Ujjain Mahakali in Shakambari Devi Alankaram | శాకంబరీ దేవి అలంకారంలో ఉజ్జయిని మహంకాళి | Eeroju news

Ujjain Mahakali in Shakambari Devi Alankaram

శాకంబరీ దేవి అలంకారంలో ఉజ్జయిని మహంకాళి

సికింద్రాబాద్

Ujjain Mahakali in Shakambari Devi Alankaram

శ్రీ ఉజ్జయిని మహాకాళి అమ్మవారు  శుక్రవారం రోజున శాకంబరీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనం  ఇచ్చారు. వ్వమనున్నారు. ఈ మేరకు ఆలయ కార్య నిర్వహణ అధికారి గుత్తా మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆలయం లో పటిష్టమైన ఏర్పాట్లు చేశారు. ఆషాడ బోనాల జాతరలో భాగంగా ఇప్పటికే అమ్మవారి ఘటోత్సవ కార్యక్రమం కన్నుల పండువగా ప్రారాంబమై కొనసాగుతుంది. ఆలయానికి రాలేని భక్తులు అమ్మవారిని తమ ఇళ్ళ ముందే దర్శించుకుని పూజలు నిర్వహించుకునే విధంగా ఘటాన్ని పురవీధుల్లో ఊరేగిస్తారు. ఇప్పటికే పలు వీధుల్లో అమ్మవారి ఘటం భక్తులకు దర్శనమిచ్చింది.

శుక్రవారం అమ్మవారు శాకంబరి దేవిగా భక్తులుకు దర్శనం ఇవ్వ నున్నారు.అమ్మవారిని చూసి పూజలు నిర్వహించేందుకు జంట నగరాలతో పాటు రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రానున్నారు .ఈ మేరకు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ఏర్పాట్లు చేశారు . శాకాంబరి దేవి గా అమ్మవారు భక్తులకు దర్శనం ఇవ్వనున్న నేపథ్యంలో వివిధ రకాలైన కూరగాయలతో ఆలయంతో పాటు గర్బగుడిని కూడా అలంకరణ చేసారు.

ఇదే సమయంలో ఆలయం మొత్తాన్ని రంగురంగుల పూలతో అందంగా అలంకరించారు . శాఖాంబరి దేవిగా భక్తులకు దర్శనం ఇవ్వనున్న నేపథ్యంలో సుమారు నాలుగు వేల కిలోల వివిధ రకాల కూరగాయలతో ఆలయంలో అలంకరణ చేసారు. ఈ సందర్భంగా ఆలయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టినట్లు ఈఓ మనోహర్ రెడ్డి వెల్లడించారు.

Ujjain Mahakali in Shakambari Devi Alankaram

 

A review of bonala arrangements in Balkampeta temple | బల్కంపేట ఆలయంలో బోనాల ఏర్పాట్లపై సమీక్ష | Eeroju news

Related posts

Leave a Comment