రైన్స్ | Eeroju news

Related posts

Leave a Comment