ఇసుకపై ట్వీట్… వార్
విశాఖపట్టణం, జూలై 10, (న్యూస్ పల్స్)
Tweet war on sand between TDP and YCP
ఆంధ్రులకు ఇకపై ఫ్రీ ఇసుక అందించేలా కూటమి ప్రభుత్వం నిర్ణంయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు సైతం నిన్న జారీచేసింది. కాగా ఈ అంశంపై టీడీపీకి వైసీపీకి మధ్య ట్వీట్ వార్ జరుగుతోంది. చంద్రబాబు చెప్పింది ఎప్పుడూ చేయరని, అబద్ధాలు చెప్పడం.. మోసం చేయడం బాబు నైజమని వైసీపీ ఆరోపించింది. అలానే పేరుకే ఉచిత ఇసుక విధానమని.. దీని పేరుతో కూటమి నేతలు కోట్లు దోచుకుంటున్నారని మండిపడింది. ఇసుక ఉచితంగా ఇవ్వకపోగా స్టాక్యార్డుల వద్ద దారుణమైన రేట్లతో ఇసుకను విక్రయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. కూటమి ప్రభుత్వం ప్రకటించిన ధరలు ఒకసారి చూస్తే.. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం డిపో దగ్గర టన్ను ఇసుక.
రూ.1225లు, విశాఖనగరంలో ఉన్న అగనంపూడి డిపోవద్ద టన్ను ఇసుక రూ.1394లు, అనకాపల్లి జిల్లా నక్కపల్లి డిపోవద్ద వద్ద టన్ను ఇసుక ధర రూ.1125లు దాదాపు ఇవే రేట్లతో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గాల్లో ఇసుక అందించిందని పేర్కొంది.అంతేకాదు నియోజకవర్గాల వారీగా రేట్లు ప్రకటించి అత్యంత పారదర్శకంగా ఇసుకను వైసీపీ అందించిందని, యస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ప్రజలు చెల్లించిన ధర నేరుగా ప్రభుత్వ ఖజానాకు ఏడాదికి రూ.750 కోట్లు చేరిందని, ఇప్పుడు ఈ డబ్బు నేరుగా టీడీపీ కూటమి నాయకుల జేబుల్లోకి వెళ్తోందని ఆరోపించింది. అలానే మీరు ఎన్ని మాయమాటలు చెప్పినా ప్రజలు విజ్ఞులని.. వారు అన్ని గమనిస్తూనే ఉంటారని. సరైన సమయంలో బుద్ధి చెబుతారని వైసీపీ ట్వీట్ చేసింది.
కాగా ఈ ట్వీట్పై టీడీపీ ఘాటుగా స్పంధించింది. అవును ఇసుక ఫ్రీనే.. ఇసుకకి రూపాయి తీసుకున్నట్టు నిరూపిస్తే, జగన్ను అసెంబ్లీలో మొదటి బెంచీలో కూర్చోపెట్టమని, చంద్రబాబుకు రిఫర్ చేస్తామని తెలిపింది. నువ్వు ఎంత విష ప్రచారం చేసినా, ఉచిత ఇసుక తీసుకునే ప్రజలకు తెలుసని, 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులకు తెలుసని.. నువ్వు ఎంత తప్పుడు ప్రచారం చేస్తే, అంత దిగజారుతావంటూ టీడీపీ మండిపడింది. ఇసుక ఫ్రీ.. అనేది 2019కి ముందే ఉన్న విధానం అని.. ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదని స్పష్టం చేసింది. లోడింగ్, రవాణా చార్జీలు భరించాలి.. అవి కూడా ఫ్రీ ఇవ్వాలంటే, ఎలాగూ తాడేపల్లి కొంపలో ఖాళీనేగా, వచ్చి లోడింగ్ చేస్తే ప్రజలకు లోడింగ్, రవాణా చార్జీలు కూడా ఉండవని.. ప్రజలకు కూడా సేవ చేసినట్టు ఉంటుందని జగన్ను ఎద్దేవా చేసింది. ఒకసారి మీ ముఠా ఆలోచించండి అంటూ టీడీపీ ట్వీట్ చేసింది.
Free sand is for real traders | ఉచిత ఇసుక రియల్ వ్యాపారులకేనా | Eeroju news