బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను లొంగదీసుకునే ప్రయత్నం చేస్తున్నారు : హరీష్ రావు
సంగారెడ్డి
Trying to subjugate BRS MLAs: Harish Rao
పటాన్ చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి సోదరుల ఇండ్లలో ఈడీ దాడులపై సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు.శుక్రవారం అయన మహిపాల్ రెడ్డిని పరామర్శించారు హరీశ్ రావు మాట్లాడుతూ అధికారంలో ఉన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ఈడీ,ఐటీ దాడులతో వేధిస్తున్నారు. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఇంట్లో ఏలాంటి అవినీతి ఆస్తులు దొరకలేదు. బిఆర్ఎస్ ఎమ్మెల్యే లను భయపెట్టి లొంగదీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. బీహార్, గుజరాత్ లలో నీట్ ప్రశ్నాపత్రాలను అమ్ముకున్నారు. ప్రశ్నాపత్రాలు లీకవుతున్నా అధికారులు ఎందుకు వారిపై దాడులు చేయటం లేదు. మన రాష్ట్రంలో లక్ష కుటుంబాలు నీట్ పరీక్ష వ్రాశారు, వారిభవిష్యత్తు అయోమయంలో ఉంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం బిఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఒత్తిడికి గురిచేస్తుంది. బిఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇళ్లు చుట్టూ తిరుగుతూ.. అధికారపార్టీ బెదిరింపు ధోరణికి పాల్పడుతున్నారు. ఇంట్లో చిన్న పిల్లలు ఏడుస్తున్నా కర్కశంగా ఎమ్మెల్యే ఇంట్లో ఈడీ దాడులు చేయటం దారుణమని అన్నారు.
Raids by Food Safety Officers in Secunderabad | సికింద్రాబాద్ లో ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు