స్టీల్ పరిశ్రమలో భారీ పేలుడు
– భారీ శబ్దంతో ఒక్కసారిగా పేలిన రెండు బాయిలర్లు
– ఈ ఘటనలో పలువురు మృతి చెంది ఉంటారని అనుమానం
– మరికొందరికి తీవ్ర గాయాలు
– అర్దరాత్రి స్టీల్ పరిశ్రమ ఎదుట నెలకొన్న తీవ్ర ఉత్కంఠత
తిరుపతి
జిల్లా పెళ్లకూరు మండలం పెన్నేపల్లి వద్ద ఉన్న ఎమ్మెస్ అగర్వాల్ స్టీల్ పరిశ్రమలో బుధవారం రాత్రి 10 గంటల సమయంలో పెను ప్రమాదం చోటుచేసుకుంది. పరిశ్రమంలోని రెండు బాయిలర్లు ఒక్కసారిగా పేలినట్లు స్థానికులు చెబుతున్నారు. దీంతో భారీగా విస్ఫోటనం జరిగినట్లు తెలుస్తుంది. ఈ ఘటనతో పరిశ్రమలోని పలువురికి తీవ్ర గాయాలు కావడంతో అంబులెన్స్ లలో క్షతగాత్రులను నాయుడుపేట, నెల్లూరు ప్రభుత్వాసుపత్రులకి తరలించారు. ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలుడు సంభవించడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఉలిక్కిపడ్డట్టు ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. పేలుడు దాటితో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదిలా ఉంటే భారీ శబ్దంతో పేలుడు సంభవించడంతో పరిశ్రమలో పనిచేస్తున్న పలువురు మృతిచెందవచ్చని అనుమానాలు వ్యక్తం అవుతున్నట్టు స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయాన్ని పరిశ్రమ నిర్వాహకులు గోప్యంగా ఉంచారు. దీంతో అక్కడ ఉత్కంఠ నెలకొంది