నెల్లూరు జిల్లా లో రెండు పెద్ద పులులు
నెల్లూరు
Two big tigers in Nellore district
కర్నూలు జిల్లా నుండి ఒక పులి,నల్లమల కారిడార్ నుంచి మరొక పులి జిల్లాలోకి ప్రవేశం..
నెల్లూరు జిల్లా లో పులుల సంచారం నిజమేనని జిల్లా అటవీ శాఖ అధికారి బి.చంద్రశేఖర్ ధ్రువీకరించారు, ఆత్మకూరు,ఉదయగిరి,రాపూరు రేంజ్ పరిధిలో రెండు పెద్ద పులులు ఉన్నట్లు డీఎఫ్ఓ తెలిపారు వీటిలో ఒక పులి రాపూర్ పరిధిలోని పెంచల నరసింహస్వామి కొండ ప్రాంతంలో తిరుగుతుందన్నారు,ఇది కర్నూల్ టైగర్ కారిడార్ నుంచి రెండు నెలల క్రితమే జిల్లాకు వచ్చిందని వెల్లడించారు, మరొకటి గత ఏడాది సెప్టెంబర్ లో నల్లమల కారిడార్ నుంచి వచ్చిందని పేర్కొన్నారు వన్యప్రాణులు సంరక్షణకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగానే పెద్ద పులులు ఇక్కడికి వస్తున్నాయని తెలిపారు అవి సంచరించే ప్రాంతాలులో నీటి కుంటలు, 18 ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశామని డిఎఫ్ఓ బి.చంద్రశేఖర్ తెలియజేశారు…
Minister Ponnam Prabhakar met with morning walk activists | కార్యకర్తలను కలుసుకుంటూ… | Eeroju news