Tirupati Laddu Controversy | దూకుడు పెంచిన సిట్… | Eeroju news

Tirupati Laddu Controversy

దూకుడు పెంచిన సిట్…

తిరుమల, నవంబర్ 29, (న్యూస్ పల్స్)

Tirupati Laddu Controversy

తీవ్ర దుమారం లేపిన తిరుమల లడ్డూ ఇష్యూపై స్పెషల్ సిట్ దర్యాప్తు స్టార్ చేస్తోంది. లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారన్న ఆరోపణలపై సోదాలు కంటిన్యూ అవుతున్నాయి. పూర్తిస్థాయి విచారణ చేపట్టేందుకు రంగంలోకి దిగారు అధికారులు. సిట్ కోసం తిరుపతి భూదేవి కాంప్లెక్స్ లో తాత్కాలిక కార్యాలయం ఏర్పాటు చేశారు.సిట్ అధికారులు నాలుగు టీమ్లుగా ఏర్పడి విచారణ చేస్తున్నారు. నెయ్యి సప్లై చేసిన ఏఆర్డెయిరీ ఫుడ్స్ను సిట్ సభ్యులు పరిశీలించనున్నారు. అలాగే తిరుమలలో లడ్డూ పోటు, లడ్డూ సెంటర్ల పరిశీలనతో పాటు..లడ్డూ తయారుచేసే వారిని కూడా ప్రశ్నించే అవకాశం ఉందంటున్నారు. పూర్తి విచారణ తర్వాత సీబీఐ డైరెక్టర్కు సిట్బృందం రిపోర్ట్ ఇవ్వనుంది.

తిరుమల లడ్డూ తయారీకి వాడే నెయ్యిలో కల్తీ జరిగినట్లు NDDB రిపోర్ట్లో బయటపడిన అంశంపై స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ దర్యాప్తు చేస్తుంది. సుప్రీంకోర్టు ఆదేశాలతో సీబీఐ నుంచి ఇద్దరు అధికారులతో పాటు రాష్ట్రం నుంచి ఇద్దరు, ఎఫ్ఎస్ఎస్ఏఐ నుంచి మరో అధికారి ప్రత్యేక బృందంలో నియమితులయ్యారు.టీమ్‌లో మొత్తం నలుగురు డీఎస్పీలుండగా వారిలో ముగ్గురి ఆధ్వర్యంలో సిబ్బంది మూడు బృందాలుగా ఏర్పడ్డారు. ఒక టీమ్ వైష్ణవి డెయిరీకి, మరో టీమ్ తమిళనాడులోని దిండుగల్కు చెందిన ఏఆర్డెయిరీకి, ఇంకోటి చెన్నైలోని ఎస్ఎంఎస్ల్యాబ్ కు వెళ్లాయి. టీటీడీకి కల్తీ నెయ్యి సప్లై చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏఆర్డెయిరీ..తాము పంపిన నెయ్యి నాణ్యమైనదిగా చెప్తూ SMS ల్యాబ్ సర్టిఫికెట్ను సమర్పించడంతో సిట్ బృందం దానిపై దృష్టి పెట్టింది.

ఏఆర్డెయిరీ నెయ్యి నాణ్యతపై ఆ ల్యాబ్ఇచ్చిన సర్టిఫికెట్నిజమా.? కాదా.? నెయ్యి నాణ్యతను ఎలా సర్టిఫై చేశారు.? ల్యాబ్లో క్వాలిటీ చెకింగ్ ఎక్స్పర్ట్స్ ఉన్నారా.? లేదా.? అని ఆరా తీస్తున్నారట. ఏఆర్డెయిరీ నెయ్యి నాణ్యతను పరీక్షించి, క్వాలిటీ సర్టిఫికెట్ఇచ్చిన ఎక్స్పర్ట్స్ వివరాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. సిట్కీలక అధికారులు ఎంట్రీ ఇచ్చాక దర్యాప్తు మరింత లోతుగా జరిగే అవకాశం ఉందంటున్నారు.వైష్ణవి డెయిరీ, ఏఆర్ డెయిరీలో తనిఖీలు చేపట్టాయి సిట్ టీమ్స్. ఈ రెండు డెయిరీల కెపాసిటీపై ఆరా తీసినట్లు తెలుస్తోంది. ఆ డెయిరీలు ఎప్పుడు ఏర్పాటయ్యాయి.? వాటికి ఎన్ని చిల్లింగ్ సెంటర్లు ఉన్నాయి.? వాటి నెయ్యి ఉత్పత్తి సామర్థ్యం ఎంత.? పాలు ఎక్కడి నుంచి సేకరిస్తున్నారనే దానిపై వివరాలు సేకరిస్తున్నట్లు సమాచారం.

టీటీడీకి ఈ డెయిరీలే స్వయంగా నెయ్యి తయారు చేసి సరఫరా చేస్తున్నాయా లేక ఇతర డెయిరీల నుంచి సేకరించి పంపుతున్నాయా? అనే కోణాల్లో దర్యాప్తు జరుగుతోందట. రెండు డెయిరీల రికార్డులు పరిశీలించి పలు డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం.స్పెషల్ సిట్ దర్యాప్తుతో మళ్లీ హడావుడి కనిపిస్తోంది. ఏపీ ప్రభుత్వం వేసిన సిట్ మీద ఆరోపణలు రావడం..అంతలోనే సుప్రీంకోర్టులో విచారణ జరగడంతో..స్పెషల్ సిట్ ఫామ్ అయింది. అయితే కల్తీ వ్యవహారం విషయంలో స్పెషల్ సిట్ అధికారులు ఏం తేలుస్తారానేది ఇంట్రెస్టింగ్గా మారింది. తీవ్ర దుమారం లేపి సుప్రీంకోర్టు తీర్పు తర్వాత సైలెంట్ అయిపోయిన ఈ ఇష్యూ మళ్లీ స్పెషల్ సిట్ రిపోర్టుతో హాట్ టాపిక్ అయ్యే అవకాశం ఉంది.

రాజకీయ అంశాలతో ముడిపడి ఉన్న వివాదం కావడంతో స్పెషల్ సిట్ దర్యాప్తు అటు టీటీడీ అధికారుల్లోనూ..ఇటు పొలిటికల్గానూ చర్చనీయాంశం అవుతోంది. అయితే ప్రత్యేక దర్యాప్తు అధికారులు మాత్రం హడావుడి లేకుండా తమ పని తాము చేసుకుంటూ పోతున్నట్లు తెలుస్తోంది. ఇంకా సిట్ టీమ్లో ఉన్నతస్థాయి అధికారులు రంగంలోకి దిగలేదని..ఆ తర్వాత వరుస పెట్టి విచారణలు ఉంటాయంటున్నారు. పూర్తిస్థాయి దర్యాప్తు స్టార్ట్ అయితే ఎవరెవరిని విచారిస్తారనేది ఉత్కంఠ రేపుతోంది.

Tirupati Laddu Controversy

 

Tirupati Laddu | తిరుపతి లడ్డు వివాదంపై సుప్రీం కోర్టు తాజా దర్యాప్తు | Eeroju news

Related posts

Leave a Comment