Umm.. dogs in Nizamabad | నిజామాబాద్ లో అమ్మో…కుక్కలు | Eeroju news

Umm.. dogs in Nizamabad

నిజామాబాద్ లో అమ్మో…కుక్కలు

నిజామాబాద్, జూలై 22 (న్యూస్ పల్స్)

Umm.. dogs in Nizamabad

ఒక్క జూన్ నెలలోనే 435 కేసులు.. ఈ నెలలో ఇప్పటివరకు 243.. గత ఆరు నెలలుగా 300కు పైగానే..  సగటున రోజుకు 10 మంది ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కుక్కల దాడిలో గాయపడుతున్నారు. పల్లె, పట్టణమన్న తేడా లేకుండా వీధి కుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. ఆకలి మంటతో జనం మీద దాడి చేస్తున్నాయి. వాటి పునరుత్పత్తి సీజన్లో డాగ్బైట్ కేసులు అధికంగా నమోదవుతున్నాయి. వాటి పిల్లలను కాపాడుకునే ప్రయత్నంలో దగ్గరగా నడుచుకుంటూ వెళ్లేవారిని ఎటాక్ చేస్తున్నాయి. బండ్లపై వెళ్లే వారిని, ఇంటి బయట ఆడుకుంటున్న పిల్లలను వదలట్లేదు. అసలు ఎటు నుంచి వచ్చి కుక్కలు దాడులు దాడి చేస్తున్నాయో తెలియక ప్రజలు రోడ్డు ఎక్కాలంటేనే భయపడుతున్నారు.

డాగ్ బైట్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో గవర్నమెంట్ ఆదేశాల మేరకు నిజామాబాద్ జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. నగరంలోని ఎనిమల్ బెర్త్ కంట్రోల్ రూమ్ బాధ్యతలు పెంచింది. వీధి కుక్కల సమాచారం తెలపడానికి  08462-220234  నంబర్ను పౌరుల కోసం అందుబాటులో తెచ్చినట్లు నగర పాలక కమిషనర్ మంద మకరంద్ తెలిపారు. సమాచారం అందిస్తే వీధి కుక్కులను పట్టుకొని సంతానోత్పత్తిలేకుండా ఆపరేషన్ చేయిస్తామని, వాటి కోపాన్ని తగ్గించే ట్రీట్మెంట్ను వెటర్నరీ డాక్టర్లు ఇస్తారని వివరించారు. ఇందుకోసం మూడు టీమ్లను వాహనాన్ని  ఏర్పాటు చేసినట్లు మేయర్ నీతూకిరణ్ వెల్లడించారు.

నిజామాబాద్లోని ఆటో నగర్లో నెల కింద ఇంటి బయట ఏడాది కొడుకుతో కూర్చున్న తల్లి జరీనా.. పాలబాటిల్ కోసం లోపలికి వెళ్లొచ్చే నిమిషం వ్యవధిలో చిన్నారిపై కుక్క దాడి చేసింది. మాక్లూర్లో ఈ నెల 17న మూడేండ్ల పిల్లాడిని కుక్క తీవ్రంగా గాయపర్చింది. ఇంటి బయట ఆడుకుంటుండగా, ఇష్టమొచ్చినట్టు కొరికింది. కామారెడ్డి జిల్లా భిక్కనూర్ మండలం రామేశ్వర్పల్లి శివారులో ఈ నెల 3న రోడ్పై నడుచుకుంటూ వెళ్తున్న ఏడుగురు వ్యక్తులపై వీధి కుక్కులు దాడి చేసి గాయపర్చాయి. అంతకు కొన్ని రోజుల ముందు తాడ్వాయి మండలం సోమారం తండాలో ఇంటి బయట ఆడుకుంటున్న ఏడేళ్ల బాలిక శైలజపై కుక్క దాడి చేసింది.

 

Umm.. dogs in Nizamabad

 

The dogs that took the life of another child | మరో చిన్నారి ప్రాణం తీసిన కుక్కలు | Eeroju news

Related posts

Leave a Comment