టీచర్ల బదిలీలు…విద్యార్దుల రోదనలు
సిద్దిపేట
Transfers of teachers cries of students
ఉపాధ్యాయులు బదిలీపై వెళ్తే వారికి సన్మానం చేయడం, ఆరోజు వరకు తమ బాధను వ్యక్తం చేయడం సహజంగా చూస్తుంటాం. అయితే ఉపాధ్యాయుల కోసం విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కన్నీళ్లు పెట్టుకోవడం వారి మధ్య ఉన్న అనుబంధం గొప్పతనాన్ని గుర్తుచేసింది. ఈ సంఘటన సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం ఆకునూరు గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో సోమవారం జరిగింది. ఈ పాఠశాలలో 123 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇంచార్జి హెచ్ఎం సందిటి సులోచన, ఉపాధ్యాయులు తాటికొండ యాదయ్య, గొంటి బుచ్చయ్య, అక్కెనపల్లి ఇంద్రసేన రెడ్డి, ఉప్పల భాస్కర్, కామిడి రత్నమాల, పనిచేస్తున్నారు.
వీరిలో ఒక్క టీచర్ మెడిచెల్మి అయోధ్య కు ప్రమోషన్ రావడంతో అదే పాఠశాలలో హెచ్ఎంగా బాధ్యతలు చేపట్టారు. మిగతా అందరూ బదిలీ అయ్యారు. ఇన్నేళ్లుగా పిల్లలు, వారి తల్లిదండ్రులతో ఆప్యాయంగా మెదులుతూ పిల్లలు బడికి రాకుండా మానేస్తుంటే వారి ఇళ్లకు వెళ్లి నచ్చచెప్పి తీసుకువచ్చేవారు. బడిలో విద్యాబుద్ధులు నేర్పుతూ, మధ్యాహ్న భోజనం విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపిండంతోపాటు విద్యార్థులకు క్రీడలు, పాటలు, కోలాటం, సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు నవోదయ, మోడల్ స్కూల్ పరీక్షలు రాయించడం, పాఠశాల విద్యా కమిటీ సమావేశంలో ప్రత్యేక శ్రద్ధ వహించేవారు.
అదేవిధంగా విద్యార్థులకు నోట్ పుస్తకాలు, పెన్నులను కొనిస్తుండేవారు. ఈ క్రమంలో టీచర్లు బదిలీ అవుతున్నారనే విషయాన్ని తెలుసుకున్న పాఠశాల విద్యార్థులంతా వారి దగ్గరకు వెళ్లి సార్ మీరు పోవద్దూ, మీరు వెళ్తే మేము బడికి రాలేమంటూ దుఃఖసాగరంలో మునిగిపోయారు. పిల్లలు తనపై పెంచుకున్న ప్రేమకు ఉపాధ్యాయులు కన్నీళ్లు పెట్టుకున్నారు. విషయం తల్లిదండ్రులకు తెలియడంతో వారంతా బడికి చేరుకున్నారు. పిల్లలు టీచర్ల ను తలుచుకుంటూ రోదిస్తున్న తీరు చూసి తల్లిదండ్రులు సైతం కన్నీళ్లు పెట్టుకున్నారు.
ప్రైవేట్ పాఠశాలలో అనధికార పుస్తకాలు సీజ్ | Seize unauthorized books in private school | Eeroju news