. ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు చేయాలి.
జయశంకర్ భూపాలపల్లి,
ఇంటర్ మీడియట్ పరీక్షలు నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు.
హైదరాబాద్ నుండి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇంటర్ పరీక్షలు నిర్వహణకు ఏర్పాట్లు, ఎల్ ఆర్ ఎస్ పెండింగ్ దరఖాస్తులు పూర్తి చేయు అంశాలపై శుక్రవారం అన్ని జిల్లాల కలెక్టర్లుతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఐడిఓసి కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పాల్గొన్నారు.
వీడియో కాన్ఫరెన్స్ అనంతరం రెవెన్యూ, ఇంటర్, పంచాయతి రాజ్, మున్సిపల్, విద్యుత్, మున్సిపల్, ఆర్టీసీ, వైద్య, శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….
ఈ నెల 5వ తేదీ నుండి 22వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
జిల్లాలో ఇంటర్ పరీక్షలు నిర్వహణకు 8 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 34 కళాశాలల నుండి మొదటి, రెండవ మరియు వృత్తి విద్యా కోర్స్ అభ్యర్థులు మొత్తం 3720 మంది పరీక్షకు హాజరు అవుతున్నట్లు తెలిపారు.
గ్రామీణ ప్రాంతాల నుండి విద్యార్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకోవడానికి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయాలని ఆర్టీసీ అధికారులకు సూచించారు. ఉదయం 8 నుండి మధ్యాహ్నం 1.30 వరకు విద్యుత్ సమస్య రాకుండా నిరంతరాయ సరఫరా చేయాలని విద్యుత్ అధికారులకు సూచించారు. మెటీరియల్. పకడ్బందీగా పోలీస్ స్టేషన్లలో భద్రపచారాలని సూచించారు.
సురక్షిత మంచినీరు సరఫరా చేయాలని ఆదేశించారు. సమీపంలోని జిరాక్స్ కేంద్రాలు మూసి వేయించాలని తెలిపారు. బాలురు, బాలికలను పరీక్షా కేంద్రంలోనికి అనుమతించే ముందు తనిఖీ చేయాలని, సెల్ ఫోన్, ఎలక్ట్రానిక్ వాచీలు, ఇతర పరికరాలు పరీక్షా కేంద్రంలోకి అనుమతి లేదని ఆయన స్పష్టం చేశారు. అత్యవసర వైద్య సేవల కేంద్రాలను ఏర్పాటు చేయాలని వైద్యాధికారులను ఆదేశించారు. ఎల్ ఆర్ ఎస్ దరకాస్తుల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. దరఖాస్తు దారుల సమాచారం ఆధారంగా లేఖలు, ఫోన్ చేయాలని సూచించారు. ఈ నెలాఖరు వరకు ఎల్ ఆర్ ఎస్ దరకాస్తుల విచారణ పూర్తి చేయాలని అన్నారు. ఇరిగేషన్, పంచాయతి రాజ్, మున్సిపల్, రెవెన్యూ అధికారులు క్షేత్ర స్థాయిలో విచారణ చేయాలని తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, డిపిఓ నారాయణరావు, ఇంటర్మీడియట్ అధికారి వెంకన్న, డీఈఓ రాజేందర్ విద్యుత్ శాఖ ఎస్ ఈ మల్చూర్ నాయక్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, ఆర్టీసీ డిఎం ఇందు, వైద్య తదితర శాఖల తదితరులు పాల్గొన్నారు