Trains to Andhra:ఆంధ్రకు స్పెషల్ ట్రైన్స్

Special trains to Andhra...

సంక్రాంతి అంటేనే తెలుగు ప్రజలకు పెద్ద పండుగ. ఉద్యోగ, ఉపాధి నిమిత్తం వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన వారంతా ఆ 3 రోజులూ తమ కుటుంబంతో సంతోషంగా గడిపేందుకు సొంతూళ్లకు పయనమవుతారు.

ఆంధ్రకు స్పెషల్ ట్రైన్స్..

హైదరాబాద్, జనవరి 6
సంక్రాంతి అంటేనే తెలుగు ప్రజలకు పెద్ద పండుగ. ఉద్యోగ, ఉపాధి నిమిత్తం వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన వారంతా ఆ 3 రోజులూ తమ కుటుంబంతో సంతోషంగా గడిపేందుకు సొంతూళ్లకు పయనమవుతారు. ఈ క్రమంలో రద్దీ దృష్ట్యా ద.మ రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. 52 అదనపు రైళ్లు నడపనున్నట్లు అధికారులు వెల్లడించారు. నగరంలోని సికింద్రాబాద్, కాచిగూడ, చర్లపల్లి రైల్వే స్టేషన్ల నుంచి కాకినాడ, నర్సాపూర్, తిరుపతి, శ్రీకాకుళం ప్రాంతాలకు ఈ సర్వీసులు నడపనున్నట్లు తెలిపారు. ఈ నెల 6 నుంచి 18వ తేదీ వరకూ ఆయా ప్రాంతాలకు ఇవి అందుబాటులో ఉంటాయని చెప్పారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.
ఈ నెల 8, 9, 11, 12, 15, 16 తేదీల్లో చర్లపల్లి – తిరుపతి – చర్లపల్లి (02764/02763) మొత్తం 6 సర్వీసులు అందుబాటులో ఉంటాయి.
ఈ నెల 13న వికారాబాద్ – కాకినాడ టౌన్ (07037), ఈ నెల 14న కాకినాడ టౌన్ – చర్లపల్లి (07038).
ఈ నెల 9, 10, 16, 17 తేదీల్లో కాచిగూడ – తిరుపతి – కాచిగూడ మొత్తం 4 సర్వీసులు నడపనున్నారు.
ఈ నెల 11, 12, 18, 19 తేదీల్లో చర్లపల్లి – నర్సాపూర్ – చర్లపల్లి (07035/07036)
ఈ నెల 12, 19 తేదీల్లో కాకినాడ టౌన్ – సికింద్రాబాద్
ఈ నెల 7, 8, 9, 10, 13, 14, 15, 16, 17, 18 తేదీల్లో చర్లపల్లి – నర్సాపూర్ – చర్లపల్లి (07033/07034) మొత్తం 10 సర్వీసులు అందుబాటులో ఉంటాయి.
ఈ నెల 8, 9, 10, 11, 12, 13, 14, 15 చర్లపల్లి – కాకినాడ టౌన్ – చర్లపల్లి (07031/07032) మొత్తం 8 సర్వీసులు నడపనున్నారు.
ఈ నెల 6, 7, 13, 14 తేదీల్లో నాందేడ్ – కాకినాడ టౌన్ – నాందేడ్ (07487/07488).
ఈ నెల 9, 10, 12, 13, 14, 15 తేదీల్లో చర్లపల్లి – శ్రీకాకుళం రోడ్ – చర్లపల్లి (07025/07026) 6 సర్వీసులు అందుబాటులో ఉండనున్నాయి.
ఈ నెల 7, 8 తేదీల్లో కాచిగూడ – శ్రీకాకుళం రోడ్ – కాచిగూడ (07041/07042) రైళ్లు నడపనున్నట్లు అధికారులు వెల్లడించారు.

Read:Hyderabad:చైనాలో కొత్త వైరస్.. తెలుగు రాష్ట్రాలు అలెర్ట్

Related posts

Leave a Comment