కేంద్ర సోషల్ జస్టిస్ మినిస్టర్ రాందాస్ అథావలే తోచంద్రబాబు భేటీ
న్యూఢిల్లీ జూలై 8
Union Social Justice Minister Ramdas Athavale met with Chandrababu
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మాజీ ఎంపీ గల్లా జయదేవ్ నివాసంలో కేంద్ర సోషల్ జస్టిస్ మినిస్టర్ రాందాస్ అథావలే తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నూతనంగా ముఖ్యమంత్రి పదవి చేపట్టి ఢిల్లీ వచ్చిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కేంద్ర మంత్రివర్యులు ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా అనేక విషయాలు మాట్లాడుకుని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కేంద్రమంత్రి రాందాస్ అధావలే ని వెంకటేశ్వర స్వామి వారికి బహుమతిగా ఇచ్చి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆర్పిఐ ఆంధ్రప్రదేశ్ పార్టీ అధ్యక్షులు కొమ్మారెడ్డి బ్రహ్మానంద రెడ్డి జాతీయ కార్యదర్శి పేరం శివ నాగేశ్వరరావు గౌడ్ జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధికార ప్రతినిధి ఢిల్లీ ఇంచార్జ్ కర్రి వేణుమాధవ్ తెలుగుదేశం పార్టీ కేంద్ర మంత్రులు పార్లమెంట్ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.