నేడు అంతర్జాతీయ గ్రహశకల దినోత్సవం
Today is International Asteroid Day
STORY 1
అంతర్జాతీయ గ్రహశకల దినోత్సవాన్ని (ఆస్టరాయిడ్) దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జూన్ 30న నిర్వహిస్తారు. 1908, జూన్ 30న రష్యా సమాఖ్య, సైబీరియాపై తుంగస్కా గ్రహశకలం ప్రభావంకు గుర్తుగా, గ్రహాల గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంతో ఈ దినోత్సవం జరుపుతారు. ఇటీవలికాలంలో భూమిపై అత్యంత హానికరమైన గ్రహశకలానికి సంబంధించినత సంఘటన ఇది. 1908, జూన్ 30న రష్యాలోని సైబీరియా స్టోనీ తుంగుస్కా నది సమీపంలోని భూమిని అతిపెద్ద గ్రహశకలం ఢీకొట్టడంతో దాదాపు 2,072 చ.కి.మీ. విస్తీర్ణంలో అటవీ ప్రాంతం నాశనమైంది. దానికి గుర్తుగా జూన్ 30న అంతర్జాతీయ గ్రహశకల దినోత్సవంగా జరుపుతున్నారు.
ఐక్యరాజ్యసమితి తన తీర్మానంలో ప్రతి సంవత్సరం జూన్ 30 న ప్రపంచవ్యాప్తంగా ఈ దినోత్సవాన్ని జరుపుకోవాలని ప్రకటించింది. గ్రహశకలం దినాన్ని స్టీఫెన్ హాకింగ్, చిత్రనిర్మాత గ్రిగోరిజ్ రిక్టర్స్, బి 612 ఫౌండేషన్ ప్రెసిడెంట్ డానికా రెమి, అపోలో 9 వ్యోమగామి రస్టీ ష్వీకార్ట్, క్వీన్ గిటారిస్ట్ ఖగోళ భౌతిక శాస్త్రవేత్త బ్రియాన్ మే కలిసి స్థాపించారు. రిచర్డ్ డాకిన్స్, బిల్ నై, పీటర్ గాబ్రియేల్, జిమ్ లోవెల్, అపోలో 11 వ్యోమగామి మైఖేల్ కాలిన్స్, అలెక్సీ లియోనోవ్, బిల్ అండర్స్, కిప్ థోర్న్, లార్డ్ మార్టిన్ రీస్, క్రిస్ హాడ్ఫీల్డ్, రస్టీ ష్వీకార్ట్, బ్రియాన్ కాక్స్ సహా 200 మంది వ్యోమగాములు, శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులు, కళాకారులు గ్రహశకల దినోత్సవ ప్రకటనకు సంతకాలు చేశారు.
2014, డిసెంబరు 3న ఈ అంతర్జాతీయ గ్రహశకల దినోత్సవం అధికారికంగా ప్రారంభించబడింది. 2014, ఫిబ్రవరిలో రాక్ బ్యాండ్ క్వీన్ కోసం ఖగోళ భౌతిక శాస్త్రవేత్త, గిటారిస్ట్ బ్రియాన్ మే 51 డిగ్రీ నార్త్ చిత్రానికి దర్శకుడు గ్రిగోరిజ్ రిక్టర్స్ తో కలిసి పనిచేయడం ప్రారంభించాడు. లండన్ పై కల్పిత ఉల్క ప్రభావ సంఘటన ఫలితంగా ఏర్పడిన మానవ పరిస్థితుల నేపథ్యంతో రూపొందించిన ఈ చిత్రానికి బ్రియాన్ మే సంగీతం సమకూర్చాడు. ఈ చిత్రాన్ని 2014 స్టార్‌మస్ ఫెస్టివల్‌లో ప్రదర్శించిన తరువాత రెమి, ష్వీకార్ట్, రిక్టర్స్, మే కలిసి 2014, అక్టోబరులో ఈ దినోత్సవాన్ని స్థాపించి.. లార్డ్ మార్టిన్ రీస్, రస్టీ ష్వీకార్ట్, ఎడ్, థామస్ జోన్స్, రియాన్ వాట్, బిల్ నై విలేకరుల సమావేశంలో అధికారికంగా ప్రకటించారు.
ఈ కార్యక్రమం లండన్ లోని సైన్స్ మ్యూజియం, కాలిఫోర్నియా అకాడమీ ఆఫ్ సైన్సెస్, న్యూయార్క్, సావో పాలో నుండి ప్రత్యక్షప్రసారం చేయబడింది. 2017 గ్రహశకలం దినోత్సవం రోజున, మైనర్ గ్రహం 248750 ను అంతర్జాతీయ ఖగోళ యూనియన్ అధికారికంగా గ్రహశకలం అని పిలిచింది. ఈ దినోత్సవం రోజున గ్రహశకలాల స్థితిన గమనించి భూమిని, భవిష్యత్ తరాలను ఆయా విపత్తు సంఘటనల నుండి రక్షించడానికి చేయవలసిన కార్యకలాపాల గురించి చర్చలు జరుపుతారు.
All eyes on Amaravati… | అమరావతిపై అందరి కళ్లు… | Eeroju news