TTD ఉద్యోగుల డ్రెస్సుపై నేమ్ బోర్డు

BR NAIDU

TTD ఉద్యోగుల డ్రెస్సుపై నేమ్ బోర్డు

తిరుమల, డిసెంబర్ 12, (న్యూస్ పల్స్)
తిరుమలకు వెళ్తున్నారా.. అయితే ఈ కొత్త రూల్ గురించి తెలుసుకోండి. శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా, అన్ని చర్యలు చేపడుతున్న టీటీడీ మరో కొత్త రూల్ ప్రవేశపెట్టింది. ఈ రూల్ తో భక్తులకు మెరుగైన సేవలు అందించడమే టీటీడీ లక్ష్యంగా కనిపిస్తోంది. టీటీడీ చైర్మన్ గా నియమితులైన బీఆర్ నాయుడు మరో కొత్త రూల్ ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించారు. ఇంతకు ఆ రూల్ ఏమిటి? అసలు ఈ రూల్ తో భక్తులకు ఏమేర మంచి చేకూరనుందో తెలుసుకుందాం.
కలియుగ వైకుంఠం శ్రీ శ్రీనివాసుడి దర్శనార్థం దేశ విదేశాల నుండి తిరుమలకు భక్తులు వస్తుంటారు. అటువంటి భక్తులు ప్రధాన ఎదుర్కొంటున్న సమస్యలపై టీటీడీ కొత్త చైర్మన్ ప్రత్యేక దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో కొత్త రూల్ ప్రవేశపెడుతున్నట్లు స్వయంగా చైర్మన్ వెల్లడించారు. కొందరు టీటీడీ ఉద్యోగులు భక్తుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారని తన దృష్టికి వచ్చిందని, భక్తుల పట్ల దురుసుగా ప్రవర్తించే ఉద్యోగులపై చర్యలకు వెనుకాడబోనని చైర్మన్ తెలిపారు.భక్తులకు అసౌకర్యం కలిగించే టీటీడీ ఉద్యోగులను గుర్తు పట్టేందుకు ఉద్యోగుల దుస్తులపై త్వరలోనే నేమ్‌ బ్యాడ్జ్‌ ఏర్పాటు చేయాలని టీటీడీ భావిస్తోంది. ఎందుకంటే కొందరు ఉద్యోగులు భక్తుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారని, అటువంటి వారిని గుర్తించేందుకు టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నేమ్‌ బ్యాడ్జ్‌ ఇవ్వడం ద్వారా భక్తుల పట్ల అమర్యాదగా వ్యవహరించిన వారిని గుర్తించే అవకాశం ఉంటుంది.శ్రీనివాసుని దర్శనం కోసం సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల పట్ల బాధ్యతాయుతంగా, అంకితభావంతో టీటీడీ ఉద్యోగులు ప్రవర్తించేందుకు ఈ బ్యాడ్జ్‌ విధానం ఉపయోగకరంగా ఉంటుందని టీటీడీ పాలకమండలి భావిస్తోంది. టీటీడీ అన్ని విభాగాల్లో పనిచేసే ప్రతీ ఉద్యోగికి ఈ నేమ్‌ బ్యాడ్జ్‌ త్వరలోనే ఇచ్చేందుకు టీటీడీ ప్రయత్నం చేస్తోంది.ఈ రూల్ అమల్లోకి వస్తే, ఎవరైనా టీటీడీ ఉద్యోగి అమర్యాదగా ప్రవర్తిస్తే, మీరు ఆ నేమ్ బ్యాడ్జీ ద్వారా అతని వివరాలతో నేరుగా టీటీడీకి ఫిర్యాదు చేయవచ్చు. ఈ పద్దతి ద్వారా భక్తులకు మెరుగైన సేవలను టీటీడీ ఉద్యోగులు కూడా అందించే వీలుంటుంది. అందుకే తిరుమలలో కొత్తగా అమలయ్యే ఈ రూల్ గురించి మీరు తెలుసుకోవాల్సిందే.

Read : Tirumala : 16 నుంచి ధనర్మాసం..ప్రభాత సేవకు బదులు తిరుప్పావై

Related posts

Leave a Comment