Unexpected change in Kadiam Srihari | కడియం శ్రీహరిలో ఊహించని మార్పు | Eeroju news

Unexpected change in Kadiam Srihari

కడియం శ్రీహరిలో ఊహించని మార్పు

వరంగల్, ఆగస్టు 2 (న్యూస్ పల్స్)

Unexpected change in Kadiam Srihari

 

మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిలో ఊహించని విధంగా మార్పు వచ్చింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 30 సంవత్సరాలుగా రాజకీయాల్లో కొనసాగుతున్న కడియం శ్రీహరి కనుసైగలు, ఫోన్లతోనే అధికారులతో పనులను చేయించేవారు. కానీ కొద్ది రోజులుగా స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో ప్రభుత్వ కార్యాలయాలు తిరుగుతూ, క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. కడియం శ్రీహరి రాజకీయ జీవితంలో ఆధిపత్యాన్ని కొనసాగించారు తప్ప. ఏ రోజు అధికారుల వద్దకు వెళ్లలేదు. ప్రజా సమస్యలు పరిష్కారం, పనుల కోసం అధికారులకు ఫోన్ చేయడం, లేదంటే ఇంటికి రప్పించుకునేవారు.

జిల్లాల్లో కేంద్రంలోనే ఉండి తన మార్క్ చాటుకొనేవారు. ప్రభుత్వ కార్యక్రమాలు, పార్టీ కార్యక్రమాలు ఉంటే తప్ప నియోజకవర్గానికి పెద్దగా వెళ్లేవారు కాదు. కొద్ది రోజులుగా కడియం శ్రీహరి నియోజకవర్గంలో క్షేత్రస్థాయిలోకి వెళ్తున్నారు. నియోజకవర్గం లోని ప్రభుత్వ కార్యాలయాలను ఆకస్మిక తనిఖీ చేయడంతో పాటు ప్రజల్లో ఉంటున్నారు. అయితే ఈ మార్పు రావడానికి కారణం ఏంటి అనే అనుమానాలు లేకపోలేదు. ఆధిపత్యంతో కడియం శ్రీహరి కనుసైగలతో అధికారులతో పనులు చేయించడంతోపాటు పార్టీలోని నేతలను చక్కదిద్దేవారు.

ఒక రకంగా చెప్పాలంటే సొంత నియోజకవర్గాన్ని ఉమ్మడి వరంగల్ జిల్లాను కడియం తన తన సంఘంలో ఉంచుకునేవారు. శ్రీహరి లో ఒక్కసారిగా మార్పు రావడంపై నియోజకవర్గం ప్రజల్లో తోపాటు ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయాల్లో చర్చ నడుస్తుంది. కడియం శ్రీహరి బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన అనంతరం తన కూతురుకు ఎంపీ టికెట్ ఇప్పించుకొని ఎంపీలు చేశారు. అయితే కడియం శ్రీహరి పార్టీ మారడంపై స్వంత నియోజకవర్గ పజల్లో, ఉమ్మడి వరంగల్ జిల్లా తీవ్ర వ్యతిరేకత ఎదురైంది.

అయితే తాను నియోజకవర్గ అభివృద్ధి కోసమే పార్టీ మారానని అనేక ప్రకటనలు చేస్తూ ప్రజలను ఒప్పించే ప్రయత్నం చేశారు. కానీ ఆ వ్యతిరేకత నియోజకవర్గంలో నివురుగప్పిన నిప్పులా కొనసాగుతుంది. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గ ఇంచార్జీ ఇందిర బలంగా ఉంది. కడియం శ్రీహరి రాక తీవ్రంగా వ్యతిరేకించారు ఇందిర వర్గం. పార్టీ కార్యక్రమాల్లో ఇందిర వర్గం కడియం ను తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో అధిష్టానం పెద్దలు సయోధ్య కుదూర్చడంతో సమస్య సద్దుమనిగింది.

కడియం అధిపత్యానికి ఇందిర ఆమె వర్గం అడ్డుపడుతుందడంతో చేసేది ఏమిలేక నియోజకవర్గం లో పట్టు కోసం ఉనికిని కాపాడుకోవడం కోసం కడియం శ్రీహరి క్షేత్ర స్థాయి లో ఉంటున్నారటఅయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన ఇందిర నియోజకవర్గంలోని అధికారులను ఆమె ఆధిపత్యంలో కి తెచ్చుకుంది. కడియం శ్రీహరి ఎమ్మెల్యే గా ఉన్న ఆయన పవర్ నడవలేదు. అయితే  కడియం పార్టీ మారడానికి ఇది కూడా ఒక కారణం గా ప్రచారంలో లేకపోలేదు.

అధికారులను తన కనుసన్నల్లోనే తెచ్చుకోవడం కోసం, నియోజకవర్గం ఉనికి కాపాడుకోవడం కోసం క్షేత్రస్థాయిలో వెతున్నారట. మరో ప్రచారం లేకపోలేదు. కడియం శ్రీహరి బీ అర్ ఎస్ నుండి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరడంతో అనర్హత వేటు కోసం బీ అర్ ఎస్ పార్టీ కోర్టుకు వెళ్లింది. కడియం శ్రీహరి అనర్హత వేటు పై వాదనలు కొనసాగుతున్నాయి. అనర్హత భయంతో కాంగ్రెస్ లో చేరిన బీ అర్ ఎస్ ఎమ్మెల్యే తిరిగి పార్టీలోకి వచ్చే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. కడియం తిరిగి బీ అర్ ఎస్ లోకి వచ్చే పరిస్థితి లేదు. దీంతో పాటు అనర్హత వేటు పడడం సాధ్యమయ్యే పనికాదు. కానీ దురదృష్టవశాత్తు వేటు పడితే తిరిగి ఎన్నికలకు వెళ్ళాలి. దీంతో ముందు జాగ్రత్తగా కడియం నిత్యం  నియోజకవర్గంలో ఉంటున్నారనే  ప్రచారం లేకపోలేదు.

Unexpected change in Kadiam Srihari

 

Warangal rose leaders look towards Congress | వరంగల్ గులాబీ నేతలు… కాంగ్రెస్ వైపు చూపు | Eeroju news

Related posts

Leave a Comment